![]() |
![]() |

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' షోలో ప్రభాస్ సందడి చేయనున్నాడు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ కూడా జరిగింది. ఈ షోలో ప్రభాస్ ఒక శుభవార్తని పంచుకున్నట్లు తెలుస్తోంది.
'అన్ స్టాపబుల్'లో ప్రభాస్ పాల్గొన్న ఎపిసోడ్ లో కొన్ని సర్ ప్రైజ్ లు ఉన్నాయి. ప్రభాస్ తో పాటు ఈ ఎపిసోడ్ లో ఆయన స్నేహితుడు, హీరో గోపీచంద్ కూడా పాల్గొన్నాడు. అలాగే రామ్ చరణ్ కూడా వీడియో కాల్ ద్వారా సర్ ప్రైజ్ ఎంట్రీ ఇస్తాడట. అంతేకాదు "ప్రభాస్ ఒక గుడ్ న్యూస్ చెప్తాడు" అని చరణ్ అనడంతో.. ఆ న్యూస్ ఏంటని బాలయ్య ప్రభాస్ ని అడిగి తెలుసుకుంటాడట.
'అన్ స్టాపబుల్'లో ప్రభాస్ చెప్పే గుడ్ న్యూస్ ఏంటనే ఆసక్తి అందరిలో నెలకొంది. మరోవైపు ప్రభాస్ కి సంబంధించిన గుడ్ న్యూస్ అంటే పెళ్లి గురించే అయ్యుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభాస్ పెళ్లి కోసం ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పైగా ఆయన ఇటీవల హీరోయిన్ కృతి సనన్ తో ప్రేమలో ఉన్నట్లు కూడా వార్తలొచ్చాయి. కానీ ఆ వార్తలను కృతి ఇప్పటికే ఖండించింది. మరి ప్రభాస్ ఈ షోలో పెళ్లి గురించి ఏదైనా గుడ్ న్యూస్ చెప్తాడేమో చూడాలి.
![]() |
![]() |