Home » » Meena Rashi
Home » » kumbh Rashi
Home » » Makara Raasi
Home » » Dhanu Raasi
Home » » Vruschika Raasi
Home » » Tula Raasi
Home » » Kanya Raasi
Home » » Simha Raasi
Home » » Karkaataka Raasi
Home » » Midhuna Raasi
Home » » Vrishabha Rashi
Home » » Mesha Raasi
Meena Rashi

మీన రాశి -  పూ.భా.4 (దీ)
     ఉ.భా.1,2,3,4(దూ,షం,ఝా,థా),రేవతి 1,2,3,4(దే,దో,చా,చి)

ఆదాయము 5 వ్యయం 14 రాజపూజ్యం 6 అవమానం 5


       ఈ రాశివారికి గురువు వత్సరాది 11.8.16 వరకు 6వ స్థానమునందు లోహమూర్తిగా ఉండును. తదుపరి వత్సరాంతము వరకు 7వ స్థానమునందు రజితమూర్తిగా ఉండును. శని వత్సరాది 26.1.17 వరకు 9వ స్థానము నందు లోహమూర్తిగా ఉండును. రాహువు వత్సరాది వత్సరాంతము 6వ స్థానమున,  కేతువు 12వ స్థానమున సువర్ణమూర్తులై ఉందురు.
    ఈ విధమైన గ్రహస్థితి పరిశీలించి చూడగా ప్రథమార్ధం గురుబలం ప్రతికూలంగా ఉన్నందున శని కూడా ప్రతికూలంగా ఉన్నందున మరియు కేతువు ప్రతికూలంగా ఉన్నందున ప్రతివిషయంలోనూ తగు జాగ్రత్తలు అవసరం. మితి మీరిన ఆత్మవిశ్వాసంతో మీకై మీరు అనవసరమైన అనార్థలకు స్వాగతం పలకకండి. ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ అవసరం. అహంకారం దరికి రానీవకండి.
    క్రయవిక్రయలందు చురుకుగా మీ పాత్ర ఉంటుంది.వస్తువులు జాగ్రత్తగా కాపాడుకోవాలి. చోరభయం కలదు. జాగ్రత్త. తమ సంతానముతో విరోధములు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. పాపకార్యములందు ఆసక్తి పెరుగును.  ద్రవ్యలాభము, అనూహ్యంగా ధనము చేతి కందును. తలచిన పనులను సామ,దాన,బేధ ఉపాయములచే తదనంతరం  కళత్ర కలహములు, దాంపత్య కలహాలు, అనవసరమైన అపోహలు ఎదురుకావడం, తమ సంతానము తమ మాట వినకపోవుట, చోరభయము, అగ్ని సంబంధిత ప్రమాదములు జరగకుండా జాగ్రత్త పడవలెను. విద్యుత్తుతో దూరంగా ఉండుట క్షేమకరం. ప్రభుత్వ విషయాలలో ాక్సీ చెల్లించుటలో అశ్రద్ధ పనికిరాదు. ప్రభుత్వపరంగా న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొనే అవకాశములు గలవు. మానసికంగా ఒక సమయంలో సుఖము మరొక సమయంలో విచారము,దుఃఖం అర్ధంకాని స్థితిని అనుభవిస్తారు. గృహవాతావరణం కూడా అర్ధంకాని స్థితి ఏర్పడుతుంది. పాపకార్యములందు ఆసక్తి, తొందరగా ధనవంతులు కావాలనే కోరిక బలీయమవుతుంది. సంఘవ్యతిరేకులు, సమాజంలో అశాంతిని సృష్టించేవారు స్నేహితులుగా మారే అవకాశము గలదు. తస్మాత్‌ జాగ్రత్త. ఉద్యోగమార్పు, ఉన్నత ఉద్యోగమునపై ఆసక్తి తగ్గుట, నూతన ఉద్యోగాన్వేషణ, వ్యవసాయాది కృషికి విఘాతం స్థిరచరాస్తులు వివాదాస్పదమగుట మొ|| సంభవించే అవకాశం గలదు. నమ్మిన వారే పరోక్షముగా మీ గురించి వ్యతిరేకముగా మ్లాడుట విస్మయం కల్గిస్తుంది. మానసిక విచారము. సోదరులతో ద్వేషము, వాక్కాఠిన్యము ఏర్పడే సూచనలు. శారీరక బాధయు, మానసిక విచారము, చతుష్పాద జంతువుల వలన హాని, వృధా ప్రయాణములు ప్రభుత్వ చట్టపరమైన చికాకులు ఎదుర్కొనవలసి వచ్చుట, ఆరోగ్య విషయంలో సరియైన వైద్య పర్యవేక్షణ అవసరం. స్త్రీ మూలక చికాకులు. అన్య సహవాసములు, పేరుప్రతిష్ఠ నిలుపుకోవడానికి అనేక రకాలుగా శ్రమ పడవలసి వచ్చును. ఎంత మౌనంగా ఉన్నా అనవసరండా రెచ్చగొట్టెవారు ఎదురు అవుతారు.
    పై అధికారులు గతం కన్నా ఎక్కువగా ఆదరించడం సంభ్రమాశ్చర్యాలకు గురి చేయును. వాహన మార్పు కనపడుచున్నది. తమ విషయంపై కన్నా ఇతరుల విషయాలపై శ్రద్ధ చూపుట ఇబ్బందికరంగా మారుతుంది. గృహిణులకు మానసికంగా కొంత చికాకు ఉన్ననూ సామాజికంగా పేరు, ప్రతిష్ట పెరుగుతుంది. తమ సంతానానికి వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. దైవమే మనిషి రూపంగా వచ్చినట్లు ఒక అమృతహస్తం వల్ల మేలు జరుగుతుంది. చిన్న పొరపాటుకు కూడా పెద్దగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. ఎవరూ అర్ధం చేసుకోవడం లేదనే బాధ ఏర్పడుతుంది. విద్యార్ధులు శ్రమించండి. విజయం మీ చెంత గలదు. మొత్తం మీద వీరికి శుభాశుభ మిశ్రమ ఫలితము కలుగుతున్నది. ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు మహా సుదర్శన హోమం, రామరక్షా స్తోత్రం, గోసేవ, పేద కన్యకి వివాహ విషయంలో సహాయం చేసిన మేలు జరుగును.
    సంవత్సర ద్వితీయార్థం నుండి మీ వ్యక్తిత్వానికి గౌరవం పెరుగుతుంది. ప్రేమచే  అందరి మనస్సు ఆకర్షిస్తారు. వివాహ ప్రాప్తి గలదు. సంతానప్రాప్తి గలదు. అన్యోన్య దాంపత్య జీవితం లభిస్తుంది. ఆర్థికంగా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. విదేశాలలో ఉన్నవారికి అనుకూలంగా ఉన్నది. స్థిరాస్థి వృద్ధి చేసుకుాంరు. అయిష్టంగా కొందరిని ఆదరించవలసిన స్థితి ఏర్పడవచ్చును. ఊహలలో విహరించడం మాని జీవితానికి ఏది అవసరమో ఏది ఆచరణ యోగ్యమో, ఏది సాధ్యము అది ఆలోచించి విజ్ఞతతో నిర్ణయించుకోవాలి. అసాధ్యమైన విషయాలపై ఆసక్తి పెంచుకోవడం అవివేకమని తెలుసుకోవాలి. ఆరోగ్యంపట్ల అశ్రద్ధ పనికిరాదు. మీరు కోరుకున్న ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇష్టమైన ప్రదేశానికి స్థానచలనం, హోదా, పరపతి ఇవి అన్నీ పెరుగుతాయి. కన్యాదాన ప్రాప్తి కలదు. ఉద్యోగం క్రమబద్దీకరింపబడే అవకాశం గలదు. నూతన వాహనప్రాప్తి, అత్యుత్సాహంతో ప్రతిపనిలోనూ మీరు పాలు పంచుకోవడం అనర్ధానికి దారితీయవచ్చును. పెద్దల సంస్మరణార్ధం ఒక మంచి పని చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములతో సఖ్యత అనుకూలత ఏర్పడుతుంది. నూతన విద్యా ప్రవేశాలు. అతి మంచితనాన్ని తమ అసమర్థతగా లోకం భావించడాన్ని చూసి ఆవేదన పడతారు.
    మారడానికి ప్రయత్నం చేస్తారు. వాహనాలు నడుపునపుడు జాగ్రత్త అవసరం. అగ్ని, జల సంబంధిత ప్రమాదములు ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు అవసరం. విద్యార్థులకు చివరలో అనుకూలంగా ఉన్నది. గ్టి ప్రయత్నం ఆత్మస్ధైర్యముతో ముందుకు వెళ్ళండి. గతంలో చేసిన కొన్ని పొరపాట్లకు పశ్చాత్తాపపడతారు. జీవన విధానాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగ విషయంలో అనాలోచిత నిర్ణయం అనర్ధానికి దారి తీయవచ్చు.
    ధనం చేతికందుతుంది.సంతాన సౌఖ్యము, వారి అభివృద్ధిని చూసి ఆనందిస్తారు. మీరు గర్వంగా తలెత్తుకునే స్థాయికి మీ సంతానం అభివృద్ధి చెందుతారు. స్త్రీ, సౌఖ్యము మానసిక నిర్మలత్వము ఏర్పడుతుంది అభీప్సితార్థ సిద్ధి ఏర్పడుతుంది. కొన్ని సందర్భాలలో చిత్త చాంచల్యము, స్త్రీ జన విరోధము, ప్రయాణాలలో వస్తునష్టము, అకాల భోజనము వాహన ముద్రాధికారములు లభించును. పేరు ప్రతిష్టలు లభించును. భూ వసతి కలుగును. ఈ విధంగా ఈ రాశివారికి శుభఫలితాలు సంవత్సరం మధ్యకాలము నుండి అనుభవిస్తారు.         
    ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు గురు,శని, రాహు, కేతు, జప దానాదులు చేసిన మంచిది. శ్రీ సుదర్శనస్తోత్రము, శ్రీ లక్ష్మీనృసింహస్తోత్రము, గణపతి స్తోత్రం దుర్వార్చన మొదలగునవి చేసిన మేలు జరుగును.

కొదుమగుళ్ళ వారి శ్రీదుర్ముఖినామ సంవత్సర పంచాగము 2016-17

 


kumbh Rashi

కుంభ రాశి -  ధనిష్ఠ 3,4 (గూ,గే)
శతభిషం 1,2,3,4(గో,సా,సీ,సు),పూ.భా.1,2,3(సే,సో,దా)

ఆదాయము 8 వ్యయం 8 రాజపూజ్యం 3 అవమానం 5


     ఈ రాశివారికి వత్సరాది గురువు 11.8.16 వరకు 7వ స్థానమునందు రజితమూర్తిగా ఉండును. తదుపరి వత్సరాంతము వరకు 8వ స్థానమునందు లోహమూర్తిగా ఉండును. శని వత్సరాది 26.1.17 వరకు 10వ స్థానము నందు సువర్ణమూర్తిగా ఉండును. రాహువు వత్సరాది వత్సరాంతము 7వ స్థానమున, కేతువు 1వ స్థానమున లోహమూర్తిగా ఉండును.
    అత్యుత్సాహము పనికిరాదు. ఆరోగ్యము జాగ్రత్తగా ఉంచుకోవాలి. వ్యసనాలకు, దురలవాట్లు, దుర్జన సహవాసం దరికి రానీయకండి. తోబుట్టువులతో కలహాలు మనఃస్పర్థలు రాకుండా జాగ్రత్త వహించండి. ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక నిరాశ ఏర్పడవచ్చును. పాప కార్యాలపై ఆసక్తి పెరుగవచ్చును. తాంత్రిక విద్యలపై ఆసక్తి పెరుగుట, ప్రేమ విఫలము, భార్య లేదా భర్తకు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరము. గర్భధారణ కల్గిన స్త్రీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సమాజద్రోహులు పరిచయమయ్యే అవకాశం గలదు. వారిపట్ల జాగ్రత్త అవసరం. స్నేహితులు ప్రస్తుతం అధికంగా వాడుచున్న ఫేస్‌బుక్‌, వాట్సప్‌ల వాడకంలో జాగ్రత్త అవసరం. స్థాన చలనము, నష్టాన్ని కలిగించు వ్యాపారం వైపు అనగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలని పొందాలని, తక్కువ సమయంలో కోీశ్వరులవాలనే ఆలోచనల పట్ల అప్రమత్తత అవసరము. దైనందిన జీవితము మరియు నిత్య విధులపై సోమరితనము, వాయిదా తత్త్వము పెరుగుట. ధూమపాన, మద్యపానాలకి దూరంగా ఉండండి నోి సమస్యలు బాధించవచ్చును. మీ యొక్క ఆత్మస్థైర్యము చేత విచక్షణా జ్ఞానము చేత అధిగమిస్తారు. వంశపారంపర్య ఆస్తులు సంక్రమించవచ్చు. కుల విద్యపై ఆసక్తి పెరుగుతుంది.  నూతన విద్యలపై ఆసక్తి, ప్రవేశము కలుగవచ్చును. విద్యార్థులకు అనుకూలంగా ఉన్నది. ప్రతిక్షణమును ఉపయోగించుకునే ప్రయత్నము చేయండి. పోీ పరీక్షలలో విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం సం||ర పూర్వార్థంలో సఫలం కావచ్చును. విదేశాలలో ఉన్నవారికి శాశ్వత నివాసయోగ్యత లభించగలదు. తాము కోరుకున్న ప్రదేశానికి స్థానచలనము కలుగవచ్చును. విద్యార్థులు నిత్యం శ్రీహయగ్రీవ స్తోత్రం పారాయణం చేయండి. చక్కని అమోఘమైన మేధాసంపత్తి సమయస్పూర్తి చురుకుదనము పెరుగుతుంది.
    తొందరపాటు ఏ మాత్రము పనికిరాదు. వ్యాపారంలో పోీదారులపై తెలివిగా ప్రవర్తించవలసిన సమయము. తమవారు ఎవరో, పరాయి ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేయండి. వ్యాపార రహస్యాలను తెలివిగా, ఇతరులకు చేరకుండా ప్రవర్తించండి. చిన్న విషయానికి కూడా ఎక్కువగా కష్టపడి కృషి చేయవలసిన సమయము, అనూహ్యముగా అనాలోచితముగా ధనవ్యయము కనపడుచున్నది. నూతన నిర్ణయాలు తీసుకునే ముందు తొందరపాటు పనికిరాదు. ముహూర్త నిర్ణయము మరియు గోచారము కొంతవరకు అనుకూలముగా  ఉన్ననూ మితిమీరిన ఆత్మస్థైర్యము ఎదుివారిని తక్కువగా అంచనా వేయడము, దురహంకారము మొదలైన విషయాలు దరికి రానీయకండి. ఆరోగ్యము అశ్రద్ధ చేయరాదు. ఆరోగ్య సమస్యలు ఎదురయినా ఉపశమనము నివారణ మార్గాలు లభిస్తాయి. తద్వారా కొంత మానసిక, శారీరక బాధ ఏర్పడినా వాిని అధిగమిస్తారు. వ్యాధులకు సరియైన సమయంలో రోగ నిర్ధారణ జరిగి ఉపశమనము పొందుతారు. స్త్రీలు గర్భసంబంధమైన సమస్యలపై వైద్యుని సలహా పాించాలి. ఒంటరితనమును అనుభవించడము, విపరీతమైన ఆలోచనలు రావడం జరుగవచ్చును. జీవిత భాగస్వామికి అనారోగ్య సూచనలు, దుర్జన సహవాసాలకు దూరంగా ఉండండి. మీ యొక్క పరపతికి ప్రతిష్టకు భంగము కలుగకుండా జాగ్రత్త పడవలయును. కనపడని శతృబాధ సూచన కలదు. వ్యాపారంలో ఒకింత జాగ్రత్తలు అవసరం. నూతనంగా పెట్టుబడులు పెట్టునపుడు జాగ్రత్త అవసరము. ఉద్యోగస్తులు అత్యుత్సాహంతో తమలోని రహస్యాలను తమ వృత్తిపరమైన నైపుణ్యానికి సంబంధించిన రహస్యాలను బయటపెట్టడము వలన ఒకింత ఇబ్బందికర వాతావరణము ఏర్పడవచ్చును. శ్రమమీది ఫలితము మరొకరిది కావచ్చును. విష జంతువుల వల్ల ఒకింత భయము ఏర్పడవచ్చును. అర్థంకాని అనారోగ్యము, దీర్ఘకాలిక వ్యాధులు చికాకు కలిగించే అవకాశం గలదు. ఉద్యోగస్తులకు స్థానచలన సూచన గలదు. దాంపత్యములో అపోహలు, అనవసరమైన వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్తపడవలయును. ఈ క్షణము ప్రశాంతత, మరుక్షణంలో ప్రళయము విం పరిస్థితులు ఎదురుకావచ్చును. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి. అకారణంగా అకస్మాత్తుగా కలహాలు సంభవించే అవకాశము గలదు. స్త్రీ, పురుష స్నేహాల విషయంలో ఇబ్బందికరమైన సంఘటనలు సంభవించే అవకాశము గలదు. స్థిరాస్తులు జాగ్రత్తగా కాపాడుకోవాలి. మితిమీరిన ఆత్మ విశ్వాసము పనికిరాదు. మూత్ర సంబంధమైన లేదా కినుండి జానువుల మధ్యన అనారోగ్య సూచనలు. కొందరికి వివాహ సంబంధాలు తప్ప పోవటమో లేదా వివాహవయస్సుకు పూర్వమే వివాహ ప్రయత్నాలు జరుగుట సంభవించవచ్చును. కొన్ని సందర్భములలో తనవారినే అనగా జీవిత భాగస్వామితోగాని, తమ సంతానముతోగాని తరచుగా అసత్యము పలుకుట, ముఖ కవళికలో మార్పు, మధ్యస్థమైన వివాదాలకు,మద్యవర్తిత్వాలకు జమావతులకు కాస్త దూరంగా ఉండండి. తనకోపమే తనశతృవని తెలుసుకొండి. మీ మనస్సు ఎంత నిర్మలమైనా ఎంత ప్రేమమయమైనా ఉన్నా దానిని మీరు సరియైన విధంగా బహిర్గతము చేయకపోవడం వల్ల మీరు అహంకారిగా ముద్రపడతారు. భాగస్వామ్య వ్యాపారాలు జాగ్రత్తగా చేయాలి.
    పూర్వార్థము అనుకూలంగా ఉన్నది అయిననూ మూర్తి నిర్ణయము ద్వారా విచారించిన తెలియనటువిం ఆవేదన, ఆరాటము, నైరాశ్యము చోటు చేసుకునే అవకాశము గలదు. కాలయాపన, జాఢ్యము మీకు ప్రధాన శతృవులుగా మారకుండా జాగ్రత్త పడాలి. తమకు తెలియకుండానే ఊహలలో విహరించడము వలన సమయము వృధా అయ్యే అవకాశము గలదు. విదేశీ ప్రయత్నాలు సంవత్సరము చివర భాగంలో అనుకూలించవచ్చును. విద్యలో ముందడుగు వేస్తారు. సంతాన పురోగతి బాగుంటుంది. శుభ కార్యాచరణచేత ధనవ్యయము, అంచనాలకు మించి ధనము ఖర్చు అయ్యే సూచన గలదు. చాలా కాలంగా వాయిదా పడిన పనులను పూర్తి చేస్తారు. అపరిష్కృతముగా ఉన్న  సమస్యలు పరిష్కార దిశగా అడుగులు వేస్తాయి. కాని ప్రయాసచేత పనులు పూర్తి చేసే అవకాశము గలదు. మితిమీరిన ఆత్మ విశ్వాసము పనికిరాదు. వత్సరారంభములో ముఖ్యంగా బృహస్పతి పంచమస్థాన స్థితిచేత, గతములో జరిగిన అన్ని సంఘటనలలో నిజానిజాలు తెలుసుకుాంరు. స్థిరాస్థులు వృద్ధి చేసుకుాంరు. సంతానప్రాప్తి కలదు. అవివాహితులకు వివాహ ప్రాప్తి కలదు. సమాజంలో స్థాయి మరియు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రభుత్వ పరంగా రావలసిన బకాయిలు కాని ఇతరమైన ప్రయోజనాలు కాని పొందుతారు. జీవిత భాగాస్వమియొక్క ఆరోగ్యము కొంత కలత చెందించవచ్చును. ఉద్యోగస్తులకు ప్రమోషన్లుగాని, తమ ఆధీనములో పనిచేయువారి సహకారాలు కాని లభించవచ్చును. ఇష్ట కన్యా ప్రాప్తి, నూతన వస్త్ర భూషణాదులు లభించుట, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశము గలదు. ఉన్నత విద్యా ప్రాప్తి. విదేశీయాన ప్రయత్నాలు సఫలము కావచ్చును. చక్కని విశ్వ విద్యాలయంలో ప్రవేశము లభించవచ్చును. పుత్ర సంతానప్రాప్తి, గతంలో తాము ప్టిెన పెట్టుబడులకు చక్కని లాభాలు రావచ్చును. సమాజంలో ఉన్నతస్థాయిలో ఉన్న వారియొక్క పరిచయము, సాంగత్యము లభించవచ్చును. తీర్థయాత్ర సందర్శనము ఆదాయము యొక్క వనరులు పెరుగుట. నీతి, నిజాయితీగల వారియొక్క సహచర్యము లభించవచ్చును. తాము శ్రమించిన కార్యానికి తగిన ప్రశంసలు అందుకుాంరు. పేరు ప్రతిష్ఠ పెరుగుతుంది.
    మొత్తం మీద వీరికి శుభాశుభ మిశ్రమ ఫలితము కలుగుతున్నది. ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు మహా సుదర్శన హోమం, రామరక్షా స్తోత్రం, గోసేవ, పేద కన్యకి వివాహ విషయంలో సహాయం చేసిన మేలు జరుగును.

కొదుమగుళ్ళ వారి శ్రీదుర్ముఖినామ సంవత్సర పంచాగము 2016-17

 


Makara Raasi

మకర రాశి -  ఉ.షా 2,3,4 (భో,జా,జి)
శ్రవణం 1,2,3,4 (జూ,జె,జో,ఖ),ధనిష్ఠ 1,2 (గా,గీ)

ఆదాయము 8 వ్యయం 8 రాజపూజ్యం 7 అవమానం 2


        ఈ రాశివారికి గురువు 8 స్థానము నందు 11.8.16 వరకు సువర్ణమూర్తియై ఉండును. తదుపరి సంవత్సరాంతము 9వ స్థానము నందు సువర్ణమూర్తియై ఉండును. శని వత్సరాది 26.1.17 వరకు 11వ స్థానము నందు రజితమూర్తియై ఉండును. రాహు వత్సరాది వత్సరాంతము 8వ స్థానమునందు కేతువు 2వ స్థానమునందు రజిత మూర్తులుగా ఉండును.          ఈ విధమైన పరిస్థితిని పరిశీలించి చూడగా ఈ సంవత్సరము శ్రావణమాసం నుండి విశేషమైనటువిం ఫలితములు కలుగగలవు. మీ జీవితానికి ఒక స్థిరమైన దిశ, థ ఏర్పడే అవకాశం గలదు. భవిష్యత్తుకై శాశ్వత స్ధిర నివాసంగాని, శాశ్వత పథకాలుగాని రూపొందించుకుాంరు. ఉద్యోగంలో మీరు కోరుకున్న స్థాయి, గౌరవం లభిస్తాయి. సంతానం యొక్క విద్యా విషయమై స్థిరమైన కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుాంరు. సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని గౌరవాన్ని తెచ్చే విధంగా ఉంటుంది. ద్వితీయ సంతానం ఆరోగ్య విషయంలోగాని, విద్యా విషయంలోగాని స్వల్పమైన చికాకు ఏర్పడవచ్చును. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ప్రస్తుతం మీరు నిర్వహిస్తున్న విధి నిర్వహణతో బాటు అదనపు బాధ్యత కూడా నిర్వర్తించ వలసి వస్తుంది. ధనము మాత్రం అంచనాలకు మించి ఖర్చుఅయ్యె అవకాశములు గలవు. స్థిరాస్థులు కొనుగోలు చేయునపుడు సంబంధించిన కాగితాలు పునః పరిశీలించివలసినది నూతన వ్యాపారములలో ప్రవేశించుట, అనూహ్యంగా ధనము చేతికందుతుంది. గతంలో ఋణంగా ఇచ్చిన ధనం మిశ్రమ ఫలంగా చేతికందుతుంది. శతృవులు మిత్రులుగా మారే అవకాశం గలదు. మీ స్నేహాన్ని మీ ఆశ్రమాన్ని కోరే అవసరం మీ ప్రత్యర్ధులకు వస్తుంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. జనాకర్షణ, ఆత్మాభిమానం పెరుగుతుంది. నూతన వాహన లాభం, ఎంతి కార్యాన్నయినా సమర్ధవంతంగా నిర్వహించగలరనే పేరు వస్తుంది. వ్యాపారస్థులకు మే వరకు అనుకూలంగా ఉన్నది. తరువాత మనస్సు, శరీరం సహకరించక పోవడం, సహనం తగ్గుట తదితర సమస్యలు ఉత్పన్నం కావచ్చును. అనవసర వృధా ఖర్చులు పెరిగే అవకాశం గలదు. భూములు కొనుగోలు చేయుటయందు ఫలితాన్ని సాధిస్తారు. గత అనుభవాలు భవిష్యత్తుకు పాఠంలా ఉపయోగించుకుాంరు. ప్రయోగాత్మక వ్యాపారాలు గాని ఇతర విషయాలు గాని అన్నికి స్వస్తి పలికి శాశ్వతమైన ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవడంలో శ్రద్ధ చూపిస్తారు. పరుగెత్తి పాలు త్రాగడం కన్నా నిలబడి నీరు త్రాగడం మేలని నిర్ణయించుకుాంరు. ఈ రాశి ఉద్యోగస్థులకు అనుకూలంగా ఉంది. మీకు అందవలసిన ప్రయోజనాల కొరకు లేదా స్థాన చలనం కొరకు విశేషకృషి చేయండి. సంవత్సరాంతంలో చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నము కావచ్చునను. వత్సరారంభంలో ఈ రాశి నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం గలదు. ఉద్యోగ క్రమబద్దీకరణ కూడా జరుగును. విద్యార్థులు వత్సరారంభంలో చక్కని ఫలితాలు పొందుతారు. మేధస్సు, గ్రహణ శక్తి వృద్ధి నొందుతాయి. పోీ పరీక్షలలో విజయం సాధిస్తారు. అయితే భవిష్యత్తు కొరకు చేయవలసిన ఉపాయాలు ఇప్పుడే ఆరంభించుట మంచిది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మేల్కొపు అనేక అవకాశాలు గలవు. కుటుంబంలో మీ స్థాయి మీ విలువ పెరుగుతుంది. తోి వారు మీ అవసరాన్ని గుర్తిస్తారు. ఖనిజ వ్యాపారాలు చేసేవారికి అనుకూల సమయం ప్రభుత్వ పరంగా పొందవలసిన అనుమతులు పొందానికి ఇప్పుడే బీజం వేసి ఉంచండి. దరఖాస్తు పెట్టుకోవడం, పైరవీలు చేసుకోవడం మంచిది. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణ సహకారం లభిస్తుంది. జీవిత భాగస్వామి మాటవినిన మేలు జరుగును. కుటుంబంలో అన్యోన్య సహకారం లభించును.  సంతాన ప్రాప్తి గలదు.  ప్రతిష్టాత్మకమైన వారితో పరిచయం ఏర్పడగలదు. స్వర్ణ, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఋణబాధ తీర్చడానికి విశేషకృషి చేస్తారు. సఫలమవుతారు. రాజకీయంగా అనుకూలంగా ఉన్నది. మే లోపు ఎన్నికలలో విజయం సాధించే అవకాశం గలదు. ప్రత్యర్థిపై పట్టుసాధించడానికి మీరు వేసే ప్రతి అడుగు మీకు అనుకూలమవుతుంది. సమాజానికి కీడు చేసే పనులు చేయడానికి మిమ్ములను ప్రోత్సహిస్తారు జాగ్రత్త. ఏదైనా సాధించాలని  పట్టుదలతో ఉంారు, సాధిస్తారు. స్థిరాస్తులకు విలువ పెరుగుతుంది. సమాజంలో నిజమైన సేవా కార్యక్రమాలు చేయడానికి పూనుకుాంరు. స్త్రీ విభేదాలు అకారణ కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమములో మీ వంతు సేవ చేస్తారు. సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఒకింత గర్వాన్ని ఇస్తుంది. స్వతంత్ర వివాహాలు పెద్దల అంగీకారంతో జరుగుతాయి. ఉద్యోగంలో గతంలో ఉన్న అనేక సమస్యలనుండి బయటపడతారు. పొత్తి కడుపు లేదా ఉదర సంబంధిత సమస్యలు బాధించవచ్చును. ఔషధ సేవనం తప్పక పోవచ్చును. కోర్టు వ్యవహారాలు పరిష్కారమౌతాయి. చోరభయం కలదు. జాగ్రత్త ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. విదేశాలకు వెళ్ళవలసి రావచ్చును. కీళ్ళ నొప్పులు, నరాల బలహీనత హృదయ సంబంధిత బాధలు, వాికి గతిన ఔషధ సేవనం తప్పకపోవచ్చును. ఉన్నత చదువులు చదవాలనే ఆశ ఫలిస్తుంది. ఎంత నియంత్రణగా ఉండాలని ప్రయత్నించినా ఒక రకమైన నిందారోపణలు ఎదురుకొాంరు. విదేశాలలో స్థిరనివాస యోగ్యత ఏర్పడుతుంది. వివాహప్రాప్తి, మీ వాక్‌చాతుర్యంచే కొందరి జీవితంలో చాలా మార్పులు తీసుకువస్తారు. ధార్మిక, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి జనాకర్షణ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఒకరి జీవితానికి పూర్తిగా సహకారం అందించాలని ప్రయత్నిస్తారు. సఫలమౌతారు. ప్రభుత్వ గౌరవం, రాజలాంఛనములు అనుభవిస్తారు.  తన సొమ్ము అయిననూ దాచుకొని అనుభవించవలయును. అగ్ని సంబంధమైన ప్రమాదములు రాకుండా జాగ్రత్త పడాలి. విద్యుత్తుకు దూరంగా ఉండడం చేయాలి. రాజభయం, దేహకాంతి తగ్గుట, గతంలో మీ మాటకు ప్రస్తుత మాటకు వ్యత్యాసం ఉంటుట, తరచూ విమర్శలకు లోనగుట, మొండి ధైర్యం ఏర్పడుట, కోపం, ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ అవసరం. శని వలన వత్సరారంభంలో పుత్ర సుఖం, మానసిక నిర్మలత్వము, అభీప్సితార్థ సిద్ధి, ద్రవ్యప్రాప్తి, స్త్రీ సౌఖ్యము మొదలగు ఫలితము ఉన్ననూ, వత్సరాంతంలో ఏలినాి శని ఆరంభం చేత ఒకింత భయం, వృధా ధనవ్యయం, కొన్ని విషయాలలో నిర్ణయం తీసుకొనలేకపోవుట, మర్యాదహాని, అజీర్తి, గృహశాంతి లోపించుట ఫలితము కనపడచున్నది. పుత్రులు సరిగా  ఆదరించకపోవడం, సమాజంలో సంపాదించిన గౌరవాన్ని  ఇంివారు గుర్తించలేకపోవడం, చిత్త చాంచల్యం, వాగ రోగమును, స్త్రీ మూలక భయం, ప్రయాణమందు విఘ్నములు, శారీరక శ్రమ, వ్యవహార చిక్కులు, శతృ, ఋణ, రోగములు. తీర్థయాత్ర ఫలము దక్కును. తల్లి ఆరోగ్యము జాగ్రత్తగా కాపాడుకోవాలి. రాజనీతి, ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో సఫలమవుతారు. ఆశలు వదలుకున్న కొన్నపనులు అనూహ్యంగా సఫలమౌతాయి.
    విదేశీ ప్రయత్నాలు రెండవ ప్రయత్నంగా లాభించవచ్చును. విదేశాలలో ఉన్న మీ స్నేహితులు శ్రేయోభిలాషుల వల్ల ధనసహాయము లభించవచ్చును. అతి ప్రయాసపైన స్థిరాస్థిని వృద్ధి చేసుకునే ప్రయత్నము చేస్తారు. ఈ సం||ము మీలో  ప్రధాన లోపము ప్రతి పనిని వాయిదా వేయటము, భక్తి మార్గ పయనము. బంగారు ఆభరణములలో పెట్టుబడి ప్టోలనే ఆలోచనలు రావడము. షేర్‌ మార్క్‌ె రంగములో ప్రయాణించుట, మీలో కార్యసామర్థ్యము ఉన్న దానిని గుర్తించి ఉపయోగించుకోలేకపోవుట ఒక సమస్యగా మారుతుంది. అనాలోచితంగా కొంత ధనాన్ని సద్వినియోగించలేకపోవడం, ప్రభుత్వ పరంగా అందవలసిన ప్రయోజనాలు వాయిదాల రూపంలో అందుట, నిర్ణయం తీసుకోవడంలో ఒకరి సహాయం అవసరము, వృత్తి ఉద్యోగములో ఉన్నతి. సంవత్సర పూర్వార్ధంలో లభించును. విదేశీ అవకాశాలు లభించును. సంతానప్రాప్తి, వివాహ ప్రాప్తి,.ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు గురు,శని, రాహు, కేతు, జప దానాదులు చేసిన మంచిది. శ్రీ సుదర్శనస్తోత్రము, శ్రీ లక్ష్మీనృసింహస్తోత్రము, గణపతి స్తోత్రం దుర్వార్చన మొదలగునవి తమ తమ వంశాచార అనుసారముగా చేసిన మేలు జరుగును.

కొదుమగుళ్ళ వారి శ్రీదుర్ముఖినామ సంవత్సర పంచాగము 2016-17

 


Dhanu Raasi

ధనస్సు రాశి -  మూల 1,2,3,4 (యే,యో,బా,బీ)
పూ.షా.1,2,3,4(బూ,ధా,భా,ఢా),ఉ.షా.1(బే)

ఆదాయము 5 వ్యయం 14 రాజపూజ్యం 4 అవమానం 2


       ఈ రాశివారికి వత్సరాది 11.8.16 వరకు 9వ స్థానమునందు తామ్రమూర్తిగా ఉండును. తదుపరి వత్సరాంతము వరకు 10వ స్థానమునందు లోహమూర్తిగా ఉండును. శని వత్సరాది 26.1.17 వరకు 12వ స్థానము నందు తామ్రమూర్తిగా ఉండును. తదుపరి వత్సరాంతం 1వ స్థానమున సువర్ణమూర్తియై ఉండును.రాహువు వత్సరాది వత్సరాంతము 9వ స్థానమున తామ్రమూర్తిగా కేతువు 3వ స్థానమున తామ్రమూర్తిగా ఉండును.
    ఈ విధమైన గ్రహస్థితి పరిశీలించి చూడగా ఈ సంవత్సరము ఏలినాి శని ప్రభావము తీవ్రంగా ఉన్ననూ శ్రావణమాసం వరకు బృహస్పతి భాగ్యస్థానమున అనుకూలంగా ఉండుటచేత తమ గౌరవ ప్రతిష్ఠాదులకు భంగము కలుగదు. తీవ్రమైన మానసిక శారీరక వత్తిడి అనుభవించవలసిన పరిస్థితి ఎదురుకాగలదు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. ఏలినాి శని 2వ భ్రమణము అయిన వారికి మాత్రం శారీరక మానసిక వత్తిడితో పాటు, చక్కని వృద్ధి, ఆర్థిక అభివృద్ధి పేరు ప్రతిష్టలు పెరుగవచ్చును. కాని ఈర్ష్య ద్వేషాలు కల్గినవారు. తమ చుట్టూ ఉంారని గ్రహించండి. పరపతికి భంగము కల్గించే విధంగా పరోక్షముగా ప్రయత్నము జరిగే అవకాశము గలదు. తస్మాత్‌ జాగ్రత్త. సహకార లోపము ఎదుర్కొనవలసిన స్థితి రావచ్చును. ఇక ఏలినాి శని ప్రథమ ద్వితీయ భ్రమణములో ఉన్నవారికి తగు జాగ్రత్తలు అవసరం. ఆర్ధికపరమైన అవస్థలు అర్థం కాని పరిస్థితి ఏర్పడవచ్చును. విద్యార్థులు కాలయాపన, వదలి వేయాలి.
    శ్రావణమాసం వరకు గురుబలము అనుకూలంగా ఉన్నది. ప్రతిక్షణాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. జాఢ్యము దరిరానీయకండి. మీలో ఉన్న ప్రతిభని ఉపయోగించి పోీ పరీక్షలలో మంచి ఫలితాలు సంపాదించే అవకాశముగలదు. ఈ సంవత్సరం పూర్వార్థము స్ధిరాస్థులు, వృద్ధి అవుతాయి. రాజకీయ పలుకుబడి పెరుగుతుంది. బృహత్తర కార్యక్రమాలు చేసే అవకాశము గలదు. కాస్త ఆలస్యంగానైననూ పనులు సాధిస్తారు. నూతన పరిచయాల విషయంలో కొంత మెళకువ అవసరం. విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం చేయువారికి కొంత ఆలస్యంగా పనులు పూర్తవుతాయి. 2వ ప్రయత్నము చేయవలసిన పరిస్థితులు ఉత్పన్నం కావచ్చును. వివాహ ప్రయత్నాలు పూర్వార్థంలో సఫలమయ్యే అవకాశము కలదు. ప్రేమ వివాహాలు చేసుకునేవారు కొన్ని పరీక్షలు ఎదురుకొనవలసిన పరిస్థితులు ఉత్పన్నం కావచ్చును. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అసవరం. ఏదేని విశేషమైన ఒక పురస్కారము లభించే అవకాశము గలవు. నూతన వ్యాపారములకై అన్వేషించే వారికి ఒక మార్గము లభించే అవకాశము కలదు. పాత వాహనం స్థానంలో కొత్త వాహనాన్ని సమకూర్చుకుాంము. మీ అభిమాన, ఆత్మీయులలో ఒకరికి విశేష సహాయము చేయవలసిన పరిస్థితులు రావచ్చును. వారి ఆరోగ్యము ఆందోళన కలిగించే అవకాశము గలదు. మీ అభిమానులను నిర్లక్ష్యం చేయడం, కొత్త స్నేహానికి స్వాగతం పలకడం జరుగ వచ్చును. మీలో దాగియున్న సృజనాత్మకత శక్తి నైపుణ్యం ప్రతిభా పాటవాలను పరిపూర్ణంగా ఉపయోగించుకుాంరు. ఉద్యోగంలో ప్రమోషన్‌ కూడా రావచ్చును. ప్రస్తుతము ఉన్న విద్యార్హతతో పాటు మరొక యోగ్యతాపత్రం దరి చేరవచ్చు. వ్యాపారంలో కొంత వృధా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిననూ సరియైన మార్గము, దిశలో ఉన్నారని సంతృప్తి చెందుతారు. వివాదాస్పద భూముల కొనుగోలు చేయకండి. స్త్రీ సఖ్యత, సహవాసాలు ఏర్పడవచ్చును.
    సదాచారము, భగవత్‌ ప్రార్థన ద్వారా శని వ్యతిరేక ప్రభావము తగ్గును. తనపై తనకు ఒక రకమైన నమ్మకము లేకపోవుట. ఆత్మ విశ్వాసము తగ్గుట వలన లేని సమస్యను ఉన్నట్లుగా భ్రమించి బాధపడే అవకాశము గలదు. ఊహలు, ఆలోచనలు సరియైన మార్గములో ఉన్ననూ వాిని అమలు పరచుటలో సఫలముకాకపోవచ్చును. స్థిరాస్థికి, చరాస్థులకు కొంత భద్రత లోపించవచ్చును.  ఆత్మ విశ్వాసము తగ్గుట వలన లేని సమస్యను ఉన్నట్లుగా భ్రమించి బాధపడే అవకాశము గలదు. ఊహలు, ఆలోచనలు సరియైన మార్గములో ఉన్ననూ వాిని అమలు పరచుటలో సఫలముకాకపోవచ్చును. స్థిరాస్థికి, చరాస్థులకు కొంత భద్రత లోపించవచ్చును. స్థిరాస్థులు అమ్మకానికి ప్టోలని సలహాలు ఇచ్చేవారుాంరు. తస్మాత్‌ జాగ్రత్త, క్రొత్తది సంపాదించుకున్నా ఉన్నది కాపాడుకోవడము ఉత్తమము కదా! మీకు ఉన్న ఆర్థిక చికాకులు ఏ మాత్రము ఆలోచించకుండా పైకి మాత్రము కోీశ్వరులుగా తమ ప్రవర్తన ఉండడము వలన మీ బాధలు అర్థం చేసుకునేవారి ఉండరు. తమ సంతానము యొక్క వివాహార్థము ప్రయత్నాలు ఆరంభము చేస్తారు. ఎంత కష్టపడి ఎన్ని రకాలుగా ఆలోచనలు చేసినా ఆర్థికపరమైన వృద్ధి కనపడకపోవడం చిరాకు కల్గిస్తుంది. జీవిత భాగస్వామితో అకారణ కలహాలు ఏర్పడే అవకాశము గలదు. తమకు తెలిసిన సత్యాన్ని నిర్భయంగా వ్యక్తపరచలేని స్థితి ఏర్పడవచ్చును.
    తాము ఎంత అంకితభావంతో ఉన్ననూ, ఎదుివారు గుర్తించకపోవడం బాధ కల్గిస్తుంది. కొన్ని సందర్భములలో ఆత్మ విశ్వాసము లోపించవచ్చును. మానసిక నిరాశ, నిస్పృహ వెాండుతాయి. ఆత్మ బంధువులకు అనారోగ్య సూచనలు కలత చెందించును. ఆరోగ్య సమస్యలు ముఖ్యముగా ఎముకలు, రక్త సంబంధ  సమస్యలు, కీళ్ళ నొప్పులు విపరీతముగా బాధించును. బృహస్పతి అనుకూలత. మరియు తమ కులదేవతారాధన వల్ల క్లిష్టమైన సమస్యల నుండి ఉపశమనము లభించును. విపరీతము మంచి నీళ్ళ వలే ధనవ్యయము సంభవించును. ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులు సకాలములో చెల్లించండి. లేనిచో అనవసర సమస్యలకు మీరే స్వాగతము పలికెదరు. దీనికి కారణం మతిమరుపు, వాయిదా వేసే తత్వము కావచ్చును. మీరు సామాజికంగా, ఆర్థికంగా ఎదగకుండా కుతంత్రాలు చేస్తారు. అనాలోచితంగా కొంత ధనాన్ని సద్వినియోగించలేకపోవడం, తనవారు ఒకచోట తాము మరొక చోట ఉండవలసిన స్థితి.
    చాలా వరకు సమస్యలను పరిష్కరించుకోవడానికి సమయం గడుస్తుందని నిరాశపడతారు. నూతన గృహ నిర్మాణానికి కొంత ప్రయాసచే పూర్తి చేస్తారు. అంచనాలను మించి ధనం ఖర్చు అయ్యే అవకాశం గలదు. ఎవరి ద్వారానైతే విశేష ఫలితాలని ఆశించారో వారే ముఖం చాటు వేయడం, ఊహించని వారు సహాయ మందించడం విం సంఘటనలు ఏర్పడతాయి. దైవలీలలు అర్ధం కావని విశ్వసిస్తారు. చాలా విషయాలను రహస్యంగా ఉంచి మీరేమిో నిరూపిస్తారు. స్వార్థం పెంచుకోవాలని నిర్ణయించుకుాంరు. దాంపత్య సమస్యలు ఉత్పన్నమయినా పరిష్కారం లభిస్తుంది. సంతానానికి శాశ్వత పరిష్కార దిశగా వారి అభివృద్ధి కొన్ని నిర్ణయాలు తీసుకుాంరు. కోర్టు తీర్పులు ఎటూతేలక అసహనాన్ని కల్గించవచ్చును. వ్యాపారస్థులు ద్వితీయార్థంలో చాలా జాగ్రత్తలు పాించాలి. చెప్పుడు మాటలు విని మోసపోకూడదు. మొత్తం మీద ఈ రాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. ఏలినాి శని ప్రభావం తీవ్రంగా ఉండుట వలన గోసేవ, సుందరకాండ పారాయణం, అంజనేయస్వామికి ఆకుపూజ, దేవతా వృక్షాలను పెంచడం మేలు చేస్తుంది.

కొదుమగుళ్ళ వారి శ్రీదుర్ముఖినామ సంవత్సర పంచాగము 2016-17

 


Vruschika Raasi

 

వృశ్చికరాశి -  విశాఖ 4 (తో)
        అనూరాధ 1,2,3,4(నా,నీ,నూ,నే), జ్యేష్ఠ 1,2,3,4 (నో,యా,యి,యు)

ఆదాయము 2 వ్యయం 8 రాజపూజ్యం 4 అవమానం 1


      ఈ రాశివారికి గురువు 11.8.16 వరకు 10వస్థానములో లోహమూర్తిగా తదుపరి వత్సరాంతము 11వ స్థానమున సువర్ణమూర్తిగా ఉండును. శని వత్సరాది 26.1.17 వరకు జన్మస్థానమున లోహమూర్తిగా ఉండును. తదుపరి వత్సరాంతము 2వ స్థానమున రజితమూర్తిగా ఉండును. రాహువు వత్సరాది వత్సరాంతము 10వ స్థానములో కేతువు 4వ స్థానంలోను సువర్ణమూర్తులుగా ఉందురు.
    ఈ రకమైన గ్రహస్థితి పరిశీలించి చూడగా ఏలినాి శని ప్రభావము తీవ్రముగా ఉన్ననూ గురుబలము ఉపశమనము కలిగించును. నూతన పరిచయాలు ఏర్పడతాయి. జీవితంలో ఆత్మస్థైర్యము. ధైర్యము పెరుగుతుంది. ఎలర్జీ విం సమస్యలు బాధించవచ్చును. ఈ సమస్య కొంత దీర్ఘకాలికంగా ఉండవచ్చును. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ఒకింత ధనవ్యయము, వీరికి తాంత్రిక, నరఘోష మొదలైన కక్షుద్ర విద్య బాధితులు అయ్యే అవకాశము గలదు. నిత్యము శ్రీలక్ష్మినృసింహ కరావలంబ స్తోత్రము పారాయణం చేయండి. అనేకమైన దృష్టశక్తులనుండి విముక్తి పొందండి. సంవత్సరాంతంలో గర్భధారణ సమస్యలు, విషజంతు పీడయు, నిర్లక్ష్యము, కిం మరియు దంత సమస్యలు బాధించుట, ఇతరులచే మోసగింపబడుట, అన్యస్త్రీ వివాదములు. కుటుంబములో తరచూ అకారణ కలహాలు, స్థలమార్పు గోచరించుచున్నది. రక్త సంబంధీకులకు అనారోగ్య సూచనలు. మధ్యవర్తుల ద్వారా అపోహలు, చెప్పుడు మాటలు వినుటద్వారా మానసిక అశాంతి కాళ్ళకు, పాదాలకు గాయాలు కాకుండా జాగ్రత్త పడండి. వాహనములు నడుపునపుడు జాగ్రత్త. అయినా కొద్దిపాి సమస్యలు ఎదురైననూ గతము అనుభవాల ప్రభావం చేత ఎత్తుకుపై ఎత్తులు వేసి ఆర్థికముగా అభివృద్ధి చెందుతారు. వృత్తి పరముగా వృద్ధిలోకి వస్తారు. మేన మామలకు ఆరోగ్యములో కొంత చికాకు కనిపించుచున్నది. పాండిత్య ప్రతిభ పెరుగుతుంది. గొప్ప పండితుడిగా చెలామణి అవుతారు. ఋణ బాధలు తొలగుతాయి. ఆధ్యాత్మిక, సేవా రంగాలలో ప్రవేశిస్తారు. సేవ చేస్తారు. ఒక ప్రాణ స్నేహితునికి మీ సహాయము అవసరమవుతుంది. సహాయము చేస్తారు. కోర్టులలో ఉన్న దంపతుల సమస్యలు మధ్యమార్గంగా పరిష్కరించుకుాంరు. మొండి పట్టుదలల చేత దాంపత్య సమస్యలు మీకై మీరు సృష్టించుకో కూడదు. జ్ఞాపకశక్తి తగ్గడం, అపనిందలు, భరించవలసివచ్చును. సమస్యలు వత్సరాంతంలో సంభవించవచ్చును. చేయని దోషమునకు మీరు సంజాయిషీ చెప్పుకోవడం బాధ కల్గించును. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారము లభిస్తుంది. విదేశీయానము కొరకు ప్రయత్నాలు శ్రద్ధగా చేయండి. ఫలితము లభిస్తుంది. పోీ పరీక్షలలో చక్కని విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యుల పరిపూర్ణ సహకారాన్ని పొందుతారు. ప్రభుత్వపరమైన కాంక్టులు లభిస్తాయి. ఖర్చులను నియంత్రించుకొనుట ఉత్తమము. అధికాశతో వివాదాస్పదమైన ఆస్తులను కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తారు. తస్మాత్‌ జాగ్రత్త. తమ సంతానానికి శుభకార్యాచరణ. తన కోపమే తన శతృవని తెలుసుకోవాలి. ఆవేశము అనర్థానికి కారణం కావచ్చును. విద్యార్థులకు అనుకూలంగా ఉన్నది. తాము కోరుకున్న స్థానాలలో ప్రవేశము లభించగలదు. వ్యవసాయదారులకు అనుకూలముగా ఉన్నది. మీ పరిచయానికి, స్నేహానికి ఇతరులు ఆసక్తి చూపుతారు. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణ సహకారం లభిస్తుంది. సంతానం యొక్క పురోగతి సంతృప్తి కరముగా ఉంటుంది. కన్యాదాన ఫలం దక్కుతుంది. ఉద్యోగములో ఉన్నతస్థానానికి వెళ్ళగలరు. కాని ఒకింత ఓపిక అవసరము. నిజం నిష్ఠూరంగా ఉంటుంది. కనుక తమ భావాన్ని అభిప్రాయాన్ని ఎదుివారు అర్థం చేసుకునే రీతిలో సాత్వికంగా తెలియజేయండి. విమర్శించే వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నము చేయండి. సాి వారి ముందు మీరు ఏమిో నిరూపించుకోవాలనే తపన పెరుగుతుంది. ఆ దిశలో ముందడుగు వేస్తారు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకు ఎక్కువగా అనుకూలంగా ఉన్నది. మంచి ప్రయోజనాలకై ధనవ్యయం చేస్తారు.
    ఈ విధమైన గ్రహస్థితిని పరిశీలించి చూడగా శుభాశుభ మిశ్రమ ఫలములు కనపడుచున్నవి. గతం చాలా రోజుల నుండి అనుభవిస్తున్న అవస్థలు కొంతవరకు ఉపశమించినట్లు కనిపించినా ఇంకా ఫలితము చేతికి అందకపోయే సరికి ఒక విధమైన కంగారు ఏదో తెలియని అభద్రతా భావము ఏర్పడుతుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని అర్ధంకాని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగ విషయంలో ఏ విధమైనటువిం సాహస నిర్ణయాలు తీసుకోవడం మంచిదికాదు. సహనము, ఓర్పు ఇవి అలవరచుకోవాలి. చాలా కాలంగా ఉన్న సహనానికి ఒక పరీక్షా సమయము ఎదురుకావచ్చు. కాని మిమ్ములను అనేక విధాలుగా రెచ్చగోట్టే ప్రయత్నాలు చేస్తారు. తద్వారా మీరు చేసే పొరపాటును తమకు అనుకూలంగా త్రిప్పుకునే ప్రయత్నాలు జరగవచ్చు. తస్మాత్‌ జాగ్రత్త. పనిభారము మానసిక వత్తిడి పెరగవచ్చును. సహోద్యోగులు తమ క్రింద పనిచేసే వారు తమ మాటను పూర్తిగా వినక, పై అధికారులకు జవాబు చెప్పలేక సతమతమవుతారు. గృహంలో కూడ ఒక విధమైన సహకార లోపం ఏర్పడవచ్చును. క్రోధం తగ్గించుకోవాలి. అనవసర ఆవేశము అనర్థాలకు హేతువు కావచ్చును. వాహనములు నడుపునపుడు పరధ్యానము, అజాగ్రత్త ఏ మాత్రం శ్రేయస్సు కాదు. ఇంటర్న్‌ె ఉపయోగంలో కూడా నియంత్రణ అవసరము. చాలా రహస్యాలు ముఖాముఖిగా మ్లాడుకోవడం ఉచితము. తమను ఎక్కువగా ఇష్టపడే వారిని నిర్లక్ష్యము చేయడం, నిర్లక్ష్యం చేసేవారికోసం వెంటపడడం, వారికి అనేక విధాలుగా సహాయమందించడం చేస్తారు. కాని తమ ప్రయత్నానికి గుర్తింపుగాని, ఫలితముగాని ఉండకుండా పోతుంది. తమ పరభేదాన్ని గుర్తించండి.  అనుబంధాలకు విలువనివ్వండి. ఎండమావులకై ఆరాటపడకండి. బంధువులతో అకారణ ద్వేషాలు, వివాదాలు చిరాకు కల్గిస్తాయి. తమ ప్రయత్నాలలో ఫలితము చేతికందినట్లే అంది జారిపోవడం మానసిక వ్యధకు కారణ మవుతుంది. విలాసవంతమైన, ఖరీదైన గృహోపకరణాలు, అలంకార వస్తువులు అప్పు చేసైనా కొనుగోలు చేస్తారు. ఎదుివారి ముందు తాము ఏమిో నిరూపించుకోవాలనే ప్రయత్నం  చేస్తారు. విషమ పరిస్థితులలో కూడా తమ ఆత్మ విశ్వాసమును ధైర్యాన్ని తగ్గనీయరు. ఆకలితో ఉన్నా సింహం గడ్డితినదని, మీ ప్రవర్తన ద్వారా నిరూపిస్తారు. స్త్రీ విబేధాలు కనపడుచున్నవి. సంవత్సరము ఉత్తరార్థంలో వివాహ ప్రయత్నాలు సఫలము కావచ్చును. కుల దేవతారాధన చేస్తారు. అనుగ్రహము పొందుతారు. ధనం సంపాదించినట్లు కనపడినా చేతిలో అవసరానికి ధనం ఉండదు. విలువైన వస్తువులను భద్రపరచుకోవడంలో ఏ మాత్రం అశ్రద్ధ పనికిరాదు. మీ ముందు నిలబడే అర్హతలేనివారు కూడా మీకు సలహాలు ఇవ్వడము ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. ఉద్యోగంలో మాత్రం తొందరపాటు చర్యలు ఉండరాదు. కొందరికి తమ స్వయంకృతాపరాధములే రావలసిన ప్రమోషన్లు రాకపోవడం తమకన్నా తక్కువస్థాయివారు అందల మెక్కడం మనో వేదనకు కారణం అవుతుంది. అధికారుల నుండి తగిన గుర్తింపు ప్రోత్సాహము లభించును. ఎవరో చేసిన తప్పకు తాము సంజాయిషీ చెప్పవలసిన స్థితి ఏర్పడుతుంది. చట్ట వ్యతిరేకమైన పనులు చేసేవారు దరికి చేరకుండా ముందే గ్రహించి దూరం ఉంచండి. ప్రలోభాలకి లొంగి ప్రతిష్టను భంగపరచుకోవద్దు. ఊహలు తారు మారు కావచ్చును. గృహములో ఏదో తెలియని అశాంతి. బంధువుల అనారోగ్యము అరిష్ట సూచనలు. ఆస్తులు వివాదాస్పదమగుట, వంశపారంపార్య ఆస్తుల విషయంలో కలహాలు, కోర్టు గొడవలు కోరికలు పూర్తిగా తీరకపోవుట. భవిష్యత్తు గురించి ఉజ్జ్వలమైన భవిష్యత్తు గలదని చక్కని దారులు గలవని ఆ దిశలో ఆలోచిస్తారు. అవకాశాలు వస్తాయి. గోసేవ, మహాలక్ష్మి స్తోత్ర, శ్రీ సుందరకాండ పారాయణం, శని, రాహు, కేతు కుజ ధ్యాన శ్లోకాలు పఠించుట వల్ల మేలు జరుగుతుంది. వృద్ధులకు సహకరించండి. మాతాపితరులను గౌరవించండి.

కొదుమగుళ్ళ వారి శ్రీదుర్ముఖినామ సంవత్సర పంచాగము 2016-17

 


Tula Raasi

తులారాశి -  చిత్త 3,4 (రా,రి)
స్వాతి 1,2,3,4(రూ,రే,రో,తా)- విశాఖ 1,2,3 (తీ,తు,తే)

ఆదాయము 11 వ్యయం 13 రాజపూజ్యం 5 అవమానం 6


      ఈ రాశివారికి 11.8.16 వరకు గురువు 11వ స్థానములో రజితమూర్తియై ఉండును. తదుపరి వత్సరాంతం 12వ స్థానమున రజితమూర్తిగానే ఉండును. శని వత్సరాది 26.1.17 వరకు 2వ స్థానమున రజితమూర్తిగా తదుపరి వత్సరాంతము 11వ స్థానమున కేతువు 5వ స్థానమున లోహమూర్తులుగా ఉందురు.
    ఈ విధమైన గ్రహస్థితి పరిశీలించి చూడగా ఈ రాశివారికి ఏలినాి శని చివరి సమయము మరియు కొంతవరకు శుభాశుభ మిశ్రమ ఫలితములు కనపడుతున్నవి. పూర్వార్థము గురు, రాహువులు అనుకూలము ఉన్నా గురుబలము ఉత్తరార్థంలో బలహీనంగా ఉండును. కొందరికి ఆకస్మిక ధనప్రాప్తి అవకాశం కలదు.
    కొంతమేరకు అనుకూలతలు ఏర్పడవచ్చును. కోర్టు వ్యవహారములు మధ్యమార్గము ద్వారా పరిష్కారము అవుతాయి. మీ గురించి అపార్థము చేసుకున్నవారు నిజాన్ని గ్రహించి పశ్చాత్తాపపడతారు. శతృవులను ఎదురు కోవడంలో మీరు వేసే ఎత్తులకు ఎదుివారు చిత్తవుతారు. తమను అర్థం చేసుకునే వారు లేరనే నిరాశ, నిస్పృహ ఏర్పడుతుంది. చాలా కాలంగా మీరు ఏటూ తేల్చుకోలేక సతమతమవుతున్న సమస్యలపై తగిన నిర్ణయాలు తీసుకుాంరు. భూ వ్యాపారులకు కొంత అనుకూలము. ఉదరసంబంధమైన చికాకులు బాధించ వచ్చును. చిన్న సమస్యకైనా వైద్యుడిని సంప్రదించుట ఉత్తమము. విలువైన వస్తువులు కాగితములను అతి జాగ్రత్తవల్ల దాచిన చోటును మరిచి పోవడం ఒక సమస్యగా మారుతుంది. షుగరు, లివరు మరియు స్త్రీలకు సహజంగా ఉండే కొన్ని సమస్యలు చిరాకు కలిగించవచ్చును.
    తరుచుగా ఉద్యోగ ధర్మములో తమ భాద్యతలు మారడం చికాకు కలిగించవచ్చును. పై అధికారులు ఏదో రకంగా సాధించడం విసుగు కల్గిస్తుంది. తరచూ స్థానచలనాలు ఏర్పడవచ్చును. సుఖవ్యాధులు, పొత్తి కడుపులో సమస్యలు బాధించవచ్చును. చాలా విషయాలలో మీ పొరపాటులేకున్నా మౌనముగా ఉండవలసిన పరిస్థితి తమ అత్యంత సన్నిహితులు సహోద్యోగుల అందరినీ సంశయించాల్సిన పరిస్థితి ఎదురుకావడము. జీవిత భాగస్వాములతో తరచూ అభిప్రాయభేదాలు గ్యాస్త్రిక్‌ సమస్యలు, నరాలు, కండరాలు, ఎముకలకు సంబంధించిన సమస్యలు. అనాలోచితంగా విలాసాలు, భోగాలకు, వ్యసనాలకు ధనవ్యయం ఎవరిని చూసినా ముందుగా వారి గురించి వ్యతిరేకంగా ఆలోచించడం జరుగవచ్చును. ఆధ్యాత్మిక దేవతాసేవలలో ఎక్కువగా పాల్గొాంరు.
    ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది.సంశయాత్మకమైన స్వభావాన్ని అధిగమించినా అన్ని విధాలా శ్రేయస్కరం. ప్రస్తుతం శతృవులుగా ఉంటున్న మీ శ్రేయోభిలాషులు తిరిగి మీ చెంతకు చేరే అవకాశము గలదు. ఋణములు చేయునపుడు ముందు జాగ్రత్తలు పాించండి. స్త్రీమూలకముగా అనవసర చికాకులు, అనుమానాలు, అపోహలు రాకుండా జాగ్రత్త పడాలి. తన సొమ్ము అయినా దాచుకోవాలి. ప్రయాసచేత పనులు పూర్తి చేస్తారు. పెట్టుబడులు విషయమై, నూతన వ్యాపారాలలో ప్రవేశం గురించి కొద్దిగా వాయిదా వేసిన మేలు జరుగును. వాహనములు నడుపునపుడు శ్రద్ధ అవసరం. నిర్లక్ష్యం పనికిరాదు. సంతాన కలహములు, బంధవులతో సంబంధాలు కాస్త వికించుట బోరులవలన భయం, అగ్ని భయం, రాజభయం మొదలగు ఫలములు మరియు శని వలన ఆరంభంలో పాపకార్యాచరణ. గతంలో ఏర్పడిన అనేక సమస్యల నుండి సునాయాసముగా బయటపడతారు. రావాలసిన మొండి బకాయిలు చేతికందే అవకాశము గలదు. శతృవులు సైతం తమతో మైత్రి చేయడానికి ఆసక్తి చూపుతారు. తాము చేసిన పొరపాటును తెలుసుకొని పశ్చాత్తాప పడతారు. శ్రమకు తగిన ఆదాయం చేతికందుతుంది. గతంలో అనుభవించిన అనేక సమస్యల నుండి ఉపశమనము లభిస్తుంది. పేరు ప్రతిష్ఠలు వృద్ధి చెందుతాయి. చాలాకాలంగా అనుభవిస్తున్న ఆరోగ్య సమస్యలకు వైద్యపరమైన పరిష్కారము లభిస్తుంది. సమాజములో గౌరవము ప్రతిష్ట పెరుగుతుంది. పరోక్ష ప్రత్యక్ష శతృవులు మీ స్నేహానికి ఆరాటపడతారు. అవివాహితులకు వివాహప్రాప్తి శుభకార్యాచరణ, ఉద్యోగస్తులకు తమ పదవిలో స్థాయిలో ఉన్నతి కలుగవచ్చును. వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి విసృత పరచడానికి ప్రయత్నాలు చేస్తారు. సఫలమవుతారు. ఒక స్థిరాస్థిని అమ్మదలచుకొని, చివరి నిమిషంలో విరమించుకునే అవకాశము గలదు. దాంపత్య సౌఖ్యాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తారు. సంఘ సేవా కార్యక్రమాలు  అనాథ శరణాలయాలు మొదలగు వాికి హితోధికంగా సహాయం చేస్తారు. విద్యార్థులు చక్కగా తమ ప్రతిభా పాటవాలను వృద్ధి పరచుకుాంరు. మెర్‌ి స్కాలర్‌షిప్‌లు పొందే అవకాశము గలదు. విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు. విలువైన ఆభరణాలు, ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి అయినా తాము ఆ ఉద్యోగములో పూర్తిగా సంతృప్తి చెందకపోవచ్చును. ఉద్యోగ విషయమై ప్రస్తుత స్థలాన్ని వదలి మరొక చోట నివసించవలసిన పరిస్థితులు రావచ్చును. సంతానప్రాప్తి గలదు. ముఖ్యంగా పుత్రసంతానాన్ని పొందే కోరిక తీరవచ్చును. మానసికమైన ధైర్యము పెరుగుతుంది. ఆలోచనా శక్తి ఆత్మస్థైర్యము పెరుగుతాయి. ప్రాపంచిక సౌఖ్యాలు మీ దరికి చేరుతాయి. స్త్రీ, సౌఖ్యము. కోరిన వారితో వివాహ సూచన. వంశపారంపర్య ఆస్తులు సంక్రమించుట మొదలైన శుభ పరిణామాలు. పౌరుషమైన దర్పంతో కూడిన జీవితము లభించవచ్చును. ఆదాయ మార్గాలు పెరుగుట. సైనస్‌ సంబంధిత సమస్యలు ఉత్పన్నము కావచ్చును. కొందరికి వివాహ విషయంలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితులు ఎదురుకావచ్చును. మంచి ఉద్యోగము లభించవచ్చును. స్థిరాస్థులు సంపాదించుట, వివాదంలో ఉన్న అస్తి మీ స్వాధీనమగుట. నూతన వ్యాపార ప్రారంభము. వ్యాపార భాగస్వాములపై ఆధిపత్యము చలాయించుట. మీ భాద్యతలను, వృత్తిని, విధులను చాలా సమర్థవంతముగా చురుకుగా నిర్వహిస్తారు. మీ ఆధీనంలో నడుస్తున్న సంస్థలలోగాని, లేదా ఉద్యోగంలోగాని కొందరిని అనగా మీకు పరోక్షముగా సమస్యలు సృష్టిస్తున్న వారిని గుర్తించి వారిని ఆ స్థానమునుండి తొలగింపచేస్తారు. అధిపత్యాన్ని పొందుతారు. మీ స్థాయిని స్థానాన్ని పదిలపరచుకుాంరు. తమ తోబుట్టువులు వృద్ధిలోకి వస్తారు. చక్కని స్థానాన్ని పొందుతారు. ప్రకాశిస్తారు. వాహనసౌఖ్యము గలదు. పాత వాహనముల చోట, క్రొత్త వాహనాలను సమకూర్చుకుాంరు. స్వగృహము నిర్మించుకోవాలన్న కల నెరవేరుతుంది. వివాహప్రాప్తి దూరప్రాంత ప్రయాణాలలో తగు జాగ్రత్తలు అవసరము. జీవిత భాగస్వామి మీ పట్ల వాస్తవము తెలుసుకొని, మీకు మీ యొక్క వ్యక్తిత్వానికి విలువనిస్తారు. సంతానము యొక్క పురోభివృద్ధి చక్కగా ఉంటుంది. జ్యేష్ఠ సంతానము యొక్క పురోభివృద్ధిలో శ్రమ ఎక్కువ అవసరము. చెవులకు, కింకి సంబంధించిన సమస్యలు బాధించవచ్చును. ఔషధసేవనము తప్పక పోవచ్చును. కళాకారులకు అనుకూలము. నూతన అయాచిత అవకాశాలు రావచ్చును. మీ చాతుర్యంతో, చాకచక్యంతో అనేక కార్యాలను సంపూర్తి చేస్తారు. భార్యాభర్తలకు చిన్న చిన్న వివాదాలు తప్ప చక్కని దాంపత్య జీవితము అనుభవిస్తారు. జీవితాశయము నెరవేరుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు ఒకింత జాగ్రత్తగా చేయవలెను. రాజకీయ పరపతి హోదా లభించును. బ్యాంకు ఋణాలు తీసుకొని నూతన వ్యాపారారంభం చేయవచ్చును.
. ఈ విధంగా ఈ రాశివారికి శుభఫలితాలు సంవత్సరం మధ్యకాలము నుండి అనుభవిస్తారు. ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు గురు,శని, రాహు, కేతు, జప దానాదులు చేసిన మంచిది. శ్రీ సుదర్శనస్తోత్రము, శ్రీ లక్ష్మీనృసింహస్తోత్రము, గణపతి స్తోత్రం దుర్వార్చన మొదలగునవి తమ తమ వంశాచార అనుసారముగా చేసిన మేలు జరుగును.

కొదుమగుళ్ళ వారి శ్రీదుర్ముఖినామ సంవత్సర పంచాగము 2016-17

 


Kanya Raasi

 

కన్యారాశి -  ఉత్తర ఫల్గుని 2,3,4 (టో,పా,పీ)
హస్త 1,2,3,4(పూ,షం,ణా,ఠా)- చిత్త 1,2 (పే,పో)

ఆదాయము 14 వ్యయం 11 రాజపూజ్యం 2 అవమానం 6


      ఈ రాశివారికి గురువు వత్సరాది 11.8.16 వరకు 12వ స్థానమున తామ్రమూర్తియై ఉండును. తదుపరి వత్సరాంతము 1వ స్థానమున నుండును. శని వత్సరాది 26.1.17 వరకు 3వ స్థానమున సువర్ణమూర్తిగా నుండును.వత్సరాంతము 4వ స్థానమున లోహమూర్తిగా ఉండును. రాహువు వత్సరాది వత్సరాంతము 12వ స్థానమున కేతువు 6వ స్థానమున సుర్ణమూర్తులుగా ఉందురు.
    ఈ విధమైన గ్రహస్థితి పరిశీలించి చూడగా ఈ సంవత్సరము శని ప్రభావము దాదాపు అనుకూలంగానే ఉన్నది. గురు, రాహువులు ప్రభావము కొంత ప్రతికూలంగా ఉన్నది. ఉద్యోగస్తులకు స్థానచలనము జరగవచ్చును. నిరుద్యోగులకు ఉద్యోగము లభించవచ్చును. వివాహ ప్రయత్నాలు సఫలము కావచ్చును.
    ఈ విధమైన గ్రహస్థితిని పరిశీలించి చూడగా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నవి. సంవత్సరారంభంలో అనుకూలంగా ఉన్నది. చేయవలసిన పనులు ఏ మాత్రం అలసత్వం లేకుండా పూర్తి చేయండి. ప్రతి క్షణాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. కాలము ఎవరికోసం ఆగదు. ఏ మాత్రం పక్షపాతం లేకుండా నిర్ధాక్షిణ్యంగా తన పని తాను చేసుకొనిపోతుంది. ఉన్న సమయాన్ని విజ్ఞతతో ఉపయోగించుకొని బాగుపడడం విజ్ఞుల లక్షణం. వత్సరాంతంలో చిన్న చిన్న ఒడిదుడుకులు రావచ్చును. జీవితాశయం నెరవేర్చుకోవడానికి కృషిచేస్తారు. తమకు సంబంధం లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి సమయాన్ని వృధా చేయకండి. సమాజంలో మనము ఒక భారమే కనుక. కాలానికి ఎదురీదే ప్రయత్నం చేయక నలుగురితో మనమూ నడచుకోవాలనే అభిప్రాయానికి వస్తారు. అదే మీకు శ్రీరామరక్ష అని గమనించండి. పేరు ప్రతిష్ట సంపాదిస్తారు. ఆదాయం పెరుగుతుంది. కాని ఖర్చు కూడా అలాగే పెరుగుతుంది. ప్రతి విషయాన్ని ఏదుి వ్యక్తులను విరోధులుగా భావించేతత్వము అలవాటుగా మారకుండా జాగ్రత్త పడండి. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనే ప్రయత్నం నెరవేరదు. ఇంకొకరు చేశారని, తామెందుకు అలా చేయకూడదనే భావనను విరమించుకోవలసినది. విదేశాలకు వెళ్ళాలనుకునేవారు ప్రయత్నాలు ముమ్మరం చేయండి. ఏ మాత్రం నిర్లక్ష్యం, అలసత్వం పనికిరాదు. ఫలితాన్ని పొందుతారు.ఆలస్యం, అమృతం విషమనే విషయాన్ని గుర్తించాలి. ఆరోగ్యం అశ్రద్ధ చేయరాదు, వివాహాలు, ఇతర శుభకార్యాలు ప్రయాసచే పూర్తి చేస్తారు. రాజకీయంగా అనుకూలంగా ఉన్నది. విశేష ప్రయత్నాలు చేయండి. ఫలితము లభిస్తుంది. అవివాహితులకు వివాహ ప్రాప్తి, సంతాన ప్రాప్తి. మీరు ఏదైనా వ్యాపారం చేయాలని ఆలోచిస్తారు. ఆలోచన కార్యరూపం  దాలుస్తుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. తమకు ఉన్న దానిలో కొంత దానం చేయాలనే నిర్ణయానికి వస్తారు. మీ మంచితనాన్ని అవకాశంగా ఉపయోగించుకొని పరోక్షంగా మీకు అపఖ్యాతి తెచ్చే ప్రయత్నం చేసేవారుాంరు. కళాకారులకు అనుకూలంగా ఉంది. కాని సంవత్సరాంతంలో కొంత నిరాశ కలుగవచ్చును. ఋణ బాధలు తీరుతాయి. కాని కొత్త ఋణాలకు దారి కూడా ఉందని గుర్తించండి. ఆత్మీయుల శ్రేయస్సు కొరకు కృషిచేస్తారు. నూతన గృహ నిర్మాణము దాదాపు సాకారమవుతుంది. విలువైన వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. విద్యార్థులకు అనుకూలంగా ఉన్నది. అలసత్వం వాయిదాలు వేయకుండా తమ ఆలోచనలు అమలు పరచండి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అనుకూలంగా ఉంది. బ్యాంకు ఋణాలు కూడా లభించే అవకాశం కలదు. పోీ పరీక్షలు ప్రభుత్వ ఉద్యోగ సంబంధిత పరీక్షలలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి గలదు. సంవత్సరం చివరలో అంత అనుకూలంగా లేదు కనుక భవిష్యత్తులో చేయవలసిన పనులకు ఇప్పుడే బీజం వేసి ఉంచండి. ప్రతిష్టాత్మకమైన అవార్డులకుగాని, విదేశీ ఉన్నత విద్యాభ్యాసానికి గాని అనుకూలంగా ఉంది. ప్రభుత్వం ద్వారా మీకు అందవలసిన లబ్ధి చేకూరుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. విదేశాలలో ఉన్నవారికి శాశ్వత నివాస అనుమతి లభించ వచ్చును. నూతన వ్యాపార ప్రవేశం సంభవిస్తుంది. మీరు గతంలో ఖరీదు చేసిన ఆస్తికి విలువ పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలించవచ్చు. మధ్యేమార్గంగా పరిష్కార మవుతాయి. ఋణంగా ఇచ్చిన ధనాన్ని తిరిగి పొందుటకు శతృత్వము పెంచుకోవాల్సిన పరిస్థితి రావచ్చును. జీవిత భాగస్వామితో తరచూ అకారణ వివాదాలు ఏర్పడవచ్చును. మౌనేన కలహం నాస్తి అను ధర్మాన్ని పాించండి. సంతానం వృద్ధిలోకి వస్తారు. సంవత్సరాంతంలో సమస్యలు పెరుగవచ్చును. జాడ్యము, సోమరితనము ఏర్పడవచ్చును.  గృహంలో ఒక రకమైన అకారణ వివాదాల వలన అశాంతి పెరుగవచ్చును. శతృవులు మితృలవడం, మిత్రులు శతృవులుగా మారడం ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. శుభకార్యాచరణ సత్కార్యాలకై ధనవ్యయం, ఇష్టం ఉన్నా లేకున్నా కొందరితో స్నేహం చేయక తప్పక పోవచ్చును. చెప్పుడు మాటలు విని చెడిపోయే అవకాశం కలదు. ఉద్యోగస్తులకు సంవత్సరారంభంలో అనుకూలంగా ఉన్నది. తమకు రావల్సిన ప్రయోజనాలు అనగా ప్రమోషన్లు, లోనులు, ఇంక్రిమెంట్లు, అవార్డులు మొదలైన విషయాలలో అలసత్వము, మితిమీరిన ఆత్మవిశ్వాసంతో కాలయాపన చేయక ప్రతిక్షణాన్ని ఉపయోగించుకోవాలి. ఫలితం లభిస్తుంది. మీరు కోరుకునే విధంగా స్థానచలనం జరుగవచ్చు. ఒక శుభ కార్య నిమిత్తమై మీరు వివాదాస్పదులుగా మారుట మొదలైన ఫలితము ఏర్పడవచ్చును. ఆదాయం కంటే ఖర్చు అధికం. స్త్రీలకు ప్రసవ సంబంధిత ఆందోళన ఎదురుకావచ్చును. నరముల బలహీనత ఔషధ సేవనము, నూతన ఉద్యోగ ప్రయత్నం సఫలమగుట, సంతానం పురోభివృద్ధి మీరు సంతృప్తి పడే విధంగా ఉంటుంది. అర్థం లేని అకారణ అపనిందలు మీ వెన్నంటే ఉన్నాయని గమనించండి. రాజకీయ పరపతి పదవి లభించవచ్చును. శతృవులకు సరియైన విధంగా గుణపాఠం జరగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. వీసా, పాస్‌పోర్టు, ఇన్‌కాంక్సు విషయంలో  నిర్లక్ష్యం పనికిరాదు. పాతది రోత క్రొత్తది వింతలా ఆలోచించడం మానివేయాలి. యోగా, ఆయుర్వేద శాస్త్రాలపై ఆసక్తి చూపుతారు. ఊహాలలో విహరించక వాస్తవంలో అడుగులు వేయండి. ఉన్నత విద్యావకాశములు గలవు ప్రయత్నించండి. మొత్తం మీద ఈ రాశి వారలకు శుభాశుభ మిశ్రమ ఫలితములు గలవు. ఒక నిరుపేత అవివాహిత కన్యకు సహాయం చేయండి. గోసేవ మరువవద్దు. రాహు, కేతు, గురు, శని జపశాంతులు అవసరం. కుల దైవాన్ని సందర్శించండి. ధనం లేకున్నా పూర్ణారోగ్యంతో ఉండాలనే నిర్ణయంతో ఉంారు. కన్యాదాన ఫలం దక్కుతుంది. ఉద్యోగములో ఉన్నతస్థానానికి వెళ్ళగలరు. కాని ఈ విషయంలో ఒకింత ఓపిక అవసరం. నిజం నిష్టూరంలా ఉంటుంది. కనుక ఆ నిజాన్ని మరొక విధంగా తెలిపే ప్రయత్నం చేయండి. విమర్శించే వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేయండి. విమర్శించే వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేయండి. స్వస్థల ప్రాప్తి, ఇంకా ఉత్తమ ఫలితాల కొరకు, అరిష్ఠ నివృత్తికి గోసేవ చేయండి. పేద విద్యార్థులకు, అనాథ వృద్ధులకు చేయూత నివ్వండి. దేవతా వృక్షాలను పెంచండి. శని, గురు, రాహు, కేతు ధాన్య శ్లోకాలు నిత్యం పారాయణం చేయండి.

కొదుమగుళ్ళ వారి శ్రీదుర్ముఖినామ సంవత్సర పంచాగము 2016-17

 


Simha Raasi

 

సింహరాశి -  మఖ 1,2,3,4 (మా,మి,మూ,మే)
పుబ్బ 1,2,3,4(మో, టా, టీ,టూ)- ఉత్తర ఫల్గుని 1(టే)

ఆదాయము 11 వ్యయం 5 రాజపూజ్యం 6 అవమానం 3


      ఈ రాశివారికి గురువు వత్సరాది 11.8.16 వరకు 1వ స్థానమున సువర్ణమూర్తిగా ఉండును. తదుపరి వత్సరాంతము 2వ స్థానము లోహమూర్తిగా ఉండును. శని వత్సరాది నుండి 26.1.17 వరకు 4వ స్థానమున తామ్రమూర్తిగా ఉండును. తదుపరి వత్సరాంతము 5 వస్థానములో రజితమూర్తిగా ఉండును. రాహువు వత్సరాది వత్సరాంతము 1వ స్థానమున రజితమూర్తిగా ఉండును. కేతువు 7వ స్థానమున ఉండును.
    ఈ విధమైన గ్రహస్థితి పరిశీలించి చూడగా ఈ సంవత్సరము ఆరోగ్యవిషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలోకూడా తగు జాగ్రత్తలు అవసరం. అర్థికంగా పెద్దగా చికాకులు ఉండవు. కాని ధనవ్యయం కూడా కపనడుచున్నది. వివాహ సంబంధాలు నిర్ణయమవుతాయి. నిరుద్యోగుకులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. 2వ ప్రయత్నంలో ప్రతి చిన్న విషయానికి ఎక్కువ ప్రయాస పడవలసిన స్థితి. క్రొత్తది సంపాదించకున్నా ఉన్నది కాపాడుకోవడం ఉత్తమం. సంవత్సర ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది.
    ఈ విధమైన గ్రహస్థితి పరిశీలించి చూడగా ఈ సంవత్సరము యోగ దాయకంగా ఉన్నది. జీవితంలో అనేకమైన అనుభవాలు, ఉచితానుచితాలు, తాము చూసిన నమ్మిన మనుష్యులు మొదలైన అనేక విషయాలపై ఒక స్థిరమైన, పారదర్శకమైన దారి మీకు కనపడుతుంది. గతంలో కొందరి మనసును అనవసరంగా నిరాదరించామన్న విషయాన్ని తెలుసుకుాంరు. పాలు, నీళ్ళనను గ్రహిస్తారు. గోముఖ వ్యాఘ్రములను గుర్తిస్తారు. వారిని ద్వేషంతో కాకుండా ప్రేమగా దూరం ఉంచాలని నిర్ణయిస్తారు. ఈ సంవత్సరం అనేక స్థిర నిర్ణయాలు తీసుకుాంరు. నూతన వ్యాపారాలకై అన్వేషణ ఆరంభమవుతుంది. ప్రస్తుతమున్న వ్యాపారముపై పట్టు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. కాని అది అంత సులభం కాదని గ్రహిస్తారు. సమయానికై నిరీక్షిస్తారు. మీ కలలు నెరవేరుతాయి. జీవితాశయము నెరవేరే అవకాశాలు అతి చెరువలో ఉన్నాయని గ్రహించండి. మిమ్ములను ద్వేషించిన వారు మీ స్నేహానికై ఆరాటపడతారు. అదే విధంగా మీ స్నేహాన్ని కోరే వారు కూడా ఆరాటపడు తుాంరు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు భవిష్యత్‌ జీవితానికి గుణపాఠమని గుర్తించండి. ఊహలలో విహరించడం మానుకొని తమ, పర బేధము తెలుసుకునే ప్రయత్నం చేయండి. ధనము, హోదాతో స్నేహాలను, అభిమానాన్ని పొందలేమని గ్రహిస్తారు. ధనము చేతికందుతుంది. నూతన వ్యాపార భాగస్వాములను చేర్చుకుాంరు. భవిష్యత్తుకై చక్కని నిర్ణయాత్మకమైన పునాదులు వేస్తారు. నూతన పరిచయాలు వివాహప్రాప్తి, సంతానప్రాప్తి. కోరుకున్న వారితో సఖ్యత ఏర్పడుతుంది. ఆరోగ్య పరిస్థితి గతముకన్నా కొంత బాగుపడుతుంది. కీళ్లు, ఎముకలు, నరములకు సంబంధించిన అవస్ధతలకు వైద్యపరమైన పరిష్కారం లభిస్తుంది. నరఘోషపై ఎప్పికప్పుడు పరిహారములు చేసుకొనుట ఉత్తమం. జీవితంలో ధనము, హోద, విలాసాలు మాత్రమే ప్రధానము కాదని గ్రహిస్తారు. తోబుట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి కొంత వరకు ఉపశమనం లభిస్తుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యము యధాస్థితి కొనసాగుతుంది. వారి ప్రవర్తన కూడా అదే విధంగా ఉండవచ్చును.మీ శ్రేయస్సుకోరే వ్యక్తులకు అభిమానించే వ్యక్తులకు ఏ విధమైన న్యాయము చేయలేకపోతున్నామనే ఆవేదన మీలో ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ ఏ మాత్రం పనికిరాదు. శతృ, ఋణ బాధలు పరోక్షంగా బాధించవచ్చును. మీ నిర్లక్ష్యము అహంభావము వల్ల కొందరికి శ్రేయోభలాషులకు దూరం కావలసిన పరిస్థితి రావచ్చును. జీవిత భాగస్వామి స్త్రీలు కాని, పురుషులు కాని వారి సలహా పాించుట అన్ని విధాలుగా శ్రేయస్సునిస్తుంది. అతి మంచి తనము తమకు అసమర్ధంగా మారే అవకాశము గలదు. పొగడ్తలకు లొంగకూడదు. ఎదుి వారి విలువైన వస్తువులపట్ల జాగ్రత్త అవసరం. తనకుమాలిన ధర్మం పనికిరాదు. కొందరికి సహాయం చేయబోతే అది మీ మెడకు చుట్టుకునే అవకాశము గలదు. ఋణ రూపకంగా ఇచ్చిన ధనం కాస్త తగ్గి చేతికందవచ్చును. మీ వ్యాపారంలో పేరు ప్రఖ్యాతులు రావడంలో మీ పాత్ర కీలకమవుతుంది. ఆత్మీయుల, బంధము ప్రవర్తన విస్మయానికి గురిచేస్తుంది. రాజకీయ పరపతి, రాజకీయ ఉన్నతి గలదు. ప్రభుత్వపరంగా మీకు రావలసిన బకాయిలు, కాంాక్టులు వల్ల ప్రయోజనం పొందుతారు. ప్రతిష్ఠ పెరుగుతుంది. కాని సమయానికి ఉపయోగించుకొని విస్మరించే వారున్నారని గ్రహించండి. స్త్రీ పురుషులకు పరస్పర వివాదాలు. అకారణ కలహాలు ఏర్పడవచ్చునను. ధార్మిక క్షేత్రాల సందర్శన, దాన ధర్మాలు చేస్తారు. ఎలర్జీ సంబంధమైన చికాకులు ఏర్పడవచ్చునున. ఆత్మీయులు అవసరానికి ఉపయోగించుకొని వదలివేయవచ్చును. కళాకారులకి అనుకూల సమయం, తాము ఆశించిన స్థాయికి చేరువవుతారు. నూతన వాహన కొనుగోలు చేసే అవకాశము కలదు.
    సంవత్సరం 2వ భాగంలో సమస్యల నుండి కొద్దిగా ఉపశమనం లభించును. ఈ సంవత్సరం ప్రతి పని, ప్రతి విషయం ఒకికి రెండుసార్లు ఆలోచించి చేయాలి. అతి ఆవేశం, క్రోధం తగ్గించుకొనిన మేలు జరుగును. అనాలోచిత నిర్ణయాల వలన సమస్యలు మీకై మీరే సృష్టించుకొనిన వారగుదురు. ప్రతి విషయాన్ని ప్రతి వారిని సంశయాత్మకముగా చూడటం మానుకొనిన మేలు జరుగును. పనులన్నియు నెరవేరుటలో ఆలస్యం జరుగవచ్చును. కొందరికి స్థానచలనం జరుగు సూచనలు. ధనము మంచినీళ్ళలా ఖర్చు అయ్యే అవకాశం గలదు. ప్రతి పనీ సాధించేవరకు పూర్తి ఓపిక, సహనం అవసరం. కొంతవరకు మీలోని భావాలను హద్దులో ఉంచుకోవలసివచ్చును. ఆర్థికంగా చికాకులు ఏర్పడే అవకాశములు గలవు. ధనవ్యయము జరిగిననూ అది ఉపయోగ కరముగా, ప్రయోజన కరమైన వ్యయము కాగలదు. వృధా భ్రమణం చేసే పరిస్థితులు రావచ్చును. సహవాస దోషములు ఏర్పడే అవకాశములు గలవు. నీచ జన సహవాసం కలదు. ఎవరినైతే అతిగా విశ్వసిస్తున్నారో, వారి విషయంలోనే మీ మనస్సుకు బాధ కలిగించే సంఘటనలు ఎదురుకావచ్చును. వ్యసనాలకు దూరంగా ఉండాలి. వ్యామోహాలకు గురి అయ్యే అవకాశము గలదు. జీవిత భాగస్వామి ఆరోగ్యం అశ్రద్ధ చేయరాదు. పంతాలకు, ప్టింపులతో ఏమీ సాధించలేరని గ్రహించండి. సంతానం యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది. సంతానం యొక్క విద్యా విషయంలో కొంత నిరాశ చెందే పరిస్థితి రావచ్చును. అవివాహితులకు వివాహ సంబధాలు నిశ్చయమవుతాయి. సామాజిక పరపతి, ప్రతిష్ట పెరుగుతుంది. కాని దానికి సమాంతరం తీవ్రవత్తిడి, ధన వ్యయం కాగలదు. స్నేహితులతో, ఆత్మీయులతో కుటుంబంలో స్పర్థలు పెరిగే సూచన. వ్యాపార భాగస్వామియొక్క ప్రవర్తన ఆశ్యర్యానికి గురి చేస్తుంది. నమ్మకద్రోహం వల్ల మానసిక నిరాశ చెందుతారు. పాత్రత నెరుగక కొందరిని అతిగా విశ్వసించడం వలన కొంత నష్టపోతారు. రాజకీయ పరంగా సంఘంలో ఉన్నత పదవి పొందే అవకావము గలదు. దూర ప్రాంతాల ప్రయాణం కొంతవరకు లాభించవచ్చు. వ్యాపారంలో పోీతత్వము పెరుగుతుంది. తమ వారు పరాయివారు ప్రతి వారూ విమర్శిస్తుండటం ఒకింత నిరాశకు గురిచేస్తుంది. మీ స్వవిషయంలో ఇతరుల జోక్యం సహించరు. నష్టమైనా, లాభమైనా నిర్ణయాలు తామే తీసుకోవాలని నిర్ణయిస్తారు. కాని ఈ నిర్ణయం కొన్ని సందర్భాలలో వికించే అవకాశం కలదు. తమ శ్రేయస్సు కోరే వారి సలహా పాించండి. మేలు చేస్తుంది. సహవాసదోషాలు విపరీతంగా బాధిస్తాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. రాహుకేతువుల ప్రభౄవం వలన ఆరోగ్యవిషయంలో ఏ మాత్రం అజాగ్రత్త పనికిరాదు. జీవిథ భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు అవసరం.  మొత్తం మీద ఈ రాశివారలకు శుభాశుభ మిశ్రమ ఫలితములు కలుగుచున్నవి. ఇంకా ఉత్తమ ఫలితాల కొరకు శని, గురు, కేతు జపాలు ధ్యానము చేసిన మేలు జరుగును. గోపూజ చేయండి. శ్రీ హనుమాన్‌ చాలీసా పారాయణం శ్రీ రామరక్షా స్తోత్రము చేసిన మేలు జరుగును.

కొదుమగుళ్ళ వారి శ్రీదుర్ముఖినామ సంవత్సర పంచాగము 2016-17


Karkaataka Raasi

కర్కాటకరాశి -  పునర్వసు 4(హీ)
      పుష్యమి 1,2,3,4(హూ,హే,హో,డా)- ఆశ్లేష 1,2,3,4(డీ,డు,డె,డో)

ఆదాయము 8 వ్యయం 11 రాజపూజ్యం 3 అవమానం 3


       ఈ రాశివారికి గురువు వత్సరాది 11.8.16 వరకు 2వ స్థానంలో లోహమూర్తిగా ఉండును. తదుపరి వత్సరాంతము 3వ స్థానమున రజితమూర్తిగా ఉండును. శని వత్సరాది 21.1.17 వరకు 5వ స్థానమున లోహమూర్తిగా ఉండును. రాహువు వత్సరాది వత్సరాంతము 2వ స్థానమున తామ్రమూర్తిగా ఉండును. కేతువు 8 వ స్థానమున ఉండును. ఈ విధమైన గ్రహస్థితి పరిశీలించి చూడగా పూర్వార్థము అనుకూలంగా ఉన్నది.
    సంతానముయొక్క అభివృద్ధికై కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుాంరు. సంతానం అభివృద్ధి పథంలో నడుస్తారు. వంశపారంపర్యంగా ఆస్తులు సంక్రమించవచ్చును. శుభకార్యములు చేస్తారు. శతృవులు ఏ స్థాయిలో ఉన్న చివరికి మీదే పై చేయి అవుతుంది. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి. చతుష్పాత్‌ జంతువుల వల్ల ఇబ్బంది తల్లితరపు బంధువులతో విరోధాలు, వివాహప్రాప్తి, సంతానప్రాప్తి. గర్భధారణ జరుగవచ్చును. వాహనాలు నడుపునపుడు జాగ్రత్తలు వహించండి. వ్యసనాలు, జూదాలు, షేర్‌మార్క్‌ె విషయాలలో ఒకింత మెళకువగా ఉండండి. అనవసరమైన అపవాదాలు, నిందలకు సమర్ధవంతంగా ఎదుగుకుాంరు. శాఖాపరమైన విచారణను ఎదుర్కొనవలసిన పరిస్థితి ఎదురుకావచ్చును. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరము. నూతన ప్రదేశాలకు స్థానచలనము.ఉద్యోగస్తులకు విపరీతమైన పని వత్తిడి ఏర్పడవచ్చును. తండ్రిగారి ఆరోగ్యము విషయంలో జాగ్రత్తలు అవసరము. జీవిత భాగస్వామికి అనారోగ్య సూచనలు, భాగస్వామ్య వ్యాపారాల విషయంలో సం||ర మధ్యకాలము నుండి ఒకింత జాగ్రత్తగా ఉండవలెను. స్వస్థలము విడిచి అన్య ప్రదేశములో నివసించే పరిస్థితులు, మానసిక పరిపక్వత లోపించుట, నిర్ణయము తీసుకోవటములో ఎటూ అర్థంకాని పరిస్థితి. మూత్ర సంబంధ వ్యాధుల పట్ల అశ్రద్ధ పనికిరాదు. ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల గుర్తింపులేకపోవుట, తీవ్రమైన వత్తిడి, గృహములో ప్రతి చిన్న విషయానికి వివాదాలు సృష్టించ కుండా, జాగ్రత్త పడండి. ఏదో తెలియని అభద్రత, భయము కలుగవచ్చును.
    ఈ విధమైన గ్రహస్థితి పరిశీలించగా సంవత్సరము పూర్వార్థము అన్ని విధాలుగా యోగదాయకముగా ఉంటుంది. చాలా కాలంగా మీరు అనుభవిస్తున్న అవస్థలనుండి ఉపశమనము లభించే అవకాశము గలదు. జీవితములో అనేకమైన అనుభవాలు, ఉచితానుచితాలు తాము చూసిన, నమ్మిన మనుష్యులు మొదలైన అనేక విషయాలపై ఒక స్థిరమైన పారదర్శకమైన ఆలోచన దారి మీకు కనపడుతుంది. గోముఖ వ్యాఘ్రములను గుర్తిస్తారు. వారిని ద్వేషంతో కాకుండా మంచితనంతో దూరం ఉంచాలని నిర్ణయిస్తారు. జీవితాశయము నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. దాదాపుగా సఫలమవుతారు. ఊహలలో విహరించడం మానుకొని తమ, పర భేదము తెలుసుకొని, హోదా ధనంతో మంచితనాన్ని మంచి స్నేహాన్ని పొందలేమని గ్రహిస్తారు.
    స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. సమాజంలో గతంలో నష్టపోయిన పరపతిని ప్రతిష్టను తిరిగి పొందుతారు. ఎవరైతే గతంలో అవమానపరిచారో వారు నిజము తెలుసుకొని పశ్చాత్తాప పడతారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మానసిక ఆనందముచే చక్కని స్థిర నిర్ణయాలు తీసుకుాంరు. దాంపత్య సౌఖ్యము ఏర్పడుతుంది. గతంలో ఉన్న అపోహలు, అవమానాలు సమసిపోతాయి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ప్రస్తుతమున్న ఆదాయానికి మరొక్క ఆదాయము తోడవును. తెలివితో చాకచక్యంతో శతృవులపై ఆధిపత్యాన్ని సాధిస్తారు. వారు తీసుకున్న గోతిలో వారే పడేలా ఎత్తుకు పైఎత్తులు వేస్తారు. అవివాహితులకు చక్కని వివాహ సంబంభాలు నిశ్చయము అవుతారు. మానసిక సంతృప్తి ఏర్పడుతుంది. సంతానప్రాప్తి కలుగుతుంది. పుత్రసంతాన ప్రాప్తి సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వారి పరిచయాలు ఏర్పడుతాయి. మీకు ఉన్నత గౌరవాలు స్థాయి దక్కుతుంది. విలువైన విలాస వంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో అనేక రకాలైన క్రొత్త మార్గాలు అవలంభించి వ్యాపారంలో లాభాలు సాధిస్తారు. నష్టాలలో ఉన్న వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపిస్తారు. సమాజంలో ముఖ్యమైన అనవసరమైన  కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఉన్నతస్థాయి అధికారుల ప్రశంసలు పొందుతారు. అదనపు, భాద్యతలు నిర్వహించవలసి వస్తుంది. పని తీవ్రత, వత్తిడి పెరిగే అవకాశము గలదు. ఉద్యోగంలో ఉన్నతస్థాయికి (ప్రమోషన్‌) ఎదుగుతారు. నూతన వాహనాలు సమకూర్చుకుాంరు. చరాస్తులు వృద్ధి పరుచుకుాంరు. ప్రేమ వివాహాలు సఫలము కావచ్చును. నూతనంగా వ్యాపారపరంగా భూములపై బంగారంపై లేదా షేర్‌ మార్క్‌ెలో పెట్టుబడులు పెడతారు. తమ సంతానానికి వారి భవిష్యత్తుకై పిష్టమైన ప్రణాళికను సిద్ధంచేసి అమలు పరుస్తారు.
    మానసిక శ్రమ శారీరక శ్రమ ఎక్కువగా ఉన్నను అది భవిష్యత్తులో మీరు వరించే విజయానికి సోపానముగా భావించండి కాని అహంభావము తమకు ఎదురులేదనే భావన మీలో ఏర్పడగలదు. తద్వారా మీకై మీరు అరిష్టములను ఆహ్వానించిన వారగుదురు. స్నేహము, స్నేహితుల విషయంలో ఒకింత మెళకువ, జాగ్రత్త అవసరం. మితిమీరిన ఆత్మ విశ్వాసం పనికిరాదు. ఏ పని అయినా ఒకికి పదిసార్లు ఆలోచించాలి. ఆహార విహారాదులలో ఒక క్రమపద్ధతి నియంత్రణ అవసరం. ఉదర సంబంధ సమస్యలు బాధించగలవు. కఠినమైన మానసిక ప్రవర్తన వలన, ఆత్మీయుల నుండి సమస్యలు, వారి నుండి కొంత అభిప్రాయ బేధములు ఏర్పడే అవకాశములు గలవు. తమ వైభవానికి ప్రతిష్ఠకు కొంత భంగకరమైన వాతావరణం ఏర్పడే అవకాశములు గలవు. అకారణ భీతి మొదలగు ఫలితాలు వత్సరారంభం నుండి మొది మూడు నెలలు సంభవించు అవకాశములు గలవు. తరువాత వత్సరాంతము మంచి ఫలితాలు ఏర్పడగలవు. కనుక అనవసర అతి అనాలోచిత నిర్ణయము తీసుకొనకూడదు. శ్రేయోభిలాషులు సలహాలు తీసుకోవాలి. తొందరపాటుతో ఎదుివారి మనస్సు బాధ పెట్టకుండా నడచుకోవాలి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. బంధు ద్వేషము ఏర్పడే అవకాశములు గలవు.
     భాగస్వామ్య వ్యాపారాలలో తమ పాత్ర కీలకమౌతుంది. ప్రభుత్వ పరంగా తమకు రావలసిన, ఋణాలు కొంత ప్రయత్నం వలన లభించును. వ్యాపార నిమిత్తమై భూసేకరణ విషయంలో గతంలో తాము ప్టిెన పెట్టుబడి లేదా భూమి వివాదాస్పదమవుట లేదా కోర్టు సంబంధ విషయాలలో పునరావృతమగుట జరుగును.వత్సరారంభంలో 8 నెలలు శని ప్రభావము అంతగా అనుకూలముగా లేకున్నను, శుభస్థాన స్థితి వలన మేలు జరుగును. ముఖ్యముగా స్త్రీ, పురుష స్నేహాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కలదు. నీచజన సహవాసము కలదు. నవంబరు నుండి ధన,ధాన్య వృద్ధియు స్థిర,చరాస్థులు కొనుగోలు చేయుట మరియు గృహనిర్మాణాది కార్యక్రమములు విజయవంతముగా పూర్తి చేయుదురు. స్త్రీ సౌఖ్యము తాము కోరుకున్న వ్యక్తులతో వివాహము జరగుటయు, అవివాహితులకు వివాహ ప్రాప్తియు జరుగును. సంతానం కొరకు తాపత్రయపడు దంపతులకు శుభసూచనలు కనపడుచున్నవి. సంతాన సౌఖ్యము కలదు. సంతానము యొక్క విద్యా విషయంలో శ్రద్ధ చూపిస్తారు. వారి భవిష్యత్తుకు కావలిసన ప్రణాళికలు పూర్తి చేస్తారు.     
    సరాసరిగా ఈ రాశివారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్ననూ తమ ఆత్మ విశ్వాసము, తమ నైపుణ్యత, ఓపిక చాకచక్యము నిరూపించుకోగల అవకాశాలు విరివిగా గలవు. ఈ సంవత్సరం శని, కుజ,కేతు, గురు ధ్యానములు జపహోమాదులు నిర్వర్తించండి. నిత్యం హనుమాన్‌ చాలీసా, విష్ణు సహస్రనామ స్తోత్రం, దుర్గా స్తోత్రం, గణపతి అర్చన వారి వారి కుటుంబ ఆచారం ప్రకారం ధ్యానం చేసిన మేలు జరుగును.

కొదుమగుళ్ళ వారి శ్రీదుర్ముఖినామ సంవత్సర పంచాగము 2016-17


Midhuna Raasi

మిధునరాశి - మృగశిర 3,4(కా,కి)
ఆర్ద్ర 1,2,3,4(కు,ఖం,ఙ్ఞ,చ్ఛ)-పునర్వసు 1,2,3(కె,కో,హ)

ఆదాయము 14 వ్యయం 11 రాజపూజ్యం 7 అవమానం 7


    ఈ రాశివారికి గురువు వత్సరాది 11.8.16 వరకు తృతీయస్థానమున సువర్ణమూర్తియై ఉండును. తదుపరి వత్సరాంతము చతుర్థస్థానమున సువర్ణమూర్తియై ఉండును. శని వత్సరాది 26.1.17 వరకు 6వ స్థానమున రజిత మూర్తియై ఉండును. తదుపరి వత్సరాంతము 7వ స్థానమున తామ్రమూర్తియై ఉండును. రాహువు వత్సరాది వత్సరాంతం తృతీయమున కేతువు నవమ స్థానమున లోహమూర్తియై ఉందురు.
    ఈ విధమైన గ్రహస్థితిని పరిశీలించగా ఈ సంవత్సరము వీరికి చాలా విషయాలతో సర్దుకుపోయే మనస్తత్వము కల్గియుండుట శ్రేయస్కరము. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ వృధాఖర్చులు చేస్తారు. ఈ విషయంలో ఒకింత జాగ్రత్త అవసరము. తమ శ్రేయోభిలాషులు, స్నేహితులు. మిమ్ములను అమితంగా ఇష్టపడేవారి యొక్క మాటలను సూచనలను ప్టించుకోకపోవడం ఇబ్బందికరంగా పరిణమించవచ్చును. గోముఖ వ్యాఘ్రాలను నమ్మి మోసపోయే అవకాశము గలదు. అవకాశము ఉన్నదని, అయాచిత ఋణము లభిస్తున్నదని అనాలోచితముగా ఋణములు చేసే అవకాశము గలదు. తస్మాత్‌ జాగ్రత్త. నూతన పరిచయాలు ఇబ్బంది గలిగించవచ్చును. కొత్త వ్యాపారాలతో పెట్టుబడులు పెట్టునపుడు ఒకింత ఆలోచించండి. స్వయంకృతాపరాధము సంభవించవచ్చును. ప్రస్తుత తమస్థాయిని తగ్గించడానికి అనేక ప్రయత్నాలు జరిగే అవకాశము గలదు. బాధ్యతలను విస్మరించకుండా జాగ్రత్త పడండి. మానసిక ప్రశాంతత లోపించవచ్చును. మనుజులు ఈ విధంగా కూడా ఉంారా ! అని ఆశ్చర్యం కల్గుతుంది. దీనికి కారణం కొన్ని సందర్భాలలో మీ శ్రేయస్సుకోరే వారిని విస్మరించడమని తెలసుకోవాలి. ఆస్తులు, భవనాలు మొదలైన వాిని వృద్ధి చేసుకోవాలని ఆరాటము ఎక్కువౌతుంది. విలాసాలు, సువర్ణాభరణముపై ఆసక్తి పెరుగుతుంది. తాము అనుకున్నది సాధించడానికి కొంత వక్రమార్గ ఆచరణ కూడా చేయవలసిన పరిస్థితి రావచ్చు. ఆస్తులు మార్పిడి చేసే అవకాశము గలదు. భూవ్యాపారాలు కొంతవరకు లాభిస్తాయి. మధ్యవర్తిత్వాలు, మధ్యవర్తి వ్యాపారాలు కొంతవరకు లాభిస్తాయి. ఏమి చేసి అయినా అవాంతరాలు ఎదురైనా తోి వారిలో మీ స్థాయిని పెంచుకునే ప్రయత్నము చేస్తారు. సఫలమవుతారు. సంప్రదాయ విషయాలపై ఆసక్తి, శ్రద్ధ చూపిస్తారు. వ్యాపారాన్ని స్వంతంగా నిర్వహించాలని ప్రయత్నాలు చేస్తారు. వ్యాపార భాగస్వాములను దూరంగా ఉంచాలని ప్రయత్నాలు చేస్తారు. రాజకీయ పరపతి ఉన్నత వ్యక్తుల పరిచయాలు ఏర్పడుతాయి. మీకంటూ ఒక వర్గాన్ని స్థిరపరుచుకుాంరు. నూతన భవన నిర్మాణానికి బ్యాంక్‌ ఋణాలకై ప్రయత్నాలు చేస్తారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మాకూడదో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. శక్తికి మించిన కార్యాలు చేయవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. పేరుప్రతిష్టలకు లోపం ఉండదు. దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది. ప్రతిష్టలకు లోటు ఉండదు. రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉన్నవారి వల్ల మీకు విశేషంగా సహకారం లభించవచ్చును. కండరాలు, కీళ్ళనొప్పులు అవస్థలు మాత్రం భరించక తప్పదు, బిపి, షుగర్‌ విం వ్యాధుల విషయంలో ఏమాత్రం అశ్రద్ధ, అజాగ్రత్త పనికిరాదు.నూతన విద్యలపై ఆసక్తి చూపిస్తారు.
    స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. సమాజంలో గతంలో నష్టపోయిన పరపతిని ప్రతిష్టను తిరిగి పొందుతారు. ఎవరైతే గతంలో అవమానపరిచారో వారు నిజము తెలుసుకొని పశ్చాత్తాప పడతారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మానసిక ఆనందముచే చక్కని స్థిర నిర్ణయాలు తీసుకుాంరు. దాంపత్య సౌఖ్యము ఏర్పడుతుంది. గతంలో ఉన్న అపోహలు, అవమానాలు సమసిపోతాయి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ప్రస్తుతమున్న ఆదాయానికి మరొక్క ఆదాయము తోడవును. తెలివితో చాకచక్యంతో శతృవులపై ఆధిపత్యాన్ని సాధిస్తారు. వారు తీసుకున్న గోతిలో వారే పడేలా ఎత్తుకు పైఎత్తులు వేస్తారు. అవివాహితులకు చక్కని వివాహ సంబంభాలు నిశ్చయము అవుతారు. మానసిక సంతృప్తి ఏర్పడుతుంది. సంతానప్రాప్తి కలుగుతుంది. పుత్రసంతాన ప్రాప్తి సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వారి పరిచయాలు ఏర్పడుతాయి. మీకు ఉన్నత గౌరవాలు స్థాయి దక్కుతుంది. విలువైన విలాస వంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో అనేక రకాలైన క్రొత్త మార్గాలు అవలంభించి వ్యాపారంలో లాభాలు సాధిస్తారు. నష్టాలలో ఉన్న వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపిస్తారు. సమాజంలో ముఖ్యమైన అనవసరమైన  కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఉన్నతస్థాయి అధికారుల ప్రశంసలు పొందుతారు. అదనపు, భాద్యతలు నిర్వహించవలసి వస్తుంది. పని తీవ్రత, వత్తిడి పెరిగే అవకాశము గలదు. ఉద్యోగంలో ఉన్నతస్థాయికి (ప్రమోషన్‌) ఎదుగుతారు. నూతన వాహనాలు సమకూర్చుకుాంరు. చరాస్తులు వృద్ధి పరుచుకుాంరు. ప్రేమ వివాహాలు సఫలము కావచ్చును. నూతనంగా వ్యాపారపరంగా భూములపై బంగారంపై లేదా షేర్‌ మార్క్‌ెలో పెట్టుబడులు పెడతారు. తమ సంతానానికి వారి భవిష్యత్తుకై పిష్టమైన ప్రణాళికను సిద్ధంచేసి అమలు పరుస్తారు.
    శతృవులు స్తబ్ధులై ఉంారు. సుఖ, సౌఖ్యాలు పరిస్థితులను మీకు అనుకూలంగా మలుచుకుాంరు. జీవిత భాగస్వామితో చక్కని అనురాగ పూరితమైన వాతావరణం ఏర్పడుతుంది. శయ్యాసౌఖ్యము లభిస్తుంది. జనాకర్షణ పెరుగుతుంది. ప్రభుత్వపరంగా మీకు అందవలసిన ప్రయోజనాలను అందుకుాంరు. రాజకీయ లబ్ధి, పరపతి ఏర్పడుతుంది. నూతన గృహనిర్మాణానికై మీరు చేయు కృషి ఫలిస్తుంది. మీ వృత్తికి తగిన మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. కళాకారులకు చక్కని అవకాశాలు లభిస్తాయి. విలాసవంతమైన ఖరీదైన జీవితము గడిపే అవకాశాలు లభిస్తాయి. నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశము గలదు.
     ధైర్యము పెరుగుతుంది. ఇతర సంప్రదాయ, మతాంతర, కులాంతర స్త్రీ, పురుషుల స్నేహాలు ఎర్పడుట, గర్భధారణ జరిగిన స్త్రీలు ప్రసూతి వరకు తగిన జాగ్రత్తలు తీసుకొనవలెను. విషజంతు భయము. కిం దంత సమస్యలు, దూరప్రాంత ప్రయాణాలు చేయునపుడు తగు జాగ్రత్తలు అవసరము. మత ఛాందసవివాదాలకు దూరంగా ఉండండి. తండ్రి ఆరోగ్య విషయంలో అజాగ్రత్త పనికిరాదు. విలువైన వస్తువులు సువర్ణాభరణములు తగు జాగ్రత్తగా దాచుకోవాలి. చోరభయము కనబడుచున్నది. భార్య తరపున బంధువులతో వివాదములు. తాంత్రిక విద్య అభ్యసించిన వారి పరిచయాలు. జ్వరబాధ, దీర్ఘకాలిక వ్యాధులకు లేదా తప్పని సరి పరిస్థితులలో శస్త్రచికిత్స. అల్సరు, చర్మబాధలు బాధించవచ్చును.
     మధ్యవర్తిత్వము చేయునపుడు తగు జాగ్రత్తలు అవసరం. తమ సంతానాన్ని ఉన్నత విద్యలకై విదేశాలకు పంపే ప్రయత్నము సఫలమవుతుంది. కోర్టు వివాదములు మధ్యవర్తిత్వము ద్వారా పరిష్కరించుకుాంరు. మొత్తం మీద ఈ రాశివారలకు శనిబలం అనుకూలంగా ఉన్నా గురుబలం ప్రతికూలంగా ఉన్నది కనుక గురుధ్యానం మరియు రాహుకేతు గోసేవ, శ్రీరామరక్షాస్తోత్ర పారాయణం. కృష్ణాష్టకము చేసిన మేలు జరుగును. అనాధ స్త్రీలకు వివాహం కొరకు సహాయం, అర్థించే వారికి తమకు తోచిన సహాయం చేయండి. శుభాలు పొందండి.

కొదుమగుళ్ళ వారి శ్రీదుర్ముఖినామ సంవత్సర పంచాగము 2016-17

 


Vrishabha Rashi

 

వృషభరాశి -  కృత్తిక 2,3,4 (ఈ,ఊ,ఏ)
రోహిణి 1,2,3,4(ఓ,వా,కీ,వూ)-మృగశిర 1,2(వే,వో)

ఆదాయము 11 వ్యయం 14 రాజపూజ్యం 4 అవమానం 7


    ఈ రాశివారికి గురువు వత్సరాది 11.8.16 వరకు చతుర్థస్థానమున రజితమూర్తిగా ఉండును. తదుపరి వత్సరాంతము పంచమస్థానమున తామ్రమూర్తియై ఉండును. శనివత్సరాది 26.1.17 వరకు సప్తమస్థానమున తామ్రమూర్తిగా ఉండును. తదుపరి వత్సరాంతము అష్టమస్థానమున లోహమూర్తియై ఉండును. రాహువు వత్సరాది వత్సరాంతము 4వ స్థానమున కేతువు 10వ స్థానమున రజితమూర్తులై ఉందురు.
    ఈ విధమైన గ్రహస్థితి పరిశీలించి చూడగా శుభాశుభ మిశ్రమ ఫలితములు కనపడుచున్నది. ప్రతి చిన్న విషయానికి కూడా విపరీతమైన కృషి అవసరం. పనులపై అనాసక్తి చూపకండి. శ్రేయాంసి బహువిఘ్నాని అన్నట్లుగా ఎన్ని అవరోధములు ఎదురైనా మీ పట్టుదలను సడలనీయకండి. మనోధైర్యము వీడకూడదు. ఇంకా ఎంతకాలము ఈ సమస్యలు అని మానసిక నిర్వేదము ఏర్పడుతుంది. ఆరోగ్యము కాస్త ఇబ్బంది కలిగించవచ్చును. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఔషధ సేవనము వైద్యపర్యవేక్షణము అవసరము కావచ్చును. మీ మనో ధైర్యమే మీకు శ్రీరామరక్ష అని తెలుసుకోండి. మేకవన్నె పులులు, నక్క వినయాలు గల మనుష్యులను గుర్తించడములో విఫలమయ్యే అవకాశాలు గలవు. ఎవరు తనవారు, ఎవరు పరాయి వారో గ్రహించండి. మిమ్ములను అభిమానించే వ్యక్తులను నిరాదరిస్తారు. స్తుతి ప్రియులుగా మారుతారు. గోముఖ వ్యాఘ్రాలను నమ్మి మోసపోయే అవకాశము గలదు. రాజకీయ పరపతి ఉన్న వ్యక్తుల వల్ల కొంత మేలు జరుగవచ్చును. విద్యార్థులకు ప్రయాసతో నైనా ప్రయోజనాన్ని పొందుతారు. మీ ప్రధాన శత్రువు.
        మీరు కోరుకున్న ప్రదేశంలో ఆ విద్యాసంస్థలలో ప్రవేశము లభించవచ్చును. మీలో ఉన్న బలహీనతలను మీరు గుర్తిస్తారు. సంవత్సరము ద్వితీయార్థంలో విశేష ఫలితము కలుగుతుంది. ఉద్యోగప్రాప్తి, వివాహప్రాప్తి, నూతన వాహన ప్రాప్తి కలుగుతుంది. పోీపరీక్షలకు మాత్రము అధిక శ్రద్ధ వహించాలి. చెప్పుడు మాటలు నమ్మి సువర్ణావకాశము జారవిడుచుకునే అవకాశము గలదు. సంవత్సరము ద్వితీయార్థంలో విద్యావకాశాలు అనుకూలంగా ఉంాయి. పోీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి అనుకూల సమయము.ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలలో విశేషంగా భాగస్వాములు అవుతారు. తమ సంతానం పూర్తిగా సమర్థవంతంగా తమ విద్యుక్త ధర్మాన్ని పాించడం ఆనందదాయకము. సంతానము ప్రయోజకులు అవుతారు. ఇష్టం లేకున్నా కొందరిని దరి చేర్చక అనగా దగ్గర తీయక తప్పని స్థితి ఏర్పడుతుంది. చాలా కాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్య ఉపశమించవచ్చును. ఎలర్జీ విం బాధ ఆరంభం కావచ్చును. వ్యసనాలకు దూరంగా ఉండంది. సంవత్సర ద్వితీయార్థంలో అవివాహితులకు వివాహ సూచన. గర్భిణులు అజాగ్రత్త. నిర్లక్ష్యం దరి రానీయకండి. మీరు కోనుగోలు చేసిన ఆర్తి విలువ ర్టిెంపు అయ్యే అవకాశాలు స్వగృహప్రాప్తి. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. వత్సరారంభంలో వృధా ఖర్చులు అయ్యే అవకాశము సంతానం యొక్క ఆరోగ్యమునకు సమస్యలు ఏర్పడును. విషజంతువులు నుండి జాగ్రత్తలు అవసరం. జీవిత భాగస్వామి ఆరోగ్యము కొంత కలవపరిచే అవకాశము గలదు. ప్రత్యక్ష శత్రువుల కన్నా పరోక్ష శత్రువులే అధికంగా ఉన్నారని గ్రహిస్తారు. దగ్గరి బంధువులు లేదా స్నేహితులు మీపై ఈర్ష్య మీ అభివృద్ధిని కాని మంచితనాన్ని కాని జీర్ణించుకోలేక పోవడం గుర్తిస్తారు. తల్లిగారి ఆరోగ్యము కూడా కొంత ఇబ్బంది పెట్టవచ్చును. వాహనాలు నడుపునపుడు తగు జాగ్రత్తలు అవసరం. ఇన్యూరెన్స్‌ మొనవి ఎప్పికపుడు చెల్లించి సక్రమమార్గంలో ఉంచండి.
    నిద్రకు తరచూ భంగము ఏర్పడవచ్చును. విద్యాభంగము జరిగే సూచనలు కలవు. ఉద్యోగస్థులకు ప్రధమార్థం కన్నా ద్వితీయార్థం కొంత మేలు చేయును. తొందరపడి కఠిన నిర్ణయాలు తీసుకొనగూడదు. ఉద్యోగములో శ్రమ అధికంగా ఉన్ననూ వత్తిడి అధికంగా ఉన్ననూ కాస్త ఓపిక అవసరం. తొందరపడి రాజీనామా ప్రయత్నం చేస్తారు. సంవత్సరం  ద్వితీయార్థంలో పరిస్థితులు అనుకూలిస్తాయి. మీ శ్రమను మీ యాజమాన్యముగాని, మీపై అధికారులుగాని గుర్తిస్తారు. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందాలనే ప్రలోభాలకు లొంగకండి. విద్యుత్తుతో జాగ్రత్త అవసరం. ఎలర్జీ సమస్యలు బాధించవచ్చును. ఆధ్యాత్మిక యజ్ఞయాగాదులు నిర్వహించుటలో మీ పాత్ర నిర్వహిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. మీరు అదనపు బాద్యతలు నిర్వహించవలసిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ద్వితీయార్థంలో సఫలం కావచ్చును. దాంపత్య సమస్యలు చిలికి చిలికి గాలివాన లాగే మారే పరిస్థితి రావచ్చును. కలహాలకు దూరంగా ఉండంది. చాలా కాలంగా ఉన్నవారికి కొంతమేలు జరుగుతుంది. నూతన అవకాశము లభిస్తాయి. నరాల సమస్యలు, కండరాలు, ఎముకలు, కీళ్ళనొప్పులు బాధించే అవకాశం గలదు. తరుచుగా శిరోబాధ విసిగించవచ్చును. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలు, శాఖాపరమైన దర్యాప్తులు జరిగే అవకాశము గలదు.
    సంవత్సర ద్వితీయార్థంలో చాలా రోజులుగా అనుభవించిన చికాకులు తొలగి సుఖపడే సమయం దగ్గరలో ఉన్నదని సంతృప్తి చెందుతారు. సంతానం వల్ల ఏర్పడిన చికాకులు తొలగుతాయి. వారి విద్యాభివృద్ధి చెందుతుంది. తమ సంతానానికి వివాహం చేస్తారు. ఆరోగ్య సమస్యలు నెమ్మదిగా ఉపశమించును. చాలా రోజులుగా కారణం తెలియని దీర్ఘవ్యాధులకి ఒక మార్గము, వ్యాధి నిర్ధారణ జరిగి సరియైన ఔషధము లభించును. రావలసిన ధనము చేతి కందుతుంది. ఇక రావు అనుకున్న బాకీలు ఊహించని విధముగా అందుతాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణము నెమ్మదిగా ఏర్పడుతుంది. తీర్థయాత్రలు చేయుట, పర్వతప్రాంత సందర్శన జీవిత భాగస్వామితో గతము కన్నా అనుకూలముగా ఉంటుంది. అయినా మీరు ఊహించని మార్పు జీవిత భాగస్వామిలో రాకపోవడం వల్ల కొంత నిరాశ ఏర్పడుతుంది. ఏనాికైనా మీ మాటకు విలువ ఏర్పడుతుంది. మిమ్మలని అర్థం చేసుకుాంరని ఆశ బలీయంగా ఏర్పడి అందుకు కావలసిన సూచనలు. శుభ శకునాలు కనబడుతాయి. ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. జనాకర్షణ పెరుగుతుంది. మీ స్నేహాన్ని వాంఛించే వారు పెరుగుతారు. భవిష్యత్తుకు కావలసిన నిర్ణయాలు ధైర్యంగా తీసుకుాంరు అజాగ్రత్త పనికిరాదు. వాహనములు నడుపునప్పుడు జాగ్రత్తలు పాించాలి. ఎవరు ఎన్ని విధాలుగా మిమ్ములను రెచ్చగొట్టే ప్రయత్నము చేసిన సహనంగా ఉండాలి. అదే మీకు శ్రీరామరక్ష. నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అన్నట్లుగా వ్యవహరించాలి. అందుచేత ఈ న్యాయమును పాించిన అన్ని విధాలా శ్రేయస్కరము. తమకు సంబంధము లేని విషయాలపై ఆసక్తి చూపి తమకు తాము అరిష్టమును స్వాగతించెదరు. స్నేహాల విషయంలో ఒకింత జాగ్రత్తగా ఉండాలి.     
    స్నేహ ధర్మం కొరకు ఎదుివారు చేసిన పొరపాటుకు మీరు సంజాయిషీ చెప్పవలసిన పరిస్థితి రావచ్చును. కోర్ట వివాదాలు, పోలీస్‌ స్టేషన్‌లు విసుగు కల్గించవచ్చును. అనవసర నేరారోపణలు ఎదుర్కొవలసి వచ్చే అవకాశం కలదు. ఇందుకు మీ అతి మంచితనము కారణము కావచ్చును. మిమ్ములను మీరు మరచి అత్యుత్సాహాముతో పరిసరాలను మరచి మీరు మ్లాడే మాటలు వివాస్పదం కావచ్చును. స్త్రీ, పురుష పరిచయాలు, స్నేహాలు విషయంలో అపోహలు, అవమానాలు ఏర్పడే సూచనలు. పాదములకు గాయములు, వృధాఖర్చులు, ధనవ్యయము, జంతువుల వలన ప్రమాద సూచన గలదు. శక్తికి మించిన కార్యాలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ప్రత్యక్ష మిత్రులు పరోక్ష శత్రువులుగా మారే అవకాశం కలదు. ఇంకా ఉత్తమ ఫలితాల కొరకు, అరిష్ఠ నివృత్తికి గోసేవ చేయండి. పేద విద్యార్థులకు, అనాథ వృద్ధులకు చేయూత నివ్వండి. దేవతా వృక్షాలను పెంచండి. శని, గురు, రాహు, ధాన్య శ్లోకాలు నిత్యం పారాయణం చేయండి.

కొదుమగుళ్ళ వారి శ్రీదుర్ముఖినామ సంవత్సర పంచాగము 2016-17


Mesha Raasi

 

మేషరాశి  -  అశ్విని 1,2,3,4 (చూ,చే,చో,లా)
భరణి 1,2,3,4 (లీ,లూ,లే,లో)- కృత్తిక 1వ పాదము (అ)

ఆదాయము 2 వ్యయం 8 రాజపూజ్యం 1 అవమానం 7


        ఈ రాశివారికి గురువు 11.8.16 వరకు పంచమస్థానమున తామ్రమూర్తియై ఉండును. తదుపరి వత్సరాంతం లోహమూర్తియై షష్ఠమస్థానమునందు ఉండును. శని వత్సరాది 26.1.17 వరకు అష్టమస్థానము నందు సువర్ణమూర్తియై ఉండును. తదుపరి వత్సరాంతం రజితమూర్తియై నవమమునందు ఉండును. రాహువు వత్సరాది వత్సరాంతం 5వ స్థానమున కేతువు 11వ స్థానమున సువర్ణమూర్తులై ఉందురు.
    'గ్రహగమనము ఒకరికొరకు ఆగదు. కాలము-శాస్త్రము తన విధి నిర్వహణలో ఎవరి విషయంలోనూ పక్షపాతము చూపదు. జీవన సుఖ, దుఃఖ భ్రమణములో సమస్యలను ధైర్యముగా అధిగమిస్తూ శాస్త్ర సూచితమైన పరిహారములను ఆచరిస్తూ, భగవదనుగ్రహము, భాగవత మంగళాశాసనములతో మానవత్వపు విలువలు కల్గి, పరోపకార బుద్ధితో సత్కర్మాచరణం స్వధర్మానుష్ఠముతో సత్సాంగత్యముతో జీవనయనము సాగించిన గ్రహబాధల నుండి ఉపశమనము లభించును. అదియే జ్యోతిర్మార్గ దర్శనము'.
    ఈ సంవత్సరము మేషరాశివారికి గ్రహస్థితి పరిశీలించి చూడగా ఆగస్టువరకు విశేష కార్యములు చేయడంలో ఉత్సాహము చూపిస్తారు. ఏదో సాధించాలనే తపన పెరుగుతుంది. జనాకర్షణ విశేషముగా పెరుగుతుంది. మీలో దాగి ఉన్న సృజనాత్మకత వెలుగులోకి వస్తుంది. గృహములో విశేషశుభకార్యాచరణ చేస్తారు. చాలా కాలంగా వేచి చూస్తున్న శుభవార్త వింరు. సంతాన ప్రాప్తి కలదు. స్త్రీలకు దీర్ఘ సమస్యలు తీరి చక్కని పరిష్కార మార్గము లభించ గలదు. ధార్మిక, కార్యక్రమాలు చేస్తారు. నూతన వాహనప్రాప్తి కలదు. సమాజంలో ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తుల పరిచయము సంప్రాప్తించగలదు. రహస్య కార్యకలాపములు చేయవలసిన పరిస్థితులు ఉత్పన్నము కావచ్చును. భవిష్యత్తుకు ఉపయోగించే నూతన పరిచయాలు ఏర్పడవచ్చును. మీలో దాగి ఉన్న నైపుణ్యము సృజనాత్మకత తెలివి తేటలు తెలియపరచడానికి తగిన సమయం, నిరాశ, కాలయాపనము, దరికి రానివ్వకండి. పనులు వాయిదా వేయడము, ఊహలలో విహరించడం మీ ప్రధాన శతృవని గ్రహించండి. ప్రతి క్షణము తెలివిగా ఉపయోగించుకునే ప్రయత్నము చేయండి. సమాజంలో గౌరవము, పేరు ప్రఖ్యాతులు లభించగలవు. ఇతరులు చేసిన సత్కార్యములు మీరే చేసినట్లుగా చెలామణి అవుతారు. పండితునిగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. ఒక విశేష కార్యము కాని మీ మేథాసంపత్తి నిరూపించుకునే అవకాశాలు లభిస్తాయి. కాని మీ కాలయాపన ఒక రకమైన గాంభీర్యము వల్ల చేజార్చుకునే పరిస్థితి ఉత్పన్నము కావచ్చును.
    సమాజసేవా కార్యక్రమములో తమ వంతు బాధ్యత నిర్వహిస్తారు. విద్యార్థులు పోీ పరీక్షలలో విజయాన్ని సాధించే అవకాశాలు గలవు. కాని వాయిదావేసే తత్వము. వృధా కాలయాపన అతి గాంభీర్యము, మితిమీరిన ఆత్మ విశ్వాసము చేతికందిన ఫలాలను జారవిడుచుకునే ప్రమాదము గలదు. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి గలదు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు, కొందరికి సఫలము కావడము జరుగును. రాజకీయ నాయకులకు అధిపత్యము లభించును. నూతన పదవీ బాధ్యతలు లభించగలవు.
    ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభించడం చాలా కాలంగా నిరీక్షిస్తున్న ఉద్యోగపరమైన లాభాలు, రావలసిన లబ్ధి అందుకునే అవకాశాలు గలవు. తీర్థయాత్రలు కాని, విదేశీ ప్రయాణాలు గాని చేసే అవకాశాలు గలవు. న్యాయ మార్గము, ధర్మమార్గము అనుసరించాలనే స్థిరనిర్ణయాలతో ఉంారు. తాము కోరుకున్న విశ్వ విద్యాలయాలు కాని, విద్యాసంస్థలలో కాని ప్రవేశము లభించే అవకాశాలు గలవు.
    ఆగస్టు తరువాత మాత్రము ప్రతి విషయములోనూ జాగ్రత్తగా, ఆచితూచి అడుగు వేయాలి. మీలో ఉన్న రహస్యాలు గాని, ముఖ్యమైన విషయాలు గాని, వృత్తిపరమైన విషయాలు గాని, సాధ్యమైనంతవరకు గంభీరంగా గోప్యంగా ఉంచే ప్రయత్నం చేయండి. శ్రమ మీది ఫలితము పేరు మరొక్కరికి అయ్యే అవకాశాలు గలవు. ఆరోగ్య విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ అలసత్వము పనికిరాదు. చిన్న సమస్యకైనా సరియైన పరిష్కారానికి ప్రయత్నించండి. వాహనములు నడుపునపుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదర సంబంధిత సమస్యలు బాధించవచ్చును. భాగస్వామ్య వ్యాపారాలలో తగు జాగ్రత్తలు అవసరము. పరోక్ష శతృవులు ఉన్నారు. తస్మాత్‌ జాగ్రత్త. మీ నుండి విషయసేకరణ చేసి మీ పైనే వాిని ప్రయోగించే ప్రయత్నాలు జరుగవచ్చును.
    ధనము మంచి నీళ్ళలా ఖర్చు చేసే అవకాశము గలదు. అనాలోచిత నిర్ణయాలు అనేక అవరోధాలు సృష్టించవచ్చును. సంవత్సరాంతములో ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరము. మూత్ర సంబంధిత బాధలు. ఉదరము. కిడ్నీ సంబంధ విషయాలపై సరియైన వైద్యుణ్ణి సంప్రదించవలసిన అవసరము ఏర్పడవచ్చును. సమాజంలో గౌరవ, మర్యాదలు కాపాడకోవడానికి ప్రయత్నించవలసిన పరిస్థితులు ఉత్పన్నం కావచ్చును.
    దుర్జన సాంగత్యము పొంచి ఉన్నది. తస్మాత్‌ జాగ్రత్త ఆర్థిక సమస్యలు ఉత్పన్నం కావచ్చును. ఆనాలోచిత వృథా వ్యయము కనపడుచున్నది. ఇతరులు చేసిన పొరపాట్లకు మీరు బాద్యులు కాకుండా చూచుకోవాలి. ఉద్యోగస్తులకు యజమాన్యం వల్ల వేధింపులు ఉత్పన్నం కావచ్చును. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. ప్రతి చిన్న విషయానికి ఎక్కువ శ్రమపడవలసిన అవసరము. అగ్ని, విద్యుత్తు మొదలైన వాితో జాగ్రత్తలు అవసరం. ఎదుివారు రెచ్చగొట్టే ప్రయత్నము చేసినా సహనంగా ఉండాలి. ప్రతి చిన్న విషయానికి నిష్టూరపు మాటలు వినవలసి వస్తుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. స్త్రీ, పురుషుల స్నేహం విషయంలో అపోహలు అవమానాలు. ప్రేమికుల మధ్య విభేదాలు. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో ఔషధపరమైన ఖర్చులు. తరచూ అసత్యము పలుకవలసిన పరిస్థితులు. ఎదుివారు ఎంత తక్కువస్థాయిలో ఉన్నా వారిని తక్కువగా అంచనా వేయకండి. ఋణబాధల నుండి ఒక అమృతహస్తం వల్ల బయటపడతారు. షేర్‌ మార్క్‌ెలో సత్ఫలితము. కోర్టు వివాదాలు కొంత బాధించగలవు. వ్యవసాయ క్షేత్రములుగాని, గృహనిర్మాణ భూములు లాభిస్తాయి. వాహన యోగం కలదు. విద్యార్థులకు ప్రథమార్థం అనుకూలము. విదేశీ ప్రయత్నాలు సఫలం కావచ్చును. ధర్మము, సంస్కృతి,  ఆధ్యాత్మిక విషయాలలో ఆసక్తి, ప్రవేశము, స్నేహ లాభము, శతృధనము లభించుట, విలాసవంతమైన వస్తువులు ఖరీదు చేయుట, ఉద్యోగంలో పదోన్నతి.
    ఈ రాశివారు కనీసం ఒక నెల అయినా గోసేవ చేయండి. దేవతావృక్షాలను పెంచండి. వృద్ధులకు, వికలాంగులకు, అంధులకు, పేద విద్యార్థులకు కనీస సహాయం చేయండి. ప్రకృతిని కాపాడడానికి తమ వంతు కృషిచేయండి. శ్రీ రామరక్షాస్తోత్రము, హనుమాన్‌ చాలీసా, శని,గురు, రాహు స్తోత్రాలు నిత్యం ధ్యానం చేయండి. శుభం కలుగుతుంది. మీ మనోవాంఛ నెరవేరాలని నేనూ మా రాముడిని ప్రార్థిస్తాను.

కొదుమగుళ్ళ వారి శ్రీదుర్ముఖినామ సంవత్సర పంచాగము 2016-17

 


TeluguOne For Your Business
About TeluguOne
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.