సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్, యుట్యూబర్, సింగర్ బెజవాడ బేబక్క గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె వాడే పడికట్టు పదాలతో సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యింది. "బై పెండ్స్...గట్టిగా పాపాలు చేసేయండి. నాలుగు కాలాలు పాటు హాయిగా ఉంటారు" లాంటి రీల్స్ తో ఆమె బాగా హైలైట్ అయ్యింది. ఇక ఈ బిగ్ బాస్ సీజన్ 8 కి వెళ్లి వచ్చింది. ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ ఐపోయింది. ఐతే రీసెంట్ గా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అనౌన్స్ చేసే రోజున విజయ్ సేతుపతిని తెలుగు బిగ్ బాస్ కి తీసుకొచ్చారు హోస్ట్ నాగార్జున. అలాగే ఎలిమినేట్ ఐన, ఎక్స్ - కంటెస్టెంట్స్ అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టారు. అందులో ముందుగా ముక్కు అవినాష్ చెయ్యెత్తి టాప్ 5 కంటెస్టెంట్ ని సర్ అని విజయ్ సేతుపతికి చెప్పాడు.
తర్వాత బెజవాడ బేబక్క "సర్ ఫస్ట్ వీక్ అవుట్ ఐపోయాను సర్.. మీకు మల్లె నాకు కూడా ఫుడ్ అంటే చాలా ఇష్టం సర్. మీ ఇంటర్వ్యూస్ లో మీరు చెప్తారు కదా నాకు ఫుడ్ అంటే ఇష్టం..గుడ్ ఫుడ్ హ్యాపీనెస్ ని ఇస్తుంది అని. నేను ఎక్కువ ఫుడ్ తినాలని ప్రజలంతా కోరుకుంటూ ఉంటారు సర్." అని చెప్పింది బేబక్క. ఇక విజయ్ సేతుపతి రియాక్ట్ అయ్యారు. "అలాగే మీరు వర్కౌట్ చేయాలి కూడా. ఎంత తింటారో అంత వర్కౌట్ చేయండి మొత్తం సరిపోతుంది" అని ఫన్నీ కౌంటర్ వేశారు. ఇక బేబక్క ఈ కన్వర్జేషన్ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసుకుని ఇలా రాసుకుంది. "బిగ్ బాస్ ఫైనల్ డే రోజున విజయ్ సేతుపతి గారితో మంచి సందేశాత్మకంగా సంభాషణ జరిగింది. మేము మంచి ఆహారం పట్ల నాకున్న ప్రేమ గురించి మాట్లాడుకున్నాము.. మంచి ఫుడ్ తింటూనే ఫిట్‌గా బాడీని ఎలా బ్యాలెన్స్ చేయాలో ఆయన చెప్పిన మాటలు నిజంగానే చాల ఇన్స్పిరేషన్ గా ఉన్నాయి. " పోస్ట్ పెట్టింది.