'సుమ అడ్డా' షో ఆలీతో సరదాగా షోకి పోలినట్టుగా ఉంటుంది. అందులో ఆలీ ఎలా ఐతే రకరకాల ప్రశ్నలు వేస్తారో సుమ అడ్డాలో కూడా ఆ సెగ్మెంట్ సేమ్ గా ఉంటుంది. ఇక ఈ వారం ఈ షోకి వచ్చిన హంట్ మూవీ టీమ్ నుంచి సుధీర్ బాబుని కొన్ని ఇంటరెస్టింగ్ క్వశ్చన్స్ అడిగింది సుమ. "మీరూ జూనియర్ ఎన్టీఆర్ కలిసి బాడ్మింటన్ ఆడేవారట కదా" అని అడిగేసరికి "ఆయన నాకు జూనియర్.. నేను సీరియస్ గా నేషనల్స్ కి ఆడాను.. ఎన్టీఆర్ మాత్రం డబుల్స్ చాలా బాగా ఆడతాడు.. ఆయన ఆటిట్యూడ్ గ్రౌండ్ లో బాడ్మింటన్ ప్లేయర్ లా ఉండదు.. కబడ్డీ ప్లేయర్ లా ఉంటుంది. డబుల్స్ ఆడేటప్పుడు ఆయన తొడ కొట్టి మరీ ఆడతారు. అలా ఉండే ఆయన ఎనర్జీ ఇప్పుడు స్క్రీన్ మీదా అలాగే ఉంది" అన్నాడు సుధీర్ బాబు.
"సుధీర్ బాబు అంటే ఫిట్నెస్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ అని ఇండస్ట్రీలో పేరు కదా మరి కొన్ని టిప్స్ చెప్పండి" అని సుమ అడిగేసరికి బ్యాక్ గ్రౌండ్ స్క్రీన్ మీద భరత్, సుధీర్ సిక్స్ ప్యాక్ బాడీ పిక్స్ వేశారు. ఒకవేళ మీ ముందర డిజర్ట్ ఉంటే ఏం చేస్తారు అని అడిగేసరికి "తినేస్తాం..ఎక్సరసైజ్ చేయకుండా తింటే ప్రాబ్లమ్ కానీ తినేసి ఎక్సరసైజ్ చేస్తూ ఉంటే ఎలాంటి సమస్య రాదు" అని చెప్పారు. "ఫిట్ గా ఉండడం అంటే ఇది.. తాగేసి ఫిట్ గా ఉండడం కాదు" అని చెప్పింది. "అవును మీకు పిఎస్ బి..నాగేంద్ర అనే వ్యక్తితో దగ్గర సంబంధం ఉందట" అని అడిగింది. "నేను బాడ్మింటన్ ఆడేటప్పుడు దాన్ని కెరీర్ గా తీసుకోవడం అనే దాన్ని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. నేను బెంగళూరు లో చదువుకుండేవాడిని...అక్కడ నుంచి నేను బాడ్మింటన్ నేషనల్స్ కి వెళ్ళేటప్పుడు పేపర్ లో వచ్చేది సుధీర్ బాబు వన్ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ అని ...అలా ఆ పేరు రాకుండా ఉండడం కోసం నా పేరును పిఎస్ బి.నాగేంద్రగా పేరు మార్చేసుకున్నా" అని చెప్పేసరికి "మారు పేరుతో తిరిగిన సుధీర్ బాబు" అని కామెడీ చేసింది సుమ.
మీరు ఎస్ఎంఎస్ మూవీ చేశారు కదా అలా ఒక ఎస్ఎంఎస్ పంపించి ప్రియా గారిని పడేశారట కదా అని సుమ అడిగేసరికి సుధీర్ సిగ్గు పడుతూ "పడేయలేదండి.. అలా ఆమెను ఎవరూ పడేయలేరు" అన్నాడు. మీకు మహేష్ బాబు అంతకు ముందే మీకు తెలుసా అని సుమ అడిగేసరికి "అంతమందు మాములుగా తెలుసు ఎలా అంటే మా ఇంటికి దగ్గరలో ఉండేవాళ్ళు. మహేష్ బాబు అమ్మమ్మ, మా అమ్మ ఫ్రెండ్స్.. అలా అందరం ఫామిలీ ఫ్రెండ్స్ లా ఉండేవాళ్ళం.. అంతే కాదు..ఇద్దరిలో సేమ్ క్వాలిటీస్ ఉన్నాయి..ఇద్దరినీ ఒక రూమ్ లో పడేస్తే..లోపల మేమున్నామని ఎవరికీ తెలీదు..."అని ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పారు సుధీర్ బాబు.