Home  » Movie-News » సర్దార్ గబ్బర్ సింగ్ కు సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది..!



సర్దార్ గబ్బర్ సింగ్ కు సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేసింది. సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్ తో సర్దార్ కు ముద్ర వేసింది. విచిత్రమేంటంటే, రెండు పాటలు ఇంకా సినిమాలో పెట్టకుండా సెన్సార్ అయిపోయిందన్న టాక్ నడుస్తోంది. నిజానికి స్విట్జర్లాండ్ లోనే పాటల్ని ఆన్ లైన్ ఎడిటింగ్ చేయించేసి పంపించేశాడు పవన్. దాంతో పెద్దగా టైం తీసుకోకుండానే, ఆ రెండు పాటల్ని మిక్స్ చేసి ఫైనల్ కాపీలో ఇంక్లూడ్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. లేదా పాటలకు విడిగా సెన్సార్ చేయించి ఆ తర్వాత సినిమాలో యాడ్ చేసే ఛాన్స్ కూడా సర్దార్ టీంకు ఉంది.

సినిమాకు క్లీన్ యు ఇస్తామని, కానీ ఫైట్స్ లో వయొలెన్స్ సీన్స్ కొన్ని కట్ పడాలని బోర్డ్ చెప్పిందని తెలుస్తోంది. కానీ అసలైన కిక్కు ఫైట్స్ లోనే ఉంది కాబట్టి, కట్స్ లేకుండా, యుబైఏ సర్టిఫికెట్ తోనే బయటికొచ్చారు సర్దార్ టీం. ఏప్రిల్ 8 న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతున్న సర్దార్ కోసం ఇప్పటి నుంచీ ప్రచార కార్యక్రమాల్లో సర్దార్ టీం బిజీబిజీగా గడపబోతోంది.