Home  » Movie-News » అభినేత్రి గా ఆ స్టార్ హీరోయిన్ భయపెడుతుందా..?



కెరీర్ డౌన్ అయిపోయిన హీరోయిన్లకు హర్రర్ సినిమాలు మంచి లైఫ్ లైన్ గా మారిపోయాయి. ఒక వేళ ఎవరైనా ఇదేంటి హర్రర్ చేస్తున్నారు అని అడిగితే, పెర్ఫామెన్స్ కు స్కోప్ ఉందని ఒప్పుకున్నా అంటూ నైస్ గా ఆన్సరిచ్చి ఎస్కేప్ అయిపోతారు. అంజలి పాప గీతాంజలి, నయన తార మయూరి, త్రిష కళావతి, తాప్సీ గంగ. ఇలా వీళ్లందరికీ కెరీర్ మీద కాస్త హోప్ ఇచ్చింది హర్రర్ కామెడీ జానర్. అందుకే తాను కూడా ఈ జానర్లో ఒక చెయ్యి వేయాలని డిసైడ్ అయింది మిల్కీ బ్యూటీ తమన్నా. ప్రభుదేవా ఈ సినిమాను తమిళంలో వైవిధ్యమైన సినిమాలు తెరకెక్కించిన విజయ్ డైరెక్షన్లో స్వయంగా నిర్మిస్తూ నటిస్తున్నాడు. సినిమాలో తమన్నాకు ప్రభుదేవాకు పెళ్లి అయ్యే సీన్ కూడా ఉండటం విశేషం. అభినేత్రి సినిమా కథ చాలా విభిన్నంగా ఉండబోతోందని మూవీ టీం చెబుతున్నారు. సోనూసూద్ విలన్ గా చేస్తున్న ఈ సినిమాను తెలుగులో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై కోన వెంకట్ రిలీజ్ చేస్తున్నారు. తెలుగు తమిళ హిందీ భాషల్లో ట్రైలింగువల్ మూవీగా అభినేత్రి రిలీజ్ అవనుండటం విశేషం.