Home  »  TV News  »  పవర్ లిఫ్టర్ ప్రగతి పై సుధీర్ కవిత

Updated : May 31, 2026

సిల్వర్ స్క్రీన్ మీద ప్రగతి అంటే చాలు హోమ్లీ రోల్స్ లో కనిపిస్తూ అందరినీ అలరిస్తూ ఉంటారు. అలాంటి ప్రగతి ఇప్పుడు ప్రతీ ఒక్క అమ్మాయికి ఒక రోల్ మోడల్ లా ఉండేలా ఇన్స్పైర్ చేస్తున్నారు. జీ అప్సర అవార్డును ఆమె రీసెంట్ గా అందుకున్నారు.  "ప్రగతి ప్రగతి మిమ్మల్ని చూడగానే పోయింది నా మతి. మీ ముందు చేయను నేను అతి. మీరు నవ్వితే చాలు నా మనసు అవుతుంది కోతి " అంటూ హోస్ట్ సుధీర్ వెయిట్ లిఫ్టర్ ప్రగతి మీద మంచి కవిత చెప్పాడు. ఐతే అది డైరెక్ట్ గా ఆమెను చూస్తూ కాకుండా ఆమె ఎక్కడ కొడుతుందో అని భయపడి ఇటు వైపు తిరిగి చెప్పేసరికి ప్రదీప్ ఆటపట్టించాడు. ప్రగతి సిల్వర్ స్క్రీన్ మీద అమ్మగా, అక్కగా, అత్తగా చాలా రోల్స్ లో నటించారు.

ఇక ఇప్పుడు ఆమె వెయిట్ లిఫ్టర్ గా తన లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ పవర్ లిఫ్టింగ్ వీడియోస్ ని చేస్తూ వయసు ఒక అంకె మాత్రమే అంటూ ఎంతో మంది అమ్మాయిలకు ఇన్స్పైరింగ్ గా ఉంటోంది. ఇక ప్రగతి కూడా మాట్లాడారు. "నా నటనకు ఎంత రికగ్నిషన్ వచ్చిందో నా స్పోర్ట్ కి కూడా అంతే వచ్చింది. ఈ అవార్డు ఇచ్చిన జీ తెలుగును మర్చిపోను.  ఈ అవార్డు నాకు చాల స్పెషల్. ఈ అవార్డు నాకు చాల ఎనర్జీ ని ఇచ్చింది. జులైలో నేషనల్ ఉంది. నవంబర్ లో కామన్ వెల్త్ ఉంది. ఈ అవార్డు ఇచ్చిన ఎనర్జీ తో ఇంకా ముందుకు వెళ్తాను " అంటూ చెప్పారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఎఫ్ 2 మూవీలో ప్రగతి చెప్పే డైలాగ్ బాగా ఫేమస్ అయ్యింది. "ఎంత పెడతారు మీ అమ్మాయికి కట్నం అంటే " "ఎంతుంటే అంత " అంటూ సినిమా మొత్తం ఈ డైలాగ్ వినిపిస్తుంది.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.