"వెండితెరైనా, బుల్లితెరైనా నేనే రాజు నేనే మంత్రి అంటున్నారు మన టాలీవుడ్ హల్క్..ఆయనకు రారెవ్వరూ సాటి..ఆయనే మన రానా దగ్గుబాటి" అనే ఇంట్రోతో రానాని సుమ అడ్డా షోకి ఇన్వైట్ చేసింది. "రానా ఈ రోజు అలా నడుచుకుంటూ వస్తుంటే ఆ వైబ్ తో సెట్ అంతా మారిపోయింది" అంటూ సుమ హల్క్ ని పొగిడేసింది. ఈ షోకి "పరేషాన్" టీమ్ తిరువీర్, పావని, డైరెక్ట్ రూపక్ రోనాల్డ్సన్, ప్రొడ్యూసర్ రానా అంతా వచ్చారు. తర్వాత గెస్ ది ఆన్సర్ గేమ్ షోలో "ఎవరితో స్నేహం ఎక్కువ కాలం ఉంటుంది" అని అడిగిన ప్రశ్నకు "చిన్ననాటి స్నేహితులతో...రెండు లక్షలు ఈ ప్రశ్న మీద పెడతాం" అని చెప్పారు తిరువీర్, పావని. "వీళ్లది రైట్ ఆన్సర్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా" అని రానాని సుమ అడగడంతో "రాంగ్ అని 500 రూపాయలు పెడుతున్నా" అన్నాడు..దాంతో సుమ "ఇప్పటివరకు ఈ షోలో 500 ఎవరూ ఇవ్వలేదు..చాలా నామోషీగా పట్టుకోవడానికి కూడా చాలా తేలిగ్గా ఉంది" అనేసరికి "ఐతే కింద పెట్టండి" అన్నాడు రానా.
"ఇంకా కొంచెం ఎక్కువ డబ్బు కాయండి అని సుమ అడగడంతో ..ఐతే 500 కి చేంజ్ ఉందా " అని ఫన్నీగా అడిగాడు. "ఇండస్ట్రీ ఫ్రెండ్స్ లో పార్టీ అనగానే పరిగెత్తుకుని వచ్చేది ఎవరు..." అని సుమ అడిగేసరికి "గ్రూపే ఉంది" అన్నారు రానా. " ఆ గ్రూప్ కి ముఠా మేస్త్రి ఎవరు" అని రివర్స్ లో అడిగేసరికి " నేనే" అన్నారు రానా. "మల్టీ స్టారర్ మూవీస్ లో ఏ హీరో అనగానే వావ్ అని మీకు అనిపించింది" అని సుమ అడిగేసరికి "బాహుబలి ప్రత్యేకంగా అనిపించింది అలాగే భీమ్లా నాయక్ మాత్రం వావ్ అనిపించింది" అని చెప్పారు రానా. "ఎనీ సెంటర్ సింగల్ హ్యాండ్ గణేష్" అని వెంకటేష్ డైలాగ్ ఒక ప్రోమో లాస్ట్ లో చెప్పి అందరినీ ఎంటర్టైన్ చేశారు. ఇక ఈ షోలో రానా ఇంకా ఎలాంటి విషయాలు చెప్పారు...ఈ షోలో ఆడించిన గేమ్స్ లో ఎవరు విన్ అయ్యారో తెలియాలి అంటే కొన్ని డేస్ వెయిట్ చేయాలి.