Home  » Movie-News » ఆ నిర్మాతకు షాక్ ఇచ్చిన బాలయ్య..?



బాలయ్య వందో సినిమా గురించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ లేకపోయినా, క్రిష్ తోనే ఉంటుదన్నది కన్ఫామ్ అయిపోయింది. గతంలో బాలయ్య వందో సినిమా తానే తీయబోతున్నానని, ఆయన తనయుడు మోక్షును కూడా తానే ఇంట్రడ్యూస్ చేస్తున్నానని కొర్రపాటి సాయి ప్రకటించేశారు. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే, బాలయ్య సాయికి షాక్ ఇచ్చినట్టే కనిపిస్తోంది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైన ' కంచె ' నిర్మించిన రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి లకే బాలయ్య వందో సినిమా నిర్మాణ బాధ్యతలు ఇవ్వనున్నట్టు సమాచారం. ఇది క్రిష్ సొంత సంస్థగానే చెప్పచ్చు.

సాయి కొర్రపాటి నిర్మాణంలో బాలకృష్ణ లెజండ్ తీసిన విషయం తెలిసిందే. అంతేకాక సాయి నందమూరి కుటుంబానికి వీరాభిమాని. అందుకే అంత ధైర్యంగా తానే వందో సినిమాను తీస్తున్నానని ప్రకటించగలిగారు. ఆ సినిమాకు కృష్ణవంశీ ఓకే అయి ఉంటే ఆయన చెప్పింది నిజమై ఉండేది. కానీ సడెన్ గా, రాజుల కథతో క్రిష్ రంగంలోకి రావడం, తన సొంత నిర్మాణ సంస్థ కావాలని బాలయ్యను రిక్వెస్ట్ చేయడం, ఆయన ఓకే చేయడం చకచకా జరిగిపోయాయి. దీంతో కొర్రపాటికి బాలయ్య హ్యాండ్ ఇవ్వక తప్పలేదు. వందో సినిమా మిస్ అయినా, తర్వాత రాబోయే 101, 102 సినిమాల్ని సాయి నిర్మించే అవకాశం ఉంది. కృష్ణవంశీ, సింగితం శ్రీనివాసరావు సినిమా కథల్ని బాలయ్య తనే చేయాలని ఫిక్స్ అయి లాక్ చేసుకున్నారట. సో, సాయికి వంద మిస్ అయినా, వరస జాక్ పాట్ లు కొట్టే ఛాన్స్ మాత్రం మిస్సవ్వలేదన్నమాటే..