![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-129 లో.. మహా వాళ్ళ ఇంటికి చక్రి రాగానే తను చూసి.. మీకు ఏం కాలేదు కదా.. నేను టెన్షన్ పడ్డానని అంటుంది. చక్రి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు. ఇక ఆది వచ్చి చక్రి కాలర్ పట్టుకొని.. రేయ్ డబ్బు, నగలు ఎక్కడరా అని కోపంగా అడుగుతాడు. ఆది వదిలెయ్ పోతే పోనీ డబ్బు అని ప్రతాప్ అంటాడు. ఏంటి పోతే పోనియ్ ఆ.. చాలా తెలివిగా మాట్లాడుతున్నారే. చక్రి అసలు ఏం అయింది.. ఎక్కడికి వెళ్ళావ్ .. ఏం జరిగిందని మహా అడుగుతుంది. నన్ను ఒక బ్యాచ్ కిడ్నాప్ చేశారని చక్రి చెప్తాడు. ఇదో కొత్త డ్రామానా అని చక్రిని ఆది నిలదీస్తాడు. నా దగ్గర సాక్ష్యం ఉందని చక్రి అంటాడు.
ఇక చక్రి బయటకు వెళ్ళి మాధవ, కన్నాలని తీసుకొని వస్తాడు. మా తమ్ముడిని కొట్టి చంపాలని చూసారు. మేం రాకపోతే శవం కూడా దొరికేది కాదని మాధవ, కన్నా చెప్తారు. వీళ్ళంతా కావాలనే ఇలా చేస్తున్నారు. నా మీద లేనిపోనివి చెప్తున్నారని ప్రతాప్ అంటాడు. నన్ను చంపాలని చూశారని చక్రి అనగానే ఎవరు.. ఎవరు చంపారంటూ మహా అంటుంది. ఎవరో చెప్పు బాబు కాల్చి చంపేస్తానని ప్రతాప్ యాక్ట్ చేస్తాడు. అవునా అయితే ఆగండి అని చెప్పి మళ్ళీ బయటకు వెళ్తాడు చక్రి. ఇక ఒక రౌడీని కేశవ ఆవేశంగా తీసుకొచ్చి మహా కాళ్ళ దగ్గర పడేస్తాడు. రేయ్ ఎవడ్రా నువ్వు.. అంటు కేశవ మీదకి ఆది వెళ్ళగానే తనను కేశవ కొడతాడు. నాకు ఆవేశం ఎక్కువుతుందని కేశవ అనగానే ఆది సీరియస్ అవుతాడు. ఒక్క నిమిషంరా ఆది.. కారణం లేనిదే కేశవ కోప్పడడు.. ఏం జరిగిందని మహా అడుగుతుంది. ఇక ఆ రౌడీని కొట్టి జరిగింది చెప్పమని చెప్తారు. ప్రతాప్, ఆది, లలిత కలిసి ఇలా చేశారని వాడు చెప్తాడు. దాంతో మహా షాక్ అవుతుంది.
ఇక జరిగిందంతా గుర్తుచేసుకుంటుంది మహా. నిన్ను మోసం చేస్తున్నారు వీళ్ళంతా అని ప్రతాప్ అనగానే చక్రి తన ఫోన్ కాల్ రికార్డింగ్ వినిపిస్తాడు. అందులో ప్రతాప్ ఛాలెంజ్ చేసింది ఉంటుంది. చక్రి వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుండి ప్రతాప్ చేసిందంతా యాక్టింగ్ అని తెలుసుకొని వాళ్ళని తిడుతుంది మహా. అసలు మీరు నా కన్న తండ్రి ఆ.. నీ కూతురు కోసం అక్కడ ఒకరిని చంపేస్తారా అని ఇంత రాక్షసంగా ఎలా ఆలోచిస్తున్నారంటూ మహా కోప్పడుతుంది. ఆ తర్వాత లలితని అసలు నువ్వు అమ్మవేనా.. కొడుకు తప్పు చేస్తే తప్పని చెప్పాలి.. భర్త తప్పు చేస్తే తప్పు అని చెప్పాలి అంతేగానీ ఇలా వాళ్ళతో కలిసి కుట్ర చేస్తావా అంటూ మహా తిడుతుంది. ఆ తర్వాత వాళ్ళని అసహ్యించుకొని బయటకు వస్తుంది. ఆ తర్వాత చక్రి కూడా వాళ్ళని తిట్టేసి బయటకు వస్తాడు. ఇక అందరు బయటకు వచ్చాక మాధవ లోపలికి వెళ్ళి.. ఇకనైనా మారండి అంటూ చెప్తాడు. ఐశ్చర్యం అంటే బాగా సంపాదించి బీరువాల్లో దాచుకోవడం కాదు. నగలు, డబ్బు కాదు.. అందరు కలిసి ఒక చోట ఉండటం.. ఒకరికి బాధొస్తే నలుగురు పంచుకోవడం.. ఒకరికొకరు ప్రేమతో కొసరి కొసరి వడ్డించుకొని తినడం అంటూ మాధవ చెప్తాడు. ఇది చెప్పడానికి రాలేదు.. నా తమ్ముళ్ళు నాకు ప్రాణం.. వాళ్ళని కంటికి రెప్పాలా సాకాను.. ఇక మీదట వాళ్ళ జోలికి వస్తే మీకు మాములుగా ఉండదు.. నేను మేస్త్రీని.. నాకు ఇల్లు కట్టడమే కాదు సమాధులు కట్టడం కూడా వచ్చు అని మాధవ వార్నింగ్ ఇస్తాడు. అదంతా కన్నా చూసి బయటకు వచ్చి కేశవ, చక్రి, మహా ముగ్గురికి చెప్తాడు. ఇక అందరు వచ్చాక సారీ నన్ను క్షమించండి అని మహా అంటుంది. పదండి వెళదామని అనుకుంటారు. ఇక అక్కడ డ్రైవర్ ఉంటే వాడి దగ్గర కార్ కీస్(తాళాలు) తీసుకొని వస్తాడు చక్రి. రేపు ఇంటికి మా కార్ తీసుకొని వచ్చి మీ అయ్యగారి కార్ తీసుకొని వెళ్ళు అని డ్రైవర్ తో మహా అంటుంది. ఆ తర్వాత అందరు కార్ లో ఇంటికి బయల్దేరతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |