స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -778 లో... శైలేంద్ర కొంతమంది రౌడీలకి ఫోన్ చేసి రిషిని ప్రాణలతో ఉంచొద్దని చెప్తాడు. ఆ రౌడీలు ఈ సారి మిస్ చెయ్యమని చెప్తారు.. మీరు పని పూర్తి చేసాక వచ్చి ఎంత డబ్బు కావాలో అంత తీసుకువెళ్ళండని ఆ రౌడీలతో శైలేంద్ర అంటాడు.
మరొకవైపు జగతి రిషిని తలుచుకుంటూ బాధపడుతుంది. ఒకవైపు రిషి, వసుధార అన్న మాటలు మరొకవైపు మహేంద్ర అన్న మాటలు ఇలా అన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది. జగతిని అందరూ దూరం పెట్టడంతో తను ఎమోషనల్ అవుతుంది. మరొకవైపు రిషి నడిచి వెళ్తుంటే కొంతమంది రౌడీలు వచ్చి కత్తితో పొడిచి వెళ్ళిపోతారు. రిషి ఒక్కసారిగా కిందపడిపోతాడు. మరొకవైపు రిషి ఫోటో దగ్గరికి జగతి వెళ్తుంది. అప్పుడే రిషి ఫోటో కిందపడడంతో నా కొడుకు ఏమైనా ఆపదలో ఉన్నాడా? నా కొడుకుకి ఏం కావద్దని జగతి ఏడుస్తుంది. ఆ తర్వాత రౌడీలు శైలేంద్రకి ఫోన్ చేసి పని పూర్తి అయిందని చెప్పడంతో.. వచ్చి డబ్బు తీసుకెళ్లండని ఆ రౌడీలకి శైలేంద్ర చెప్తాడు. ఆ తర్వాత రిషి దగ్గరకు మహేంద్ర వరకు వస్తాడు. కానీ రిషిని మహేంద్ర చూడకముందే అక్కడున్న వాళ్ళు రిషిని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. మరొకవైపు వసుధార తల్లి సుమిత్ర ఉన్న హాస్పటల్ కే రిషిని తీసుకెళ్తారు. వసుధార టాబ్లెట్స్ తీసుకొని వెళ్తుంటే.. రిషి బ్రేస్ లైట్ చూసి రిషి సర్ అని వెళ్ళేలోపే నర్సు వచ్చి.. వసుధార.. మీ అమ్మగారు చనిపోయారని చెప్తుంది. వసుధార ఏడుస్తూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది.
కొన్ని సంవత్సరాల తర్వాత రిషిని కాలేజీ నుండి పంపించినందుకు మహేంద్ర జగతితో ఇంకా మాట్లాడకుండా ఉంటాడు. మరొకవైపు వసుధార తల్లి చనిపోవడంతో తండ్రి చక్రపాణి వసుధారకి అండగా ఉంటాడు. దేవయాని, శైలేంద్రలు కాలేజీ ఎలా దక్కించుకోవాలో అని ఇంకా ప్రయత్నస్తునే ఉంటారు. వసుధార తిరిగి రిషి ప్రేమని పొందుతుందా? అసలు రిషి ప్రాణాలాతో ఉన్నాడా? ఇలాంటి ప్రశ్నలతో కథని ముందుకు తీసుకెళ్లారు డైరెక్టర్. కాగా మహేంద్రని తనతో మాట్లాడమని జగతి బ్రతిమిలాడుకుంటుంది. అయితే అ ఇన్ని ట్విస్ట్ లతో సాగుతున్న ఈ కథ.. ఏ మలుపు తిరగనుందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.