స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -171 లో.. మురారి డైరీ ఓపెన్ చేసి ఉండటంతో అది తీసి తను కృష్ణ పరిచయమయ్యాక ఎలా ఉండేవాడో చదువుతాడు. మరోవైపు కృష్ణ బాధపడుతూ కిందకి వస్తుంది. ఇంటి బయట వర్షం వస్తుండగా తడుస్తూ నిలబడి తనలో తానే మాట్లాడుకుంటూ ఏడుస్తుంటుంది.
నాలో ప్రేమ పుట్టి చనిపోయింది. నా చిన్నప్పుడు అమ్మని ప్రేమించా తను చనిపోయింది. నాన్నని ప్రేమించా తను నన్ను వదిలివెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏసీపీ సర్ ని ప్రేమించా కానీ తన మనసులో మరో అమ్మాయి ఉందని అనుకుంటూ కృష్ణ తనలో తానే కుమిలిపోతుంటుంది. అంతలోనే మురారి వస్తాడు. కృష్ణ వానలో తడుస్తుంటే చూసి తన దగ్గరికి వస్తాడు. పదా లోపలికి వెళదామని మురారి అనగా.. నేను రాను ఏసీపీ సర్.. ఈ వర్షంలో నాలోని గుండెమంట చల్లారనివ్వండి.. నా కన్నీళ్ళు ఈ వాననీటిలో కొట్టుకుపోనీవ్వండి. మీరు పూర్తిగా తడిచిపోతారు. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోండని కృష్ణ అనగానే.. ఏం మాట్లాడుతున్నావ్ నిన్ను ఒంటరిగా వదిలి ఎలా వెళ్ళగలని అని మురారి అనగానే.. కృష్ణ ఏడుస్తుంది. నాకెవరూ లేరూ.. బయట చీకటి.. బోరున వర్షం.. చుట్టూ అడవి.. క్రూరజంతువులు పొంచి ఉన్నాయి ఆ శివన్న లాగా.. వర్షంలో తడవకుండా ఉండటానికి గొడుగు పట్టాడానికి నాన్న లేడు.. కొంగు కప్పడానికి అమ్మ లేదు.. నాకెవరూ లేరు ఏసీపీ సర్ అని కృష్ణ ఏడుస్తుంటే తనని దగ్గరికి తీసుకుంటాడు మురారి. ఆ తర్వాత తనని ఇంట్లోకి తీసుకెళ్తాడు మురారి.
మరుసటి రోజు ఉదయమే దేవుడికి మొక్కుకుంటుంది కృష్ణ. అలా కృష్ణ పూజ చేయడం చూసిన ముకుంద.. ఏంటి కృష్ణ ఈ రోజు పూజలో ఉన్నావ్? దేవుడిని ఏం కోరుకుంటున్నావని అడుగగా.. నా కోరిక దేవుడే పరిష్కారిస్తాడు.. నీ సమస్యని నువ్వు పరిష్కరించుకోమని ముకుందతో చెప్పేసి కృష్ణ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోవైపు మురారి తన గదిలోని డైరీ తీసి రాసుకుంటాడు.. కృష్ణ ఎందుకు అలా చేసింది.. నామీద ప్రేమ ఉందో లేదో చెప్తుందని ఆశిస్తే తనేమో ఇలా చేసిందని అందులో రాసుకుంటాడు. ఆ తర్వాత గోడలకి ఉన్న కృష్ణ సెల్ఫీ పోటోలని చూస్తుండగా.. కృష్ణ వచ్చి ఏం చూస్తాన్నారని అడుగగా.. ఈ తింగరిపిల్లనేనా నిన్న రాత్రి అలా చేసిందని ఆలోచిస్తున్నానని మురారి అంటాడు.