ఉద్దేశ్యం
నవరత్న ధారణ పూర్వకాలం నుండీ భారతీయులకు అలవాటులో ఉంది. రాజ పరివారం 'ఏడు వారాల నగలు' ధరించిన సందర్భంలోనూ ప్రతి వారానికి సంబంధించిన రత్నాలను కూడా ప్రత్యేకంగా ధరించేవారు. దేవతామూర్తుల విగ్రహాలకున్న మణులలోనూ రత్నాలకు విశేషస్థానమున్నది. ఈ నవరత్నాలు ప్రాకృతికంగా మొదటి నుండీ లభిస్తుండగా ప్రస్తుతం రసాయన పదార్థాలతోనూ నిర్మితమౌతున్నాయి. అందుకే రత్న పరిజ్ఞానం అందరికీ అవసరం అవుతుంది. నిజమైన రత్నం యొక్క లక్షణం. దాని స్వచ్ఛత, మంచి చెడులను గమనించే విధానం అన్నింటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. స్వచ్చమైన రత్నధారణ ద్వారా ఉన్నతమైన ఫలితాలను ఎన్నింటినో పొందవచ్చును. ఆ మార్గంలో కొంత సమాచారాన్ని తెలియజేయడానికి ఈ పాఠ్యభాగం ఉద్దేశించబడింది.