Home » Dwadasha Rasulu Karakatwalu » మీన రాశి
మీన రాశి

సరిరాశి - ద్విస్వభావరాశి - జలతత్త్వరాశి, రెండు చేపలు ఒకదాని తోకవైపునకు మరియొక దాని తల యున్నట్లు ఈ రాశి చిహ్నముంటుంది.

 

పరిసరాలు, ఇతర వ్యక్తుల చేత ప్రభావితమగుట, సందర్భమును అనుసరించి సర్దుకొన గలుగుట, ఓపిక ఓర్పు వీరి వ్యక్తిత్వమునకు మూలసూత్రములు. వీరు ఏవిధముగను ఇతరులకు హాని కలుగజేయువారు కాదు. వీరు స్వభావము సౌమ్యం. ఇతరులను నమ్ముట, వారికంటే గొప్పవారి నిబంధనలకు విధేయులగుట వీరికి సమ్మతం. చట్టము, నియమ నిబంధనలు వీరికి సమ్మతం. వీరికి వీరు విధేయులై కాని శాసకులు కాదు. ఇతరులపై ప్రభావం చూపుటలో అధికారము చెలాయించుట సమ్మతం కాదు. వీరికంటే పై స్థాయిలో ఉన్నవారు కూడా వీరికి అనుకూలముగా ప్రవర్తించుటకు సమ్మతింతురు. వీరికి తెలియకుండగానే వీరు ఇతరులను ప్రభావితం చేస్తారు. దీనిని వీరు గమనించి లోకశ్రేయస్సునాకు ఉపయోగించినచో వారి జీవితం సఫలమైనట్లే. వీరు కన్నులలో ఒక అజ్ఞాత శక్తి యున్నది. వీరి చూపులో మనుష్యులు గాని, జంతువులు గాని బద్దులగుదురు. పశుపక్ష్యాదుల కంఠ ధ్వనులు విన్నచో వీరికి వాని కష్ట సుఖములు సులభముగా బోధపడును. వీరి బంధుమిత్రాదులలో నెవరికో ఒకరికి వీరు సేవ చేయటము, రోగులపై దక్షత వహించుటయు జరుగుచుండును. ఇతరులను బట్టి, మారునట్టి వీరి తత్వమున కొంచెము తక్కువగా నుండును. ఆత్మశక్తి గల మహానుభావులచే ఆకర్షించబడిన వీరు వారిచే ప్రభావితులగుట జరుగును. వీరి మనస్సు సూక్ష్మ గ్రాహ్యము, చంచలము, ఆరంభమునుడి వీరెంతయో పవిత్రమైన మనస్సు కలిగి ఉందురు. నడివయస్సు నుండి సాంగత్యాదుల వలన మనస్సు అపవిత్రమగుటకు వీలున్నది. అట్టి తపనము సంభవించినచో వీరి ఆరోగ్యము, మనః పవిత్రత, సంపద, అదృష్టము త్వరగా చెడిపోవును. మద్యపానాదులు సులభంగా అలవాటగుటకు అవకాశమున్నది. అట్లే స్త్రీ సాంగత్య దోషము కూడా; వీరు ఏదో కారణము వలన తల్లిదండ్రులకు, సోదరులకు దూరంగా నుండుట సంభవించును. వీరుకి చక్కని దర్శనజ్ఞానమున్నది. వీరికి పరిసరములలోని వ్యక్తులు, వస్తువులను గురించిన వాస్తవ విషయములు అప్రయత్నంగా స్ఫురించుచుండును. వీరికి కలిగెడి స్వప్నములు, అనుమానములు, అభిప్రాయములు, సత్యములు అయి ఉంటాయి.

 

వీరి ఆలోచనలు, చాలా సూక్ష్మమై, శక్తివంతమైనవి. మానవత్వములోని సూక్ష్మసూక్ష్మాంశములు వీరికి అవగతమగును. డానికి తోడు భాషలకు గల అతి సూక్ష్మమైన శక్తి వీరి ఆధీనములో ఉండుటతో, వీరు వ్యక్తులతో చక్కని భావ సంచాలము కలిగింపగలరు. కవిత్వ, సాహిత్యరంగమున కూడా వీరు ఉన్నత స్థానమును ఆక్రమించుటకు వీరిలోని ఈ శక్తి మరొక కారణము కాగలదు. వీరి సంభాషణ చాతురిని సద్వినియోగం చేసికొన్నచో మొదటిసారి కాకున్న రెండవ సారియైనను, ఏ ప్రయత్నమునకైనను జయము పొందగలరు. స్వంతః సిద్ధముగా వీరు చాలా మంచివారు, ఏ విషయమును రహస్యముగా దాచుకొనుట వీరికి చేతకాదు. కావుననే, అపకారము తలపెట్టుట. కుట్రలు పన్నుట వీరికి చేతకాదు, వీరు ఆవేశ పూరితులు కావచ్చునే గాని, దుష్టబుద్ధి గలవారు మాత్రం కాజాలరు. వీరికి ఎవరిపైనను కోపము వచ్చినను, వారిలో వారు బాధపడుదురు గాని పగతీర్చుకొనుట వంటివి వీరు చేయలేరు. దుష్టులను మంచివారుగా మార్చుటకై ఆత్మహింస, ఆత్మ బలిగా మలచుకొనుట వీరి మనస్తత్వంలోనే పవిత్రములలో నొకటి. 

 

వీరికి నిత్యము వేధించు అంశములలో వీరిపైన వీరు జాలి పడటము ఒకటి. వీరికి ఎవరు లెక్క చేయుట లేదని, నిర్లక్ష్యం చేయుచున్నారని బాధపడుచుందురు. వీరి వృద్ధాప్యములో వీరు పిల్లలకు ఇది యొక తలనొప్పిగా తయారగును, ఇతరులపై వీరికి వాత్సల్యము, అభిమానములుండవు. కాని అవి హద్దులు దాటిపోయి, వారికొరకు ఎంతటి దుష్కార్యమునైనను చేయించు ప్రమాదము కలదు, స్త్రీల ప్రభావము వీరిపై ఎక్కువగా ఉండును. ఇదియే వారికి ఉన్నతులను చేసినాను, అధః పతనము చేసినాను చేయవచ్చును. వారి జీవితంలో ప్రవేశించిన స్త్రీ ఉత్తమురాలైనచో, వారి జీవితము ఎంత పతనమైనను వారికి ఉద్దరించగలరు. ఆమె నీచబుద్ధి కలదియైన, ఎంత ఉత్తములైనను అధః పతనము చేయగలదు. ప్రజోపయోగకరమైన నిర్మాణములు, కట్టడములు, నగర నిర్మాణము మొదలైన శాఖలలోని ఉద్యోగములలో వీరు రాణింతురు. ఉద్యానవనములు, విలాస, విహార స్థలములు, వైద్యశాలలు, బాల బాలికల పాఠశాలలుకాలేజీలు, బీదవారి కొరకు, రోగులకు నిర్మించబడిన శరణాలయములు మొదలైన వాని నిర్వహణ వీరికి అనుకూలముగా ఉండును, దళారీ వ్యాపారము, వార్తా పత్రిక, పుస్తక ప్రచురణ, ముద్రణాది వ్యాపారములు, రేడియో, సినిమా, కాంతి ప్రసారములకు సంబంధించిన వ్యాపారములు వీరికి అనుకూలములు. సేవాబుద్ధియున్న, వీరు వీరి వ్యత్తులలో విజయమును పొందగలరు.

 

 ప్రజాపయోగ కార్యక్రమములు చేపట్టినచో విజయ వంతము కాగలరు. సంగీతము, నాట్యము, కవిత్వము మొదలగు కళలు వీరికి ఇష్టమగును, దాని ద్వారా దూర, దేశాంతర ప్రయాణములు చేయవలెనని కోరుకొందురు. వీరు జన్మతః తపోదృష్టి కలవారు, కావున ఆధ్యాత్మిక విద్య, ప్రకృత్తి రహస్యములను గ్రహించుట వీరికి సులభమగును మతమునందలి సూక్ష్మ విషయములు వీరికి ఆసక్తి, సంసార జీవితము వీరికి ఆనందం కలిగించును. వీరు తమ కుటుంబ సభ్యులకు అన్ని విధముల ఆనందము చేకూర్చగలరు. వీరికి భార్యా పుత్రుల యెడల వాత్సల్యాభి మానములు ఎక్కువ. వివాహము వీరి జీవితమును చాలావరకు మార్చి వేయగలదు. వీరికి శారీరక ఆరోగ్యము కన్న మానసికమైన అనారోగ్య భయమున్నది. శారీరకముగా మంచి దృఢమైన ఆరోగ్యముండును. పనులు చేయుటలో వీరికి కంగారు, వీరు త్వరగా అలసి, నీరసించి పోవుట ఉండును. ఉద్వెగాదులు వీరి మనస్సును బాధించి, వీరి జీర్ణశక్తిని భంగపరుచును. వీరు ఉద్వేగము చెందినప్పుడు, నిస్సహాయులైనట్లు ఆందోళన పడుట ఉండగలదు. ఇతరులలోని లోపములను గమనింపక అభ్యాసము చేసిన, వీరు వీరు అనారోగ్యమును వారింపవచ్చును. వీరి మానసిక, శారీరక నిర్మాణమునకు ఘాటైన మందులు, ద్రవపదార్ధములు, మత్తు పదార్దములు సరిపడవు. సాలీడు మొదలైన విషపురుగుల ద్వారా ఆహారంలో ప్రవేశించి అనారోగ్యము చేయు ప్రమాదమున్నది. ఆహార విహారాదులలో నియమము అవసరం లేనిచో క్షయ (టి.బి), ఉబ్బసం, మధుమేహం (షుగర్), పక్షవాతము మొదలగు వ్యాధులు తీవ్ర దుష్పరిణామములకు దారితీయగలవు.


TeluguOne For Your Business
About TeluguOne
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.