![]() |
![]() |
.webp)
కుక్కు విత్ జాతిరత్నాలు షో నెక్స్ట్ వీక్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతోందన్న విషయం తెలుస్తోంది. ఆ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. "మిమ్మల్ని నవ్వించడమే ప్రొఫెషన్ గా పెట్టుకున్న మా జాతిరత్నాలు ఈవారం అద్దిరిపోయే ప్రొఫెషనల్ గెటప్స్ లో మీ ముందుకు రాబోతున్నారు. అంతే ప్రొఫెషనల్ గా మా కుక్స్ కూడా వంటలు వండబోతున్నారు. ఈవారం మేం జరుపుకుంటున్న థీమ్ ప్రొఫెషన్ మేం అందించే ఎంటర్టైన్మెంట్ సెన్సేషన్" అని చెప్పాడు ప్రదీప్. కొత్తగా లాస్ట్ వీక్ జాయిన్ ఐన పూర్ణవిని అసలు ఫస్ట్ వీక్ రెస్పాన్స్ ఎలా ఉంది అని అడిగాడు. "కొంచెం తక్కువ చెయ్ అంటున్నారు " అంది. "ఏంటి వంట మిగతాడా"అని కౌంటర్ వేసాడు ప్రదీప్. తర్వాత అవినాష్ కాకీ యూనిఫామ్ లో వచ్చి "నేనెవరో తెలుసా లాంగ్వేజ్ " అన్నాడు. ఇంతలో అలీ "అరేయ్ ఈ పంచ్ ఎవరిదీ " అన్నారు. "ఈ పంచ్ నాదే" అని అవినాష్ రివర్స్ కౌంటర్ వేసాడు.
తర్వాత నూకరాజు అరుంధతి మూవీలో అన్వర్ గెటప్ లో సాయాజీ షిండేలా వచ్చాడు. "దేవుడు ఉన్నాడన్నది ఎంత నిజం దెయ్యం ఉన్నాదన్నది అంతే నిజం " అన్నాడు. ఇంతలో రోహిణి వచ్చి "ఏది చూపించు " అంది. "మణికంఠ వచ్చినప్పుడు కామెడీ చూపించు... ప్రదీప్ గారి పెళ్లి డేట్ చూపించు...ఏది నువ్వు సన్నబడి చూపించు" అంటూ రకరకాల ప్రశ్నలు అడిగి రోహిణి నోరు మూయించాడు. తర్వాత యాదమ్మ రాజు దెయ్యం గెటప్ లో వచ్చు తనూజ గౌడాని, శ్రీదేవిని భయపెట్టాడు. తర్వాత మణికంఠ శంకర్ దాదా గెటప్ లో వచ్చాడు. శ్రీదేవి దగ్గరకు వెళ్లి "మేకమన్నా ప్రాబ్లమా అంది...కళ్ళల్లోకి చూస్తే తెలిసిపోతుంది క్లియర్ గా. మీకు ఆ డిప్రెషన్ పోవాలంటే మూడు పూటలా మణికంఠ కామెడీ వీడియోస్ చూడండి " అన్నాడు శ్రీదేవితో. "ఒకటే సారి పోతా నేను " అంది శ్రీదేవి.
తర్వాత జాతిరత్నాలు అంతా రకరకాల ఫోజుల్లో నిల్చుంటారు కుక్స్ అంతా రకరకాల ప్లేట్స్ బౌల్స్ వాళ్ళ చేతుల్లో పెట్టి బాలన్స్ చేయాలంటూ ప్రదీప్ చెప్పేసరికి కుక్స్ అంత జాతిరత్నాల చేతుల్ని పాత్రలతో నింపేశారు. ఇక యాదమ్మ రాజు పని ఏంటంటే జాతిరత్నాలను ఇబ్బంది పెట్టడం. వెనక నుంచి పెద్ద బూర తీసుకొచ్చి వాళ్ళ చెవుల దగ్గర పెట్టి ఊదుతూ వాళ్ళను కాన్సంట్రేషన్ తప్పించడానికి ట్రై చేసాడు కానీ ఎవరూ పెద్దగా రెస్పాండ్ కాలేదు. ఇలా నెక్స్ట్ వీక్ కుకు విత్ జాతిరత్నాలు ఎపిసోడ్ రాబోతోంది.
![]() |
![]() |