.jpg)
బాలయ్య వందో సినిమా గురించి రోజుకో ఇంట్రస్టింగ్ అప్ డేట్ వస్తోంది. క్రిష్ డైరెక్షన్లో గౌతమీ పుత్ర శాతకర్ణి అన్న సినిమా ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయిపోయిన నేపథ్యంలో, ఈ సినిమాలో బాలయ్య తల్లి ఎవరు అన్నదానిపై చాలా చర్చ జరుగుతోంది. గౌతమీపుత్రుడు శాతకర్ణి కాబట్టి, హీరో కంటే ముందు గౌతమి పాత్ర చాలా ముఖ్యం అంటున్నారు సినీజనాలు. మరో వైపు ఈ పాత్రకోసం బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలినిని సంప్రదిస్తున్నారని, త్వరలోనే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మీడియాలో ఈ టాపిక్ నడుస్తున్నా, ఇది ఎంత వరకూ నిజమన్నదానిపై స్పష్టత లేదు.

పైగా సీనియర్ హీరోకి తల్లిగా, హేమమాలిని ఒప్పుకునే అవకాశాలు చాలా తక్కువే అనేది బాలీవుడ్ జనాల కథనం. ఇప్పటికీ తనను తాను యంగ్ గా చూపించుకోవడానికే 67 ఏళ్ల హేమమాలిని ట్రై చేస్తుంటారు. అందుకే ఆమెకు బాలీవుడ్ ఎవర్ గ్రీన్ డ్రీమ్ గర్ల్ అనే పేరు వచ్చింది. గతంలో ఒకే ఒక్కసారి అది కూడా 55 ఏళ్ల క్రితం పాండవవనవాసం సినిమాలో చేసిన డ్రీమ్ గర్ల్ ఇప్పుడు మళ్లీ ఇక్కడ నటించడానికి ఇంట్రస్ట్ చూపిస్తుందా లేదా అన్నదే ఆసక్తిని కలిగిస్తోంది. బాలయ్య వందో సినిమా గురించిన పూర్తి వివరాలు ఏప్రిల్ 8న స్వయంగా ఆయనే అనౌన్స్ చేస్తే తప్ప క్లారిటీ వచ్చేలా లేదు.