బిగ్ బాస్ సీజన్ 7 లో కామన్ మ్యాన్ క్యాటిగరీలో వెళ్లిన పల్లవి ప్రశాంత్ ఎప్పుడూ సెన్సేషన్ సృష్టిస్తూనే ఉంటాడు. సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ తో వైరల్ అవుతూ ఉంటాడు. రైతు బిడ్డ ట్యాగ్ తో బిగ్ బాస్ కి వచ్చి వేషాలేస్తున్నాడని కొందరు, రైతు పని చేసినంత మాత్రాన స్టైల్ గా ఉండకూడదా అంటూ ఇంకొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేసుకుంటూ పల్లవి ప్రశాంత్ ని తెగ ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇక అతను కూడా తగ్గేదేలే అన్నట్టు అల్లు అర్జున్ డైలాగ్ ని రెట్టించి చెప్తూ ఉంటాడు. " మల్లొచ్చినా" అంటే అంటూనే ఉంటాడు. ఐతే బిగ్ బాస్ టైటిల్ గెలిస్తే వచ్చిన ప్రైజ్‌మనీతో రైతులకు సాయం చేస్తానని బిగ్ బాస్ స్టేజి మీద ప్రకటించాడు కూడా.
ఐతే ఆ మాటను పల్లవి ప్రశాంత్ నిలబెట్టుకోలేదని కొందరు...ప్రైజ్ మనీ వస్తే ఇవ్వాలా అంటూ ఇంకొందరు డిబేట్లు కూడా పెట్టుకుంటూ ఉన్నారు. ఇన్ని విమర్శలు మధ్య పల్లవి ప్రశాంత్ ఒక పేద కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సాయం చేశాడు. ఐతే ఈ సాయంలో భోలే షావళి, నటుడు శివాజితో కలిసి మరీ ఈ సాయాన్ని అందించాడు. ఇక ఇప్పుడు పల్లవి ప్రశాంతి తన డ్రెస్సింగ్ స్టైల్ మొత్తం మార్చేసి ఒక హీరో లెక్క రాయల్ ఫామిలీలోని వ్యక్తి లెక్క మారిపోయాడు. ఇప్పుడు ఆ పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. దాంతో నెటిజన్స్ ఒక రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. "మోడరన్ రైతు బిడ్డ, రైతు బిడ్డ అన్న మాట మర్చిపోయినట్టున్నాడు, రైతు బిడ్డ ఇలా ఐపోయాడు ఏమిటి ? నీయవ్వారం చూస్తుంటే ఇక పొలం పనులు చేయవనుకుంటాగా ఇగ...రైతు బిడ్డ రాయల్ బిడ్డ అయ్యాడు బాబో..." అంటూ ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ చేస్తున్నారు.