లైంగిక ఆరోపణలతో జైలుకెళ్లిన జానీ మాస్టర్ రీసెంట్ గా బెయిల్ పై విడుదల ఐన విషయం తెలిసిందే. అలాంటి జానీ మాష్టర్ ఈరోజు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ పెట్టారు. ఇప్పుడు అది వైరల్ అవుతోంది. జానీ మాష్టర్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరితో కలిసి ఉన్న పిక్ అది. ఐతే ఇప్పుడు జానీ మాష్టర్ తన మూవీ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. త్వరలోనే మంచి అప్డేట్ తో రాబోతున్న అంటూ ఒక వీడియోను కూడా పోస్ట్ చేసాడు. రామ్ చరణ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’లోని ‘డోప్’ సాంగ్ తో జానీ మాస్టర్ ఆడియన్స్ ముందు రాబోతున్నారు. వైవిఎస్ చౌదరితో ఫోటో దిగడాన్ని బట్టి ఏదో ప్రాజెక్ట్ రాబోతోంది అన్న విషయం అర్ధమవుతోంది. ఒకప్పుడు ఆయన ఎన్నో మూవీస్ తీశారు. కానీ ఇప్పుడు వస్తున్న నటీ నటులు, కొత్త కొత్త కంటెంట్ కారణంగా ఆయన కొంత వెనుకబడిపోయారు. ఇక ఇప్పుడు ఆయన కూడా మళ్ళీ యాక్టివ్ అయ్యారు.
ప్రెజెంట్ ఆయన విశ్వ విఖ్యాత సీనియర్ నటుడు నందమూరి తారక రామారావు మునిమనవడు, హరికృష్ణ మనవడు నందమూరి తారక రామారావుతో డెబ్యూ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైవిఎస్ చౌదరిని జానీ మాస్టర్ తన భార్యతో వెళ్లి కలిశారు. దాంతో ఆ పిక్ ని పోస్ట్ చేసి ఒక కామెంట్ కూడా పెట్టారు “చాలా రోజుల తర్వాత జెమ్ లాంటి పర్సన్ ఐన డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గారిని కలిసాను. నా కెరీర్ స్టార్టింగ్ లో ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్, ఆయన చెప్పిన మాటలు నాకెంతో బూస్టింగ్ ఇచ్చాయి. తెలుగులో డాన్స్ మాస్టర్లకు మంచి అవకాశాలు ఇచ్చి, ఎదగడానికి సహాయం చేసిన అతి కొద్ది మంది డైరెక్టర్స్ ఆయన కూడా ఒకరు. ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని రాసారు. అంటే ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్న పరిస్థితుల కారణంగా అవకాశాలు వెంటనే వచ్చే పరిస్థితి లేదు. అంటే మళ్ళీ కెరీర్ ని ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తున్నా..అప్పట్లో ఎలా లిఫ్ట్ ఇచ్చారో ఇప్పుడు కూడా వైవిఎస్ చౌదరి అలాగే లిఫ్ట్ ఇస్తున్నారు అనే అర్ధం ఐతే జానీ మాష్టర్ కామెంట్ లో కనిపిస్తోంది. అంటే ఈ మూవీలో ఆయన కొరియోగ్రాఫర్ గా ఛాన్స్ ఇచ్చారు అనే టాక్ నడుస్తోంది.