![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -712 లో.... జ్యోత్స్న, దీప, కార్తీక్ కలిసి ఆఫీస్ లో భోజనం చేస్తుంటారు. జ్యోత్స్న స్పూన్ కింద పడిపోతే కార్తీక్ స్పూన్ తీసుకొని జ్యోత్స్న తింటుంటే ఆగవే అని దీప అంటుంది. ఏమైంది అని కార్తీక్ అడుగుతాడు. అప్పుడే సూరజ్ వస్తాడు. అది నీ స్పూన్ తీసుకుందని దీప అంటుంది. నా బావ నా ఇష్టం అని జ్యోత్స్న అనగానే కార్తీక్ ఇప్పుడు నా భర్త అని దీప అంటుంది. పుట్టకముందే బావ నా భర్త అయ్యాడు. ఇప్పుడు అంటే ఇలా కానీ కాలేజీ డేస్ ఒకే ఐస్ క్రీమ్ ఇద్దరం తిన్నామని జ్యోత్స్న చెప్తుంది. అది చిన్నప్పుడు.. ఇప్పుడు కాదని దీప కోప్పడుతుంది.
నీకు ఇదివరకే చెప్పాను బావని ఎలాగైనా పెళ్లి చేసుకుంటానని జ్యోత్స్న అనగానే దీప కోప్పడుతుంది. వదిలేయ్ దీప అని కార్తీక్ అంటాడు. రా బ్రో అని సూరజ్ ని పిలుస్తాడు. సూరజ్ అదంతా వింటాడు. సూరజ్ రాగానే జ్యోత్స్న వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సూరజ్ ఇంటికి వెళ్ళడానికి రెడీగా ఉంటాడు. నీకోసం ఎవరు రారు.. మొహమాటం ఎందుకు.. ఇద్దరం వెళ్ళేది ఇంటికే అని జ్యోత్స్నతో సూరజ్ అనగానే జ్యోత్స్న స్కూటీ ఎక్కుతుంది. ఆ తర్వాత కొద్దిదూరం వెళ్ళాక స్కూటీ ఆపి జ్యోత్స్నని దిగమంటాడు. పెళ్ళైన మగాడిపై ఇష్టమేంటి అసహ్యంగా అని కోప్పడుతాడు. నీకేంట్రా అని జ్యోత్స్న అనగానే నేను నీ మొగుడిని అని సూరజ్ అంటాడు. నువ్వు ఎలా మొగుడివి అవుతావని జ్యోత్స్న అంటుంది. మరి కార్తీక్ ఎలా నీకు మొగుడు అవుతాడు. తాళి కడితేనే మొగుడు అవుతాడు. ఊహించుకుంటే కాదు నీ ఊహ కరెక్ట్ అయితే నువ్వు నా పెళ్ళామని నేను ఉహించుకుంటున్నా.. ఇది కరెక్ట్ అవుతుందని జ్యోత్స్నతో సూరజ్ అంటాడు. ఇక ఇద్దరికి గొడవ జరుగుతుంది. మరొకవైపు శౌర్య ప్రోగ్రెస్ కార్డ్ చూసి మార్కులు తక్కువ వచ్చాయని కార్తీక్ అంటాడు. నాకు ఇంటి దగ్గర చెప్పేవారు ఎవరు అని శౌర్య అనగానే దీనికి సొల్యూషన్ ఆలోచించాలని కార్తీక్ అంటాడు.
ఆ తర్వాత జ్యోత్స్నకి సూరజ్ వాయిస్ మెసేజ్ పంపుతాడు. ఇకనైనా మారు అని అదంతా పారిజాతం వింటుంది. వాడితో కూడా నీతులు చెప్పించుకోవాల్సి వస్తుందని అంటుంది. వాడు నాకు సైటు కొడుతున్నాడు.. అందుకే బావ అంటే నాకు ఇష్టమని తెలిసి అలా బెహేవ్ చేస్తున్నాడని జ్యోత్స్న అంటుంది. ఈ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ నువ్వు పెళ్లి చేసుకోవడం.. చేసుకోవే అని పారిజాతం అంటుంది. మరొకవైపు శౌర్యా స్కూల్ నుంచి ఆఫీస్ కి వస్తుంది. అక్కడే తనకి ట్యూషన్ అని కార్తీక్ చెప్తాడు. అది బెస్ట్ దానికి అని కాంచన అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |