![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్నా సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -79 లో.... కిచెన్ లో మురళి ఉండగా నందు వస్తుంది. అక్కడ కింద నూనె ఉండడంతో దానిపై నందు కాలు వేస్తుంది. నందు జారీ పడిపోబోతుంటే తనని మురళి పట్టుకుంటాడు. అప్పుడే జాను రాగానే నందు అక్కడ నుంచి వెళ్తుంది. బావ వంట ఎక్కడవరకు వచ్చిందని జాను అడుగుతుంది. ఇదిగో అయిపోయిందని మురళి అంటాడు. అప్పుడే బాబిన్ బయటనుంచి ఫుడ్ తీసుకొని వస్తుంది. అది జాను చూసి నవ్వుకుంటుంది.
ఆ తర్వాత అందరు భోజనం చెయ్యడానికి సిద్ధంగా ఉంటారు. అప్పుడే ఇంటికి పోలీసులు వచ్చి మురళిని అరెస్ట్ చేస్తామని అంటారు. ఎందుకని జాను ఆడుగుతుంది. అతను సింహాద్రి కొడుకుని కొట్టాడు అంట.. అతను కంప్లైంట్ ఇచ్చాడని ఇన్స్పెక్టర్ అంటాడు. మీరు ఏం మాట్లాడుకున్న కోర్ట్ లో మాట్లాడుకోండి అని ఇన్స్పెక్టర్ చెప్పేసి మురళిని అరెస్ట్ చేస్తారు. అమ్మ నువ్వు టెన్షన్ పడకు స్టేషన్ కి మేమయ వెళ్తామని శారదతో జానూ చెప్తుంది. జాను, నందు ఇద్దరు స్టేషన్ కి వెళ్తారు. మరొకవైపు జాను బొమ్మ గ్రద్ద లాగా డ్రాయింగ్ వేస్తుంది నిత్య. జానూకి సూర్య ప్రపోజ్ చేసే వీడియోని చూస్తూ కోపంతో రగిలి పోతుంది. ఒసేయ్ జానూ నీకు నా బావ కావల్సి వచ్చాడా అని నిత్య అనుకుంటుంది. అప్పుడే భువన ఫోన్ చేస్తుంది. ఇప్పుడే వీడియో చూస్తున్నా అత్త అని నిత్య చెప్తుంది. ఆ వీడియో నీకెవరు పంపారని భువన అడుగుతుంది. కళ్యాణ్ పంపాడని నిత్య చెప్తుంది. నువ్వు ఏం టెన్షన్ పడకు దాని సంగతి నేను చూసుకుంటానని భువన అంటుంది అప్పుడే సూర్య ఫోన్ కి జాను ఫోన్ చేస్తుంది. సూర్య లిఫ్ట్ చేసి మాట్లాడుతాడు. జాను జరిగింది చెప్తుంది. సూర్య వెళ్తుంటే ఎక్కడికి అని భువన అడుగుతుంది. సూర్య వినకుండా వెళ్ళిపోతాడు. నిత్య లైన్ లోనే ఉంటుంది. అదీ వాడి వరుస అని భువన అంటుంది.
ఈ వారం లో నీ బర్త్ డే వుంది కదా ఆ రోజు మీ పెళ్లి గురించి అనౌన్స్ చేస్తానని భువన అనగానే థాంక్స్ అత్త అని నిత్య అంటుంది. మరొకవైపు మురళిని పోలీసులు కొడతారు. అయ్యో బావ అని నందు ఎమోషనల్ అవుతుంది. నా భర్తని ఎందుకు కొట్టారని నందు అడుగుతుంది. మురళి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇందాక ఏం అన్నావు నందు అని ఆడుగుతాడు. మీరు మళ్ళీ ఒకసారి చెప్పమనండి సర్ అని మురళి అనగానే అతను ఎవరు అమ్మ అని ఇన్స్పెక్టర్ అడుగుతాడు. నా మెడలో తాళి కట్టిన భర్త.. అతనికి ఎవరు లేరు అనుకున్నారా ఈ నందు ఉంది అని నందు అనగానే మురళి హ్యాపీగా ఫీల్ అవుతాడు. తరువాయి భాగంలో తన గురించి కళ్యాణ్ తప్పుగా చెప్తున్నాడు. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాధపడుతారని గౌతమి కత్తితో చేతికి కట్ చేసుకోవాలని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
SEO Keywords:
![]() |
![]() |