నిఖిల్ విజయేంద్ర సింహ నార్త్ అమెరికా సొసైటీ సంబరాలను హోస్ట్ చేయడం కోసం యూఎస్ కి వెళ్ళాడు. అలా అక్కడ అప్ డేట్స్ ని రెగ్యులర్ గా తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉన్నాడు. రీసెంట్ గా నయాగరా ఫాల్స్ కి వెళ్లి అక్కడ వీడియో కూడా చేసి పెట్టాడు. అలాగే అక్కడ సన్ సెట్ ఎలా అవుతుందో చూపిస్తూ, అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది అనే విషయాల మీద కూడా వీడియోస్ అప్ లోడ్ చేస్తూ ఉన్నాడు. ఐతే ఇప్పుడు వెరైటీగా ఒక ఫారెనర్ దగ్గరకు వెళ్లి ఒక రీల్ చేసాడు. "నేను మీకు కొంత మంది టాప్ హీరోస్ ని చూపిస్తాను. వాళ్ళు ఇండియాలో బాగా పాపులర్. వాళ్లకు మీరు 1-10లో ఎన్ని మార్క్స్ ఇవ్వాలనుకుంటే అన్ని ఇవ్వండి" అని చెప్పేసరికి ఆమె కూడా ఓకే అంది.
అలా నిఖిల్ తన ఆండ్రాయిడ్ లో ఫొటోస్ చూపిస్తూ ఉండగా ఆమె మార్క్స్ ఇచ్చింది. చూద్దాం ఎవరెవరికి ఎన్ని మార్క్స్ ఇచ్చిందో.."అల్లు అర్జున్ - 10 , ప్రభాస్ - 6 , మహేష్ బాబు - 8 , పవన్ కళ్యాణ్ - 7 , విజయ్ దేవరకొండ - 8 , నాగ సౌర్య - 10 "..ఇలా మార్క్స్ ఇచ్చింది ఈమె.
ఈ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసేసరికి నెటిజన్స్ కామెంట్స్ బాగా పెట్టారు.."తమ్ముడు..రాంచరణ్ ఎక్కడ.. మహేష్ బాబు ఫాన్స్ ఇక్కడ హర్ట్ అయ్యాము.. అల్లు అర్జున్ అంటే ఆమాత్రం ఉంటుంది. నాని, జూనియర్ ఎన్టీఆర్, అఖిల్ ఫొటోస్ ఎక్కడ" అంటూ అడుగుతున్నారు. అలాగే "ఈ వీడియో డిలీట్ చెయ్యి...నువ్వు హైదరాబాద్ రా బ్రో.. నువ్వు ఎవరితోనో రేటింగ్ వేయించడమేమిటి.. అన్ని నీ ఇష్టం వచ్చినట్టుగా చేయకు బ్రో" అంటూ హీరోస్ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు.