బిగ్ బాస్ సీజన్-8 లో ఎనిమిదో వారం టాస్క్ ల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే హౌస్ లో రెండు టీమ్ లుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ టాస్క్ లు అన్నీ కూడా మెగా చీఫ్ కంటెండర్ గురించి జరుగుతుండగా.. ఇరు క్లాన్స్ లో.. ఓడిపోయిన క్లాన్ నుండి ఒక హౌస్ మేట్ కంటెండర్ షిప్ రేస్ నుండి తప్పుకుంటే, గెలిచిన టీమ్ నుండి ఒకరు మెగా ఛీఫ్ కోసం కంటెండర్ గా నిలుస్తారు.
ఈ వారం బీబీ రాజ్యం టాస్క్ లో ఇప్పటికే హౌస్ లో మూడు టాస్క్ లు జరిగాయి. అందులో మొదటిది రాయల్ క్లాన్ గెలవగా..ఆ తర్వాత నిన్న జరిగిన రెండు టాస్క్ లు కూడా ఓజి టీమ్ గెలిచింది. మొదటి టాస్క్ వాటర్ కి సంబంధించినది అయితే రెండవ టాస్క్ లో.. బజర్ మోగగానే ధాన్యం బస్తాలు వస్తుంటాయి. ముందుగా ఎవరైతే తమకి కేటాయించిన బండిలో వాటిని తీసుకొచ్చి పెడతారో వాళ్ళు టాస్క్ విన్ అవుతారు. అందులో భాగంగా రాయల్ క్లాన్ నుండి మెహబూబ్, గౌతమ్ లు రాగా ఓజీ క్లాన్ నుండి నిఖిల్, పృథ్వీలు వచ్చారు. అయితే టాస్క్ మొదటి నుండే ఫుల్ ఆన్ ఫైర్ మీదున్నారు నిఖిల్, పృథ్వీ. వాళ్ళిద్దరికి తోడుగా బయట గైడెన్స్ ఇస్తూ నబీల్ రెచ్చిపోయారు. టాస్క్ మొత్తం ఫిజికల్ అవుతారు. నిఖిల్ పృథ్వీలు అసలు ముందు ఎవరు ఉన్నారన్న విషయం కూడా పట్టించుకోకుండా అప్పోజిట్ వాళ్ళని చిత్తు చిత్తు చేసారు.
అయితే రెండవ బజర్ కి రాయల్స్ నుండి తేజ, అవినాష్ రాగా ఓజీ నుండి మాత్రం నిఖిల్ , పృథ్వీలు కంటిన్యూ అయ్యారు. అయితే వాళ్ళని కూడా చాకచక్యంతో ఫోల్డ్ చేసి అన్ని బస్తాలు.. ఓజీ వాళ్లే వేశారు. రాయల్స్ ఒక్కటంటే ఒక్క ధాన్యం బస్తా కూడా సేకరించలేదు. హౌస్ మొత్తం కూడా పృథ్వీ, నిఖిల్ అట తీరుని చూసి భయపడ్డారు. ఒకవేళ వాళ్ళు టాస్క్ లో ఉంటే మేమ్ ఇక ఆడలేమని రాయల్ క్లాన్ లో ఉన్న గర్ల్స్ అనుకుంటున్నారు. ఇక ఓజీ క్లాన్ వాళ్ళు రాజ్యంలోని ఒక ప్లేస్ లో జెండా పాతేస్తారు. మరొక టాస్క్ అయిన వైరస్ బాల్స్ ఇరు క్లాన్స్ తమకి కేటాయించిన దాంట్లో ఎక్కువ బాల్స్ పడకుండా చూసుకోవాలి. ఇందులో కూడా ఓజీ విన్ అయి తమ జెండాని బీబీ రాజ్యంలో పెట్టారు. నిన్నటి ఎపిసోడ్ లో రెండు టాస్క్ లు కాగా వాటిల్లో రెండు ఓజీ మాత్రమే గెలిచింది.