షాపింగ్ అంటేనే ఆడవాళ్ళకు ఫేవరేట్.. అలాంటిది ఆన్లైన్ షాపింగ్ అంటే ఇంక ఊరుకుంటారా.. కొత్త కొత్త ప్రొడక్ట్స్ కోసం మంచిగా, తక్కువ ధరలో దొరికే వాటి కోసం సెర్చ్ చేస్తూనే ఉంటారు. ఎందుకు ఈమధ్య ఆన్లైన్ షాపింగ్ ని ఆడవాళ్లు ఇష్టపడుతున్నారు అంటే రిటర్న్ పాలసీ కూడా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు బుల్లితెర నటి శ్రీవాణి కూడా ఆ కోవలోకి వచ్చి తమ కొత్త ఇంటికి కావాల్సిన సామాన్లను ఆన్లైన్ లో తెప్పించుకుంది. అవి తాను ఎప్పుడూ వాడనివి తన ఫ్రెండ్స్ దగ్గర కూడా చూడనివి తెప్పించుకుంది. ఇప్పుడు వాటిని కొత్త ఇంటికి షిఫ్ట్ చేసాక వాటిని ఓపెన్ చేసి తన ఫాన్స్ కోసం ఒక వీడియో చేసి "మేడం అంతే" యూట్యూబ్ లో అప్ డేట్ చేసింది.
శ్రీవాణి వాళ్ళది వైట్ కలర్ కిచెన్ కాబట్టి దానికి మ్యాచ్ అయ్యేలా వస్తువులు అన్నీ కూడా వైట్ కలర్ లొవే తీసుకుంది. కాఫీ, టీ, షుగర్ వేసుకునే జార్స్, గెస్ట్స్ వస్తే సర్వ్ చేయడానికి కలర్ ఫుల్ ప్లేట్, అలాగే తన హస్బెండ్ ఉదయాన్నే ఆమ్లెట్లు తింటాడు కాబట్టి ఒక్కో ఆమ్లెట్ వేయడానికి టైం పడుతుందని ఒకేసారి నాలుగు ఆమ్లెట్లు వేసే పాన్ తీసుకుంది. ఇంతలో శ్రీవాణి హస్బెండ్ విక్రమ్ వచ్చి తనకు అస్సలు ఆన్లైన్ షాపింగ్ అంటే ఇష్టం ఉండదు అని ఆ వస్తువుల్ని చూస్తే తనకు కోపం వస్తుందని పక్క గదిలో కూర్చున్నట్లు చెప్పాడు. కానీ ఆన్లైన్ వస్తువులు అన్ని బాగున్నట్టే కనిపిస్తున్నాయి కానీ కొన్ని మాత్రం అస్సలు బాలేదు..ఆన్లైన్ షాపింగ్ అంటే ఎందుకు ఇష్టం ఉండదు అంటే తమవి ఓవర్ సైజు బాడీస్ కాబట్టి ఏవి కొనుక్కున్న సైజెస్ సెట్ కావని చెప్పాడు.
ఇక గుడ్లు పెట్టుకోవడానికి ఒక వెరైటీ బ్లాక్ కలర్ గిన్నె లాంటి దాని మీద పింగాణీ కోడిని తీసుకుని ఇప్పుడు చెప్పండి హెన్ బాస్కెట్ ఎలా ఉంది అనేసరికి "అందరూ ఆన్లైన్ షాపింగ్ చేయండి ఆరోగ్యానికి బాగుంటుంది" అన్నాడు విక్రమ్ ఫన్నీగా.."నగలనే కాదు కిచెన్ సామాన్లు చూసినా చాలు ఆడవాళ్లు చంద్రముఖిలా తయారైపోతారు" అంది శ్రీవాణి.. అంతే కాదు కలర్ ఫుల్ కత్తుల్ని కూడా కిచెన్ కోసం ఆర్డర్ చేసి తెప్పించుకుంది. అలాగే స్టోన్స్ తో చేసిన స్పూన్స్ బాగా నచ్చాయంటూ చెప్పింది. చపాతి బాక్స్, వాటర్ జార్, కలర్ ఫుల్ చిన్న స్పూన్స్, అలాగే పానీపూరి ప్లేట్స్, డ్రింక్స్ తాగడానికి గ్లాసెస్, ఐస్ క్యూబ్స్ మౌల్డ్స్ ఇలా తన కొత్త ఇంట్లోకి రకరకాల సామాను కొనుక్కుని ఫుల్ ఎంజాయ్ చేసింది శ్రీవాణి.