బీబీ జోడి నెక్స్ట్ వీక్ ప్రోమో మంచి కలర్ ఫుల్ గా తయారై వచ్చేసింది. ఇందులో డ్యాన్సులు చూస్తే అందరూ పోటాపోటీగా చేశారు. డైరెక్టర్స్ స్పెషల్ థీమ్ కాబట్టి ముందుగా అఖిల్-తేజు వచ్చి "అదరగొట్టు..గొట్టు" సాంగ్ కి పెర్ఫార్మ్ చేశారు. వీళ్ళ పెర్ఫార్మెన్స్ కానీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ప్రతీ వారం ఈ జోడీ కొత్తకొత్తగా ట్రై చేస్తూ ఆడియన్స్ లో ఒక గుర్తింపును తెచ్చుకుంటోంది. "అఖిల్ నీ ఎక్స్ప్రెషన్స్ చాలా అందంగా ఉన్నాయి. గడ్డం లేదు కదా ఇంకా బాగా కనిపిస్తున్నాయి" అని తరుణ్ మాస్టర్ కాంప్లిమెంట్ ఇచ్చారు. అవును మాస్టర్ మీరు చెప్పింది నిజమే "అఖిల్ అందంగా ఉన్నాడు..ఆయన ఎక్స్ప్రెషన్స్ ఇంకా అందంగా ఉన్నాయి" అంది జడ్జి సదా. సదా సిగ్గుపడుతున్నట్టు ఉన్నారు అని శ్రీముఖి అనేసరికి ఆమె నవ్వేసింది.
ఇక అక్కడ శ్రీముఖి సరదాగా ఒక "లుక్ ఛాలెంజ్" పెట్టింది సదాకి అఖిల్ కి మధ్యన. సదా అఖిల్ ని చూస్తే మధ్యలో నవ్వేసింది. తర్వాత అఖిల్-సదా కలిసి స్టేజి మీద డాన్స్ చేశారు. "అమ్మా సదా..తేజు చూడు ఎంత అందమైన పిల్ల .. అఖిల్ - తేజు పెళ్లి చేసుకుంటూ ఉంటే నువ్వు అఖిల్ తో కలిసి పార్కుల్లో డాన్స్ చేయడం న్యాయంగా ఉందా" శ్రీముఖి సరదాగా ఫన్ చేసేసరికి అందరూ నవ్వేశారు. తర్వాత ఆర్జే సూర్య-ఫైమా జోడి వచ్చి "చామంతి పువ్వా..పువ్వా" సాంగ్ కి డాన్స్ చేశారు. వీళ్ళ డాన్స్ కి సదా ఫుల్ ఫిదా ఐపోయింది. జడ్జెస్ అంతా లేచి నిల్చున్నారు. ఇక కౌశల్ వాళ్ళ డాన్స్ కి 4 మార్క్స్ ఇచ్చాడు. పదికి నాలుగు మార్కులా అని శ్రీముఖి అనేసరికి కౌశల్ జోడి అభినయశ్రీ కూడా షాకయ్యింది. "ఈ మార్క్స్ ఎందుకు ఇచ్చానో తెలుసా..ఆ స్ట్రాటజీ యూజ్ చేసి మీరు మార్క్స్ ఇస్తున్నారు కదా నేను కూడా అలా ఇస్తే మీకు ఆ బాధ తెలుస్తుందని ఇచ్చాను" అన్నాడు కౌశల్.ఆ మాటలకు అభినయశ్రీ అవాక్కైపోయింది.
"స్ట్రాటజీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నా..అసలు స్ట్రాటజీ పుట్టిందే మీ నుంచి" అని స్ట్రాంగ్ కౌంటర్ వేసింది ఫైమా. తర్వాత కౌశల్-అభినయశ్రీ కలిసి "ధంధంధం" అని అఖండా మూవీలో సాంగ్ కి డాన్స్ చేశారు. వాళ్ళ డాన్స్ కి అఖిల్ పదికి ఆరు మార్కులు ఇచ్చాడు. "ఎలివేషన్ ఓకే కానీ తర్వాత ఎనర్జీ మొత్తం డ్రాప్..అన్ సింక్ " అని చెప్పాడు. "నాకు ఇంత కంటే ఎక్కువ ఎనర్జీ రాదు. నీకు పాతికేళ్ళు నాకు నలభై ఏళ్ళు. ఐనా నేను చేస్తున్నాను ఈ స్టేజి మీద అంటే నా రక్తం మరిగింది కాబట్టి అంతే" అని ఫుల్ ఫైర్ అయ్యాడు.