![]() |
![]() |

జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్యరావుకు తెలుగు రాదని అందరూ అనుకుంటున్నారు. ఆ మాటకు ఆమెకు చాలా కోపం వచ్చేసింది. ఇక ఆ కోపంలో దడదడా తెలుగులో మాట్లాడేసింది. రాబోయే వారం జబర్దస్త్ ప్రోమోలో ఈ బిట్ చూస్తే చాలు నవ్వాపుకోలేరు ఎవ్వరైనా సరే.
రాకెట్ రాఘవ స్కిట్ పూర్తయ్యాక కొత్త యాంకర్ కి ఒక టాస్క్ ఇచ్చాడు "ఆరు ఎర్ర లారీలు, ఆరు నల్ల లారీలు" అని టకటకా చెప్పు అనేసరికి తెలుగులో ఆ వాక్యాలను చెప్పింది. "సౌమ్యకు తెలుగు తెలీదా..భలే మంచి రోజు కార్యక్రమంలో పంచ్ కే పంచ్ వేసే హైపర్ ఆదికి పంక్చర్ చేసి జనాల మెప్పు పొందిన ఈ సౌమ్య ఆరోజు మాట్లాడిన భాష ఏమిటి ..తెలుగు భాష..ఇంత చేస్తున్నా మళ్ళీ మళ్ళీ ఆ అమ్మాయికి తెలుగు రాదని చెప్పి అవహేళన చేయడం ఎంత అవివేకం, ఎంత కుసంస్కారం" అని తెలుగులో చెప్పేసరికి అందరూ షాకైపోయారు.
![]() |
![]() |