స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -777 లో.. రిషి దారిలో ఉన్న ఆ అమ్మాయి కార్ రిపేర్ చేస్తుంటాడు. అప్పుడు మీరు రిషి కదా అని ఆ అమ్మాయి అంటుంది. నేను మీకు తెలుసా అని రిషి అడుగగా.. అయ్యో రిషి.. నేను మీ ఇంటర్మీడియట్ ఫ్రెండ్ ఏంజిల్ ని అని తనని తాను పరిచయం చేసుకుంటుంది. గుర్తుపట్టావా అని ఏంజిల్ అడుగగా.. హా గుర్తుపట్టానని రిషి అంటాడు. ఆ తర్వాత మనమిద్దరం మళ్ళీ కలుద్దాం.. నేనొక అర్జెంట్ పనిమీద వెళ్తున్నానని చెప్పి తన విజిటింగ్ కార్డ్ రిషికి ఇచ్చి ఏంజిల్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది.
మరోవైపు రిషి ఇంట్లో లేడని మహేంద్ర బాధపడుతుంటాడు. అప్పుడే జగతి టీ తీసుకొని వచ్చి మహేంద్రకి ఇస్తుండగా.. వద్దని విసిరిపారేస్తాడు. రిషిని పంపించేంత అవసరం ఏం వచ్చింది.. దాని వెనుక ఉన్న కారణమేంటో చెప్పమని జగతిని కోప్పడతాడు మహేంద్ర. అయినా సరే జగతి నిజం చెప్పకుండా.. తనని అర్థం చేసుకోమని జగతి చెప్తుంది. దాంతో మహేంద్ర అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరోవైపు వసుధార వాళ్ళ అమ్మకి గుండెపోటు రావడంతో హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు. దాంతో ఆపరేషన్ థియేటర్ బయట వసుధార, వాళ్ళ నాన్న కృష్ణమూర్తి బాధపడుతుంటారు. "ఈ రోజు రిషి సర్ బర్త్ డే. మహేంద్ర సర్ కి రిషి అంటే ప్రాణం.. మేమిద్దరం కలిసి రిషి సర్ ని దూరం చేసాం" అని వసుధార తనలో తాను అనుకుంటుంది. "నాపై మోసం చేశాడనే ముద్ర ఎందుకు వేసారు.. దాని వెనుక ఎంత పెద్ద కారణం ఉన్నా నాకొక మాట చెప్పొచ్చు కదా.. ఇంకెప్పుడు జగతి, వసుధారలని నమ్మకూడదని రిషి ఆలోచిస్తాడు.
మరుసటి రోజు ఉదయం కాలేజీకి రెడీ అయి వెళ్తున్న జగతిని దేవయాని, శైలేంద్ర ఆపుతారు. ఇంకెందుకు కాలేజీకి వెళ్తున్నావ్? సీబీఎస్టీ కాలేజీ ఎండీ పదవిని శైలేంద్రకి ఇచ్చేసి ఇంట్లో ఉండమని దేవయాని అనగా.. మీ మాటలకి నేను లొంగను.. రిషి ప్రాణాల కోసం అలా చేసాను.. ఇప్పుడు నన్ను కాలేజీకి దూరం చేయడం ఎవరి తరం కాదు.. ఏదో ఒక రోజు రిషికి నిజం తెలుస్తుంది. అప్పుడు రిషి మళ్ళీ ఎండీ సీట్ లో కూర్చుంటాడు. మీ అంతు చూస్తాడు. మీకు నా గురించి తెలియదని శైలేంద్రతో జగతి అంటుంది. ఆ తర్వాత మహేంద్రకి ఒక కాల్ రావడంతో మాట్లాడి హడావుడిగా వెళ్తుంటాడు. అప్పుడే జగతి ఎక్కడికి నేను కూడా వస్తానని అనగా.. రిషి వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసాడు. రిషి కన్పించాడంట.. నేను వెళ్ళి రిషిని బ్రతిమాలి తీసుకొస్తాను.. మీరెవరు రావొద్దని చెప్పి మహేంద్ర అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.