Home  » Movie-News » రేడియో మిర్చి ఆర్జేను కొట్టిన హీరో అర్జున్..!



సినిమా ప్రమోషన్ ను ఆ హీరోగారు వెరైటీ గా ప్లాన్ చేశారు. జనాన్ని ఏప్రిల్ ఫూల్ చేసి ఆ రోజు రిలీజవుతున్న తన సినిమాకు పబ్లిసిటీ కోసం ట్రై చేశాడు. ఆ హీరో రేడియో జాకీ చెంప పగలకొట్టి, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని డైలాగ్ వేసి, కేమేరా నేలకేసి కొట్టాడు. అర్జున్ నటించిన సినిమా ప్రమోషన్లో భాగంగా రేడియో స్టేషన్ కు వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగింది. అర్జున్ అంటే మన అర్జున్ కాదు. బాలీవుడ్ బ్యాడ్ బాయ్ అర్జున్ కపూర్. కీ అండ్ కా లో కరీనా కపూర్ ఉద్యోగం చేస్తుంటే, అర్జున్ కపూర్ ఇంటి దగ్గర గృహిణి బాధ్యతల్ని తన నెత్తిన వేసుకుంటాడు. దీనికి సంబంధించి, మీకు ఇంక ఏ క్యారెక్టరూ దొరకలేదా..? లేడీ క్యారెక్టర్స్ వేసుకుంటున్నారు అని ఆర్జే అడిగిన ప్రశ్నకు చెంప చెళ్లుమనిపించినట్టు నటించాడు.

ఆ తర్వాత ఇక్కడి వరకూ మాత్రమే ఒక వీడియో రిలీజ్ చేసి, అర్జున్ కపూర్ ఎలా చేశాడో చూడండి అని సెన్సేషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఇది చూసి వీడికి ఎంత పొగరురా అని అందరూ అనుకునే సమయంలో, తాపీగా మరో వీడియోలో, ఏప్రిల్ ఫూల్స్ అంటూ జనాన్ని ఫూల్ చేశారు అర్జున్ అండ్ ఆర్జే. ఇప్పటికే వెరైటీ స్టోరీలైన్ తో బాలీవుడ్ జనాన్ని ఆకట్టుకుంటున్న కీ అండ్ కా సినిమా, కీ అండ్ కా ఏప్రిల్ 1న రిలీజ్ కాబోతోంది. మరింతమందిని తన సినిమా గురించి మాట్లాడుకునేలా చేయడానికే ఈ విచిత్ర ప్రయత్నం. ఇంతకీ ఈ స్టోరీ లైన్ వింటుంటే, మన దగ్గర అప్పుడెప్పుడో ఇవివి గారు తీసేసిన జంబలకిడిపంబ గుర్తు రాక మానదు.