పరిచయం
సూర్యుడు, చంద్రుడు మొదలైన నవ గ్రహాలకు సంబంధించిన లక్షణాలకు సామ్యంగా భూమిలోనూ, జలంలోనూ లభ్యమయ్యే కొన్ని రత్నాలను నిర్దేశించడం జరిగింది. వానిలో ముఖ్యంగా కెంపు, ముత్యం, పడగం, పచ్చ, పుష్యరాగం, వజ్రం, నీలం, గోమేధికం, వైడూర్యం అనే ప్రత్యేక రత్నాలను నవగ్రహాలకు చెందున రత్నాలుగా గుర్తించారు. వీటికి అనుబంధ రత్నాలు కూడా చాలా రకాలుగా భూమిలో లభిస్తూనే ఉన్నాయి. కాని వీటికే అధికమైన గుర్తింపు లభించింది. ఈ నవరత్నాలలోని దోషాలను, గుణాలను గమనించడం జ్యోతిష విద్యార్థికి అత్యవసరం, జ్యోతిషంలోని గ్రహలోపాలకు సరియైన రత్నాన్ని సూచించే సందర్భంలో రత్నజ్ఞానం ఆవశ్యకం. ఈ పాఠం నవరత్నాలకు సంబంధించిన గుణదోషాలను, వివరాలను పరిచయం చేస్తుంది.