Home  » Movie-News » శ్రీజ పెళ్లికి డుమ్మా కొట్టిన పవన్ కళ్యాణ్..!



గత ఐదు రోజులుగా, శ్రీజ పెళ్లివేడుకను మెగా కుటుంబం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. పెళ్లి ఎంత గ్రాండ్ గా జరిగిందో, నెట్టింట వచ్చిన ఫోటోలు, వీడియోలు చూస్తే అర్ధమవుతోంది. కానీ ఈ గ్రాండ్ మ్యారేజ్ కు పవన్ రాలేదు. సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ లో పవన్ యమ బిజీగా ఉన్నాడు. ఎలాగైనా టైం కు సినిమాను రిలీజ్ చేయాలనే హడావిడిలో ఉన్న పవన్, మరి పెళ్లికి రమ్మంటారా అని అడిగినప్పుడు స్వయంగా చిరునే, సినిమా ముఖ్యం, ఆ తర్వాతే ఇంకేదైనా అని చెప్పారట. దాంతో చిరు మాట మీదే సాంగ్స్ షూట్ కోసం ఫారిన్ ప్రయాణం కట్టేశారు పవన్. ప్రస్తుతం స్విట్జర్లాంట్ లో డైరెక్టర్ బాబీ లేకుండానే తన కొరియోగ్రఫీలోనే పాటల్ని తెరకెక్కిస్తున్నారు. మరోవైపు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బాబీ ఇక్కడే బిజీ బిజీగా ఉన్నారు. ఎలాగైనా ఏప్రిల్ 8 టార్గెట్ ను రీచ్ కావడమే సర్దార్ టీం లక్ష్యంగా కనిపిస్తోంది. శ్రీజ పెళ్లికి హాజరు కాలేకపోయినా, 31న జరగబోయే రిసెప్షన్ కు మాత్రం పవన్ హాజరవుతారని సమాచారం.