స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -110 లో.. కావ్య, శృతి ఇద్దరు రాహుల్ నిజ స్వరూపం బయట పెట్టడానికి సాక్ష్యాల కోసం అతను ఎప్పుడు వెళ్లే హోటల్ కి వెళ్తారు. అక్కడ ఉన్న మేనేజర్ ని బెదిరించి రాహుల్ గురించి అడిగి తెలుసుకుంటారు. సీసీ టీవీ ఫుటేజ్ ని చూపించమని కావ్య హోటల్ మేనేజర్ ని అడుగుతుంది. రాహుల్ ఆ ఫుటేజ్ ని డిలీట్ చేసాడని చెప్పడంతో కావ్య, శృతి ఇద్దరు వెళ్ళిపోతారు.
మరొకవైపు కళ్యాణ్, అప్పు ఇద్దరు కలిసి స్వప్నని తీసుకువెళ్ళడానికి వస్తారు. అప్పుడే కనకం నిశ్చితార్థం కోసం స్వప్నని హాల్లోకి తీసుకువస్తుంటే.. స్వప్న కళ్ళు తిరిగి కిందపడిపోతుంది. అక్కడే ఉన్న అరుణ్ స్వప్న చెయ్యి పట్టుకొని చెక్ చేస్తాడు. అతను చెక్ చేసి.. ఈ ఎంగేజ్ మెంట్ జరగదు.. స్వప్న ప్రెగ్నెంట్ అని చెప్తాడు. దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. మరొకవైపు రాహుల్, వెన్నెల ఎంగేజ్ మెంట్ జరుగుతుంటుంది. లగ్నపత్రిక కూడా ఇప్పుడే పెట్టండని రుద్రాణి అంటుంది. ఎందుకు అంత తొందర అని అపర్ణ అంటుంది. ఏం తెలియకుండా నీ కొడుకు విషయంలో నువ్వు తొందరపడ్డావ్.. నా కొడుకు విషయంలో అలా కాదు.. అరుంధతీ నీ ఫ్రెండ్ కదా అని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత తాంబూలాలు మార్చుకుంటారు. మరొకవైపు కావ్య, శృతి హోటల్ నుండి బయటకు వస్తుంటే వారికి ఎదురుగా ఇంకొక సీసీటీవీ ఉండడంతో అక్కడికి వెళ్లి మేం పోలీసలమని చెప్పి.. ఇక్కడ దొంగతనం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ కావాలని సెక్యూరిటీని అడుగుతారు.. ఆ సెక్యూరిటీ సీసీటీవీ ఫుటేజ్ ని చూపిస్తాడు. అందులో స్వప్న పెళ్లిలో నుండి లేచిపోయిన రోజున ఏం జరిగిందోనని చూడగా.. ఆ ఫుటేజ్ లో రాహుల్ స్వప్న ఇద్దరు కలిసి వాళ్ళ బ్యాగ్ లతో ఎదురుగా ఉన్న హోటల్ లోకి వెళ్ళేదంతా రికార్డు అయి ఉంటుంది. కావ్య తన ఫోన్ లోకి ఆ వీడియోని పంపించుకుంటుంది. ఆ తర్వాత అక్కడ నుండి వచ్చేస్తారు.
మరొకవైపు స్వప్న ప్రెగ్నెంట్ అని తెలిసి కనకం, కృష్ణమూర్తి బాధపడుతుంటారు. ఇప్పుడు బాధపడడం కంటే దీనికి కారణమైన వాడితోనే దీని పెళ్లి చెయ్యాలి.. అందుకు కావ్య అక్క చాలా కష్టపడుతుంది. ఇప్పుడు అక్కడకి తీసుకెళ్లాలని అప్పు అంటుంది. అప్పు, కళ్యాణ్ ఇద్దరు కలిసి స్వప్నని ఎంగేజ్ మెంట్ దగ్గరికి తీసుకెళ్తారు. రాహుల్, వెన్నెలను చూసిన స్వప్న షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.