జబర్దస్త్ ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. దాని కారణంగానే చాలా మంది ఇప్పుడు మూవీస్ లో అవకాశాలు తెచ్చుకున్నారు. హీరోస్ అయ్యారు. కొంతమంది ఇక్కడే తమ తమ సోల్ మేట్స్ ని చూసుకుని పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. అలా కెవ్వు కార్తిక్ జబర్దస్త్ షో ద్వారా అందరికీ బాగా తెలిసిన నటుడే..ఇప్పుడు కార్తిక్ ఒక ఇంటి వాడు కాబోతున్నాడు."మన జీవితంలోకి ఒక కొత్త పర్సన్ వస్తే జీవితం చాలా అందంగా, సంతోషంగా ఉంటుందని కొందరు చెప్పారు..బహుశా అది ఇదే కావొచ్చేమో..థాంక్యూ బ్యూటిఫుల్..నా జీవితంలోకి వచ్చినందుకు...నీతో కలిసి కొత్త జర్నీ స్టార్ట్ చేయాలనీ ఉంది" అంటూ తన సోల్ మెట్ తో కలిసి ఉన్న ఒక ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు.
కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఆమె ఫేస్ ని మాత్రం రివీల్ చేయలేదు. ఈ విషయం తెలిసిన వెంటనే జబర్దస్త్ అభి "కంగ్రాట్యులేషన్స్ బ్రో...పెళ్లి తర్వాత చాలా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్న" అంటూ మెసేజ్ చేసాడు. అలాగే గెటప్ శీను, ప్రియాంక సింగ్, జోర్దార్ సుజాత అందరూ విషెస్ చెప్పారు. "వదినని ఎప్పుడు చూపిస్తావ్..త్వరగా ఫేస్ చూపించు" అంటూ నెటిజన్స్ కూడా కార్తిక్ ని అడుగుతున్నారు. కెవ్వు కార్తిక్ స్టార్టింగ్ లో కంటెస్టెంట్ గా వచ్చి ఇప్పుడు టీం లీడర్ అయ్యాడు. జీ తెలుగులో వచ్చిన "కామెడీ క్లబ్" అనే షో ద్వారా తన కెరీర్ ని స్టార్ట్ చేసాడు.