![]() |
![]() |
మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో లేటెస్ట్ ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగింది. ఈ షోలో కొన్ని సినిమా పేర్లు చెప్పి వాటిని వాళ్ళ పార్టనర్ దగ్గర అభినయించి చూపించమని చెప్పింది శ్రీముఖి. దానికి వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్పేలా ఈ టాస్క్ ఇచ్చారు. అలాగే ఈ సెగ్మెంట్ అయిపోయాక డాన్స్ కూడా చేయించారు. ఇక నూకరాజు - ఆసియ వంతు వచ్చేసరికి వాళ్ళు "గుట్ట కింద గుంపుచెట్ల నిండ " అనే జానపద గీతానికి డాన్స్ చేశారు. ఐతే ఈ సాంగ్ ని 2024లో డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా సింగర్ గా డాన్సర్ గా ఆసియాతో కలిసి చేసాడు అలాగే సాంగ్ ని లిరిక్స్ రాసిన ప్రభతో కలిసి పాడాడు. ఇక్కడ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ లో ఆ సాంగ్ కి డాన్స్ చేసేసరికి జడ్జెస్ అంతా ఫిదా అయిపోయారు. "సర్ ఈ సాంగ్ నేనే పాడాను. 47 మిలియన్స్ రీచ్ అయ్యింది సర్..ఇంకోటి 38 మిలియన్స్ రీచ్ అయ్యింది" అని చెప్పాడు.
"నువ్వు పాడిన పాటా" మల్లొకసారి పాడు అంటూ పాడించుకున్నారు. "అసలే మా అనిల్ రావిపూడి గారు కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ కి అవకాశం ఇస్తూ ఉంటారు. మరి ఎదో ఒక రోజున ఆయన సినిమాలో కూడా పాడే అదృష్టం " అంటూ శ్రీముఖి నూకరాజు గురించి చెప్పుకొచ్చింది. దాంతో అనిల్ రావిపూడి "ఏమో జరగొచ్చు" అన్నారు. ఆయన దగ్గరకు వెళ్లి డాన్స్ చేయలేదని ఫీలవుతున్నారు అంటూ నూకరాజుని అనిల్ రావిపూడి దగ్గరకు పంపించింది శ్రీముఖి. ఇక అనిల్ రావిపూడి కూడా నూకరాజు వేసిన స్టెప్ నచ్చి డాన్స్ చేశారు. "నూకరాజు బయటికొచ్చాక కనబడు ఒకసారి " అని చెప్పేసరికి అందరూ ఖుషీ అయిపోయారు.
![]() |
![]() |