Home » Dwadasha Rasulu Karakatwalu » మిథున రాశి
మిథున రాశి

బేసిరాశి, వాయుతత్త్వం మరియు ద్విస్వభావ రాశి. ఈ రాశికి చిహ్నము దంపతులు. సృష్టిలోని ద్వంద్వమూలా పరస్పరత్వము. అంగాంగీభావము. వైవిధ్యము ఈ రాశికి వ్యాఖ్యానమై క్రమంగా మానవునిలోని ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, మానసిక కక్ష్యలను గూర్చిన రహస్యములను తెలుపును.

 

భిన్నతత్త్వములు, ప్రకృతులు గల మానవులతో వీరు ఐక్యము కలిగి సమాధానపడగలరు. ఇతరులను అర్ధం చేసుకోనుటలో, మంచి చెడ్డలను విమర్శించుటలో వీరికి వీరే సాటి, కాని ఇతరులను విమర్శించుట, వారి యందు తప్పులు పట్టుట, మున్నగు విషయములయందు వీరు ప్రవేశించినచో కర్తవ్య విముఖులుగా జీవితమును వ్యర్థము చేసుకొందురు. వీరి పరిశీలన సూక్ష్మము కానీ అభిప్రాయములు అస్థిరములు. ఎదుటివారిని బట్టి స్వభావమును మార్చుకొని ప్రవర్తించుట వీరికి వెన్నతో పెట్టిన విద్య. పరస్పరం ఇచ్చి పుచ్చుకొనుట, వినియోగం వీరికి తెలిసినంతగా ఇతరులకు తెలియదు, భిన్నతత్త్వములు గల ఇద్దరూ వ్యక్తులను సమాధానపరచుట, అట్లే ఒకే త్రాటిపై నడుచుచున్న ఇద్దరినీ వేరుచేయుట కూడ వీరుచేయగల సమర్ధులు. వీరియందు సకల్పశక్తి పని చేయనిచో సంశయాత్ము'లై, కార్యనిర్ణయమున పిరికితనం, ఒక నిర్ణయమునకు రాలేకపోవుట అను బలహీనతలేర్పడును

 

ప్రేమ, త్యాగము, సేవ, ఆనందం అనువానికి వీరు వినియోగ ధర్మములు కనిపెట్టగలరు. సాంఘిక, రాజకీయ, తాత్విక ప్రణాళికలలో వీరి కర్తవ్యం అమోఘమైనది. కాలం, ధనం, వ్యక్తుల సామర్ధ్యాలను అర్థవంతముగా వీరు వినియోగించగల నైపుణ్యముండును. పథకాలను, ప్రణాలికలను అల్లుట యందు వీరికున నేర్పు కార్యరంగంలో ఉండదు. ఇతరులకు సలహాలిచ్చెదరు. కాని తాము ఆచరించలేరు. వీరు నీతివంతముగా ప్రవర్తించిననూ విశ్వసించరు. వ్యక్తులకు సహాయము చేయుట కన్న సంస్థలకు సహాయము చేయుటలో వీరికి విశ్వాసమెక్కువ.

 

ఇతరులను నమ్మి వారికి ఏ పనినీ అప్పగించలేరు. ఈ విషయము వారియందు సంతృప్తికి కారణమై ఇతరులయందు విసుగుదలకు కూడా కారణమగును. మనస్సున ఊహించినంతగా ఇతరులకు తేలియజేయలేరు. కానీ తక్కువ ఖర్చుతో ఎక్కువ వినియోగమును సాధించగలరు. ఇతరులకు వీరి గుట్టు, రహస్యములు తేలియనీయక, వారి గుట్టు సులభముగా గ్రహించి సద్వినియోగం చేయుదురు. ఇతరులను నమ్మించి, మంచి మార్గమున శిక్షణనిచ్చుచు, వీరు మాత్రం చిరకాలమెవ్వరినీ నమ్మకుండ జీవించగలరు.

 

వృత్తులు, వ్యాపారములు మరియు వస్తూమార్పిడి వ్యాపారమున వీరు మంచి లాభము ఆర్జింతురు. రెండు పక్షముల నడుము వ్యవహారములు చక్కదిద్దుటలో జయప్రదముగా వ్యవహరింతురు. న్యాయవాదవృత్తి, వార్తా ప్రసారము, తంతి తపాల శాఖలు, ముద్రణాలయములు, టైపు, షార్టుహాండు (నేటి కాలంలో కంప్యూటర్లు) సంబంధిత వృత్తుల యందు చక్కగా రాణించెదరు. గ్రంథ రచన, అనువాదం, ప్రత్రికలలో రచనలు చేయడంలో వీరు నేర్పరులు. భాష, గణితం, లెక్కలు కట్టుట (లెక్కించుట), కొలతలకు సంబంధించిన వృత్తులు కూడా వీరికి అనుకూలం. సెక్రటరీ (కార్యదర్శి), రాయబారము, దౌత్యము వృత్తులలో కూడా అనుకూలంగా ఉంది రాణించెదరు. ధనార్జనకు సంబంధించిన తెలివి తేటలుండును గాని తెలివి తేటలున్నంతగా ధనార్జన యుండదు. దీనికి కారణము వీరి యొక్క విమర్శనాత్మకధోరణి. ధనమును గూర్చిన అసంతృప్తి, భవిష్యత్తును గురించి భయముండును.

 

వీరి దృష్టిలో ప్రేమకు, వివాహమునకు కూడా ఒక ప్రణాళిక ఉండును. స్త్రీ పురుష సంబంధ వ్యామోహం తక్కువ. ఒక్కొక్కసారి ప్రేమ ఒక దారిలో వివాహం వేరొక దారిలో ఉండగలదు. ఐననూ వీరీ విషయములలో ఇతరులకు తెలియకుండా ప్రవరించగల నేర్పుండును. వీరికి వివాహమైన తరువాత ధనముగాని, ఆస్తిగాని, ఉద్యోగ వ్యాపారాది లాభములు గాని కలుగును, అభిమానము, వంశ గౌరవము వీరియందు ఆత్మత్యాగము చేయగల వ్యక్తితో వీరికి వివాహ సంబంధముండును. అయిననూ, వీరు ఆ వ్యక్తికీ సందేహించుటకు, విమర్శించుటకు వెనుకడుగు వేయరు. జీవితమున వీరికి వాస్తవమైన సుఖశాంతులు లభించాలంటే ఒకరిని నమ్మి, హృదయము అర్పించుట జరుగవలెను.

 

వీరికి చక్కని ఆరోగ్యముండును. అనారోగ్యములు అరుదుగా కలుగును. చక్కని శరీర నిర్మాణము కలిగి వయస్సు కనిపించనీయని యువకళ ఆశ్రయించి ఉండును. ఎల్లప్పుడు యువత వలె ఉండుటకు ఇష్టపడుదురు. ముసలితనం వచ్చువరకు వీరు చిన్నవారి వలె ఇతరులకు కనిపింతురు. ఎక్కువ దూరం నడచుట వలన నడి వయస్సు నుండి నడుము, మోకాళ్ళు, వెన్ను, మెడలకు నొప్పులు కలుగు అవకాశమున్నది. అతి శ్రమచే నరముల బలహీనత, నీరసము కలుగవచ్చును. అనవసర విషయమును గూర్చి ఎక్కువగా ఆలోచించుటవలన మానసిక వ్యధ, నిద్ర పట్టక పోవుట కలుగవచ్చును. వార్థక్యామునందు మనస్సు పట్టు తప్పుట, చికాకు, అకారణ కోపము, వారిలో వారు మాట్లాడుకొనుట, వణుకు, పార్కిన్సం వ్యాదులుం నరములు వాతము, కడుపులో మంట (ఎసిడిటి) పైత్య ప్రకోపము, జీర్ణాశయములో పుండు మొదలగునవి కలుగవచ్చును, వేళకు భోజనము, నిద్ర, మనస్సునందు సంతృప్తి, వైరాగ్యము కలిగి ఇతరుల గురించి ఆలోచించుట మానినచో వీరి ఆరోగ్యంలో ఏ లోపముండదు.

 

ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళానైపుణ్యము, సంగీతములో కూడా మంచి నైపుణ్యము కూడా ఉండగలదు. వీణ, తంత్రీ వాద్యములలో కూడా నైపుణ్యం. శిల్పము, చిత్రలేఖనములు, కుట్టుపని, అల్లిక పని గ్రహోపకారణముల అలంకరణముల యందు ప్రావీణ్యత, పూలమొక్కలు, కూరగాయలు పెంచుకొనుటలో ప్రత్యేక కౌశలముండును.


TeluguOne For Your Business
About TeluguOne
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.