![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -513 లో..... వల్లి ప్రెగ్నెంట్ కాదన్న విషయం బయటపెట్టడానికి డాక్టర్ దగ్గరికి నర్మద వెళ్తుంది. ఫేక్ రిపోర్ట్స్ ఆ రోజు మీరు వల్లికి ఇచ్చారు.. గుర్తువచ్చిందా అని నర్మద అడుగుతుంది. దాంతో డాక్టర్ టెన్షన్ పడుతూ నాకేం తెలియదని అంటుంది. మీరు ఇప్పుడు ఎందుకు అబద్దం చెప్పారో చెప్పకపోతే ఇప్పుడే పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తానని నర్మద బెదిరిస్తుంది.
దాంతో వల్లి వాళ్ళ అమ్మగారు నా కూతురు కాపురం కాపాడమని రిక్వెస్ట్ చేస్తే అబద్దం చెప్పానని డాక్టర్ చెప్తుంది. ఈ విషయం అందరి ముందు చెప్పమని నర్మద అనగానే ప్లీజ్ నన్ను వదిలెయ్యండి.. నా హాస్పిటల్ పేరు పోతుందని డాక్టర్ రిక్వెస్ట్ చెయ్యడంతో నర్మద వెళ్తుంది. మరొకవైపు ప్రేమ డ్యాన్స్ కోసం రెడీ అవుతుంది. రాజపుష్పం తన దగ్గరికి వచ్చి డ్యాన్స్ రెహర్సల్ చేద్దామని తనకి దగ్గరగా వస్తాడు. ఒరేయ్ ఏం చేస్తున్నావ్రా అని ప్రేమ కోప్పడుతుంది. ప్రేమ ఫోన్ అతను తీసుకుంటాడు. డోర్ వేసుకుంటుంది. నువ్వు బయటకు రావాలంటే డోర్ తియ్యాలని రాజపుష్పం అంటాడు. మరొకవైపు ధీరజ్ ఫుడ్ డెలివరీ కోసం వెళ్తాడు. అక్కడ ఫుడ్ ఆర్డర్ చేసింది ప్రేమ ఫ్రెండ్. నువ్వు ఏంటి ఇక్కడ మీ అమ్మకి సీరియస్ అన్నావని ధీరజ్ అడుగుతాడు. తను టెన్షన్ పడుతుంటే ప్రేమ ఎక్కడ అని అడుగుతాడు. ప్రేమ డ్యాన్స్ కాంపిటేషన్ కి వెళ్ళిందని తను చెప్తుంది. దాంతో ప్రేమకి ధీరజ్ ఫోన్ చేస్తాడు.
రాజ పుష్పం లిప్ట్ చేసి ఫోన్ మ్యూట్ లో పెడతాడు. అతను కిటికీ దగ్గరికి వెళ్లి మీ అయన ఫోన్ చేసాడు. నువ్వు ఎంత అరిచినా వినపడదని రాజపుష్పం అంటాడు.ఏంటి ప్రేమ ఎక్కడున్నావని ధీరజ్ అంటాడు మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటే ఎలా అని ధీరజ్ ఫోన్ కట్ చేస్తాడు. మరొకవైపు వేదవతి దగ్గరికి నర్మద వచ్చి వల్లి ప్రెగ్నెంట్ అబద్ధం డాక్టర్ నాకు చెప్పిందని చెప్తుంది. నువ్వు చేస్తుంది చాలు.. ఆపు.. చేసింది తప్పు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నావా అని నర్మద మాటలు వేదవతి నమ్మదు. అబార్షన్ అయిందని చెప్పిన డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు విషయం బయటపెట్టొచ్చని నర్మద అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |