Home  » Movie-News » ఇండియన్ ప్రెసిడెంట్ అమితాబ్ బచ్చన్..?



భారత రాష్ట్రపతిగా అమితాబ్ బచ్చన్ ను చూడబోతున్నామా..? ఎస్పీ మాజీ లీడర్ అమర్ సింగ్ అవుననే అంటున్నారు. ఈ మధ్యే మోడీని కలిసిన ఆయన, మోడి అమితాబ్ పేరును ప్రధాని పదవికి పరిశీలిస్తున్నారని చెబుతున్నారు. ఒక టీవీ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ నటుడు, బిజేపీ ఎంపీ శత్రుఘ్న్ సిన్హా కూడా అమితాబ్ ను కాబోయే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గా సూచించారు. ప్రణబ్ తర్వాత, భారత అధ్యక్షుడిగా అమితాబ్ ఉంటే తాను చాలా గర్విస్తానని, సంతోషిస్తానని ఆయన అన్నారు. ఇప్పుడు అమర్ సింగ్ కూడా ఈ విషయం పై తమకు సమాచారం ఉందని చెప్పడంతో, అమితాబ్ పేరు దాదాపు కన్ఫామ్ అయినట్టే కనిపిస్తోంది.

మోడీకి అమితాబ్ అంటే ప్రత్యేకమైన అభిమానం. అందుకే తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, తన రాష్ట్రానికి బచ్చన్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకున్నారు. మొన్నీమధ్యే ఇంక్రెడిబుల్ ఇండియాకు అమీర్ ఖాన్ ను తప్పించి, ఆయన స్థానంలో అమితాబ్ ను తీసుకున్నారు. అమితాబ్ అంటే దేశ వ్యాప్తంగా ప్రజలు గౌరవిస్తారు. ఆయన పేరును ప్రతిపాదిస్తే, బిజేపీకి కూడా పొలిటికల్ గా మైలేజీ లభిస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చూస్తే, ప్రెసిడెంట్ పదవికి అమితాబ్ పేరును మోడీ సూచిస్తే అనుమానం లేదు మరి. ప్రస్తుతం అధ్యక్షుడు ప్రణబ్ పదవీకాలం 2017తో ముగుస్తుంది.