ముగింపు
రాశుల కారకత్వాలను కేవలం ఉన్నదానిని చదవడం కాకుండా, ఆయా కారకత్వాలు ఆ రాశులకు ప్రత్యేకంగా ఎందుకివ్వబడినయో విశ్లేషించడం అవసరం. ఆ రూపంలో అధ్యయనం కొనసాగుతుంటే నూతన అంశాల విశ్లేషణలు వస్తాయి. కొత్త విశేషాలేవైనా ఏర్పడినప్పటికీ వాటికి సంబంధించిన ప్రత్యేక సూత్రాలను, కారకత్వాలను విద్యార్ధి స్వతంత్రంగా నిర్ణయించే అవకాశం ఉంటుంది. శరీర సంబంధ, మనో సంబంధమైన అంశాలలాగే, ప్రకృత్తి సంబంధమైన, సంఘ సంబంధమైన ఎన్నో అంశాలు ద్వాదశ రాశులకు సంబంధించిన కారకత్వలలో కనిపిస్తుంటాయి. వాటిని పరిపూర్ణంగా అధ్యయనం చేయడం, నూతన ప్రాతిపదికలను ఏర్పరచుకోవడం ఎంతో అవసరం.