Home  » Movie-News » మెగా డాటర్ రిసెప్షన్ కు కూడా పవన్ రానట్లేనా..?



పెళ్లికి హాజరు కాలేకపోయాడు పవర్ స్టార్. కనీసం రిసెప్షన్ కైనా హాజరవుతాడా అంటే ,అది కూడా కష్టమే అని తేలిపోయింది. ఏప్రిల్ 8న రిలీజ్ ఉండటంతో, చాలా హడావిడిగా సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు పవన్ కళ్యాణ్. ప్రెస్టేజ్ ఇష్యూ కావడంతో, ఇక చేసేదేమీ లేక శ్రీజ పెళ్లిని స్కిప్ చేసి పాటల షూటింగ్ కు స్విస్ వెళ్లిపోయాడు.

ఎట్టి పరిస్థితుల్లోనూ రిసెప్షన్ కు వచ్చేద్దామనే అనుకున్నా మంచు కొండల్లో షూటింగ్ అంటే అన్నీ అనుకున్నట్టు అవుతాయా..? పర్మిషన్లు, వాతావరణం, ఇలా సవాలక్ష సవాళ్లుంటాయి. ఎంత హడావిడిగా సాంగ్స్ ను పూర్తి చేయడానికి ట్రై చేసినా, 31లోపు ఇండియాకు రావడం అవలేదట. రేపు సాయంత్రానికి ఇండియాకు చేరగలుగుతున్నారు పవన్ అండ్ కో. రిసెప్షనేమో ఈ రోజు నైటే. దీంతో రిసెప్షన్ కూడా స్కిప్ కొట్టడం తప్ప పవన్ కు వేరే ఆప్షన్ లేకపోయింది. ఫ్లైట్ దిగగానే, ముందు కొత్త దంపతుల దగ్గరకు వెళ్లి విష్ చేయబోతున్నాడు పవన్. పెళ్లికి రాలేకపోయినా, ఫోన్లో శ్రీజ, కళ్యాణ్ లతో పవన్ చాలా సేపు మాట్లాడాడట. దీంతో బాబాయి రాలేదనే బెంగ శ్రీజకు కాస్త తగ్గిందట..