బేసి - చరరాశి - వాయుతత్త్వపు రాశి, చేతిలో నొక త్రాసును ధరించి తూనికి చేయుచున్న మనిషి చిహ్నము ఈ రాశిది.
వీరికి గల సంబంధములను నిర్ణయించుకొనుట నుద్దేశించి యెక్కువగా వీరి అభిప్రాయములు. వీరి కార్యక్రమము లుండగలవు, వీరు ఇతరులకు చేయవలసిన పనులు, ఇవ్వవలసిన వస్తువులు, డబ్బు, ఇతరులు చేయవలసినది వీరికి బాగుగా గుర్తుండును. సంబంధ బాంధవ్యములకును లెక్కకును సంబంధములేదు. దేనికదే. అనగా "తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే.”
అవకాశమును, కాలమును, ధనమును, సాధన సంపత్తిని సద్వినియోగము చేయుట వీరికి తెలిసినట్లు ఎవ్వరికినీ తెలియదు, పోస్టు స్టాంపులు, గుండుసూదులు, మేకులు, కాగితముముక్కలు కూడా వీరి దగ్గర దేని స్థానమది అనుసరించి యుండును. ఇల్లు కట్టుట, టైం టేబుల్ (కాల ప్రణాళిక) చేయుట, బడ్జెట్ విధము, లేబర్ (పని) గంటలు, జీతపు గంటలు లెక్కించుట వీరికి సహజ గుణములు. కాని ఒక్కొక్కప్పుడు అతి చిన్న వస్తువుల జాగ్రత్తను గూర్చిన నేర్పరితనమున చాదస్తమును చూపి. విలువైన పెద్ద అవకాశమును పోగొట్టు కొనుటయు కలదు, వీరు సామాన్యముగా కోపించరు. ఇతరుల మంచి తనము వలన మిక్కిలి ఉపయోగము ఉన్నదని వీరికి తెలియుని, లెక్కలు తిన్నగా చూపించి వీరిని మోసగించినను అంగీకరింతురు గాని, లెక్క చెప్పుటలో లోపమున్న, వీరికెంత ఉపయోగపడినను వీరు ఉపేక్షించరు.
వీరికి శుచి, శుభ్రత హెచ్చు, పువ్వుల వంటి దుస్తులు చక్కగా అమర్చిన తల్పము (పరుపు), తీర్చిదిద్ది యున్న ఇల్లు. రుచ్యములైన వివిధ భక్ష్య భోజ్యములు, వీరిని ఆకర్షించడమే కాక వీరి కాలమును కూడా కొంత వాటికి వినియోగింతురు. మొక్కలు పెంచుట, చక్కని చిత్ర పటారులను సేకరించుట, వీరికి అభిరుచులు. లలితా కళలన్నా కూడా వీరికి అభిరుచి, అభినివేశము, నైపుణ్యములుండును. కవిత్వము, చిత్రలేఖనము, చలనచిత్ర సంబంధమున వీరికాదాయము, పేరు ప్రఖ్యాతులు కలుగగలవు, గ్రామ జీవనముకన్న నగర జీవనము వీరిని ఎక్కువ ఆకర్షించును, గ్రామ జీవనమునకు సంబంధించిన దృశ్యములు, చిత్రపటములు ఆకర్షించినంతగా వీరిని గ్రామము లాకర్శింపవు. నాగరికతలోని వివిధ నవీనాంశములు వీరిని ఆకర్షించును. శాస్త్ర శాఖలలో పరిశోధన వీరి అభిమాన విద్యయైనచో, అందు రేడియో, టి.వి., వైర్ లెస్ శాఖలలో వీరసమాన ప్రావీణ్యమును గడింపగలరు. జనసామాన్యమును రంజింపచేయుట, అభిమానము, సభా వశీకరణము వీరికి గల మానసికశక్తులు,, కాని యివి అన్నియు చిన్న పిరికితనము అను తెరవెనుక మాటుపడి యుండును, దానిని జయింపనిచో వీరు జనసమూహమునకు భయపడి దూరదూరముగా వుండెదరు. కార్యరంగమునకు దిగుట తప్పనిసరి అయిన సందర్భములో దిగిన వీరు అసాధారణముగా రాణించి సాటివారిని ఆశ్చర్య చికితులను చేయగలరు. పరిసరములను తమని తాము మరచినప్పుడు వీరు రాణించి, జయము పొందుదురు. జన సమూహముతో కలిసియున్నప్పుడు వీరి మనస్సునకు కంగారు, భయము, విసుగు, కలుగును, తప్పించుకొనుటకు ప్రయత్నించెదరు. ప్రశాంతమైన పరిసరములు, వాతారవరణము, రుచికరమైన ఆహారపానీయాలు, నాజూకైన వేషధారణ, వీరిని ఎంతగానో ఆకర్షించును. అటువంటి పరిస్థితులలో ఉన్నంతవరకు, వీరి ప్రజ్ఞకు, కౌశలమునకు, మేధా ప్రదర్శనకు, ప్రభావమునకు లొంగనివారుండరు. మంచిమార్గమునగాని, చెడు మార్గమునుగాని, జనసమూహమును ఉత్సాహవంతులుగా చేసి నడిపించగలరు. ఈ విధముగా నడిపించుట జాతులపైన మరియు దేశములపైన కూడా ప్రభావమును చూపవచ్చును. కాని వీరిలో ఆత్మవిశ్వాసము ఆలస్యముగా కలుగుట వలన మనస్సు, మనోబలము తగ్గిపోవుట చేత ఎక్కువభాగము స్వప్నజగత్తులో విహరించడమే జరుగును.
ఈ రాశిలో జన్మించిన వారిలో వినయ విధేయతలు, చట్టబద్ధముగా, సంప్రదాయ విధంగా జీవితము గడుపవలెనను కుతూహల మెక్కువగా ఉండును. వీరు నిపుణత్వంలో తప్పు చేసినను చట్టబద్ధముగా చూపగలరు. ఘనకార్యములను ఘనముగా ప్రారంభించి చక్కగా నిర్వహించును. చివరి దశలో విసుగు చెంది, విరమించి ఇంకొక అందని దానికై ప్రాకులాడుట వీరి మనః ప్రవృత్తిలో నున్నముఖ్యలోపము, వీరి మేధాశక్తికి మానవులు అంజలి ఘటింపవలెను. వీరిలో చురుకుతనము, సృజనాత్మకశక్తి, భావగాంభీర్యము ఎక్కువ. స్థిరత్వము తక్కువ, ఒక ప్రదేశంలో (గ్రామం, పట్టణం) ఎక్కువకాలం సుఖపడుట, ఒక ఉద్యోగమున గాని, వ్యాపారాది వ్యాసంగములలో గాని, స్థిరపడుట వీరికి సామాన్యముగా సాధ్యపడదు.
ముప్ఫై (30) సంవత్సరముల లోపున నొక క్రమబద్ధమైన వృత్తి, వ్యాపకం అలవడని యెడల వీరటుపై స్థిరముగా పనిచేయలేరు. చిన్నతనము నుండి మనస్సు క్రమబద్ధముగా నున్న న్యాయవాద వృత్తికి, వైద్యవృత్తికిచక్కగా ఉపయోగపడుదురు. ధర్మాధర్మములను వీరు సమానముగా త్రాసువలె చూడగలరు. శాస్త్ర విద్య నార్జించినచో - పదార్థ విజ్ఞానశాస్త్రము నందును, విద్యుత్తు, శబ్దతరంగములు, ఆకాశవాయు ధర్మములు, రేడియో తరంగములు పరిశోధన చేయు శాఖలలో వీరు రాణింతురు. (ఒక లలితా కళను అభిమానించి ప్రావీణ్యమును వహించు వృత్తి కన్న అందెక్కువగా ప్రఖ్యాతి పొందుట జరగ గలదు.) (పైన వివరించిన విద్యలు) సినిమా, నాటక రంగములు, పరిశ్రమ కూడా వీరికి విశేషముగా అనుకూలించును. వీరి అభిమాన విద్యలలో సినిమా రంగము గాని, మల్ల రంగములో గాని తప్పక ప్రాముఖ్యము వహించును.
యుక్త వయస్సులో వివాహమైనచో, నడి వయస్సున మరియొక వివాహము గాని డానికి సమానమైన యోగము గాని జరుగును, వీరు దాంపత్య సుఖజీవనము నందు ఆసక్తి లేకపోయినా, మానసికమైన బహు వ్యాపక గుణముల వలన భౌతిక సుఖములకు మధ్యస్తము నుందురు. ముసలితనమున భార్యను, సంతతిని గురించి శీలశంకలు వీరు మనస్సులో ప్రవేశించకుండా చూచుకొనవలెను. వ్యక్తి స్వాతంత్ర్యముపై, ఇతరుల మంచితనంపై వీరు విశ్వాసము, నమ్మకము వహించియున్నంతవరకు వీరి సుఖమునకు చిట్టాశాంతికి లోపముండదు.
వీరి శారీరక ఆరోగ్యము సామాన్యముగా ఉండును.బాల్యములో ఎత్తునుండి పడుటవలన గాని, ఆయుధ మూలకమువలన గాని -నడుము, మోచేతులు, మోకాళ్ళకు తగిలిన దెబ్బలు అప్పుడప్పుడు బాధపెట్టుచుండును. ఆహారమున మార్పు కలిగినప్పుడల్లా జీర్ణ కోశామునకు సంబంధించిన శూలాది బాధలు - వాంతులు, విరేచనములు మున్నగునవి కలుగు అవకాశమున్నది. 40 వ సంవత్సరం, 49వ సం|| లలో నాడీ మండలమునకు గాని, కడుపుకు సంబంధించిన అనారోగ్యములు కలుగును, సామాన్యముగా స్థలము, వాతావారణం, ఆహార విహారములు మార్పు చెందునప్పుడు వారి ఆరోగ్యము బాగుండదు. మంచు, చల్లనిగాలి వర్షంలో తడియుట వీరికి పనికిరాదు.
స్త్రీలకు గృహ నిర్వహణ, దక్షత, లలిత కళా నైపుణ్యము, చక్కని వస్తువులను సేకరించి, భద్రపరచి వినియోగించుట, భర్తకు పిల్లలకు సుఖముచేకూర్చుట, పాక విద్యలో (వంటలు) ప్రత్యేక ప్రావీణ్యత, వివాహ సంబంధములు కుదుర్చుట. (మ్యారేజ్ బ్యూరోలు) యుండుట. విద్యార్జన వలన ఉత్తమ శ్రేణిలో ఉండగలరు.