యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేసి యాంకర్ గా అలాగే నటుడిగా మారిన నిఖిల్ విజయేంద్ర సింహ గురించి సోషల్ మీడియాలో చాలా మందికి తెలుసు...ఆయన క్రియేట్ చేసే కంటెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పాపులర్ డిజిటల్ కంటెంట్ క్రియేటర్ గా అవార్డు కూడా అందుకున్నాడు. "నిఖిల్ తో నాటకాలు" పేరుతో సెలబ్రిటీస్ ని ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాడు. సోషల్ మీడియా ఇన్ఫ్లుఎన్సర్ గా కూడా ఆయనకు ఎంతో మంది ఫాన్స్ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో డైలీ అప్ డేట్స్ పెడుతూ ఉంటాడు. అలాంటి నిఖిల్ ఒక ప్రోగ్రాం కోసం న్యూయార్క్ వెళ్ళాడు.
అలా అక్కడ ఫుడ్ గురించి, బెస్ట్ ప్లేసెస్ గురించి వీడియోస్ చేస్తూ పోస్ట్ చేస్తున్నాడు. ఐతే ఇప్పుడు ఒక ప్లేస్ కి వెళ్ళాడు..అక్కడ వీడియో చేసి దాన్ని అప్ లోడ్ చేసి "ఈ ప్లేస్ కి వచ్చి కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను" అని టాగ్ లైన్ పెట్టుకున్నాడు. ఐతే విషయం ఏమిటి అంటే ఆయనకు థామస్ ఆల్వా ఎడిసన్ అనే ఆయన ఎవరో తెలీదట. తెలియకుండానే ఒక వీడియో చేసాడు. అసలు థామస్ ఆల్వా ఎడిసన్ అనే ఆయన బల్బ్ ని కనిపెట్టారనే విషయం చిన్నపిల్లాడిని అడిగినా చెప్తాడు. కానీ నిఖిల్ కి మాత్రం తెలీదట. "థామస్ ఎడిసన్ పేరేంటి వింతగా ఉందని ఆయన గురించి తెలుసుకోవాలి అని అడిగితే వాళ్ళు చెప్పారు...థామస్ ఎడిసన్ బల్బ్ కనిపెట్టారు కదా .. ఆయన గుర్తుగా ఇక్కడ ఒక టవర్ ని ఏర్పాటు చేశారు.. అదే ఈ ఎడిసన్ టవర్...ఈ పక్కన ఒక రూమ్ కనిపిస్తోంది కదా..అందులోనే ఆయన ఎక్సపెరిమెంట్స్ కి యూజ్ చేసిన ఎక్విప్మెంట్ అక్కడ కనిపిస్తుంది" అని చెప్పాడు...ఈ వీడియో చూసిన నెటిజన్స్ మాత్రం "ఎడిసన్ అనే పేరు ఇప్పటివరకు వినలేదా..ఇంతకు ఎక్కడి వరకు చదువుకున్నావ్ బాబు...ఇదొకటి ఉందని కూడా తెలీదా" అని కామెంట్స్ చేస్తున్నారు. నిఖిల్ "హలో వరల్డ్" అనే వెబ్ సిరీస్ లో నటించాడు. కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా కనిపించాడు.