Home  »  TV News  »  Brahmamudi : వెంకీని కాపాడిన నందు.. శోభనం విషయంలో భ్రమరాంబ సంబరాలు!

Updated : Jun 3, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1048 లో.....ఇందుకి దగ్గరగా రాజు వెళ్తాడు. ఏంటి దగ్గరికి వస్తున్నావని ఇందు భయపడుతుంది. రాజు ఒక్కసారిగా నవ్వుతు ఇలా చేస్తే నీ రియాక్షన్ ఎలా ఉంటుందోనని టెస్ట్ చేసాను అంతే కానీ ఇవన్నీ మనకి సెట్ కావు.. అద్దె మొగుడు అంటే నా లిమిట్స్ లో నేను ఉంటానని రాజు అంటాడు.బఆ తర్వాత నువ్వు నేలపై పడుకో నేను బెడ్ పై పడుకుంటానని ఇందు అంటుంది. రోజు నేను కింద పడుకుంటున్నాను కదా.. ఈ ఒక్క రోజు బెడ్ పై పడుకుంటానని రాజు అంటాడు.

అయినా ఇందు వినకుండా బెడ్ పై పడుకుంటుంది. మరొకవైపు నందు ఫోన్ చేస్తుంటే వెంకీ ఫోన్ కట్ చేస్తాడు. దాంతో నందు టెన్షన్ గా ఇంటికి వస్తుంది. చలపతి, లక్ష్మిలని వెంకీ ఎక్కడ అని నందు అడుగుతుంది. గదిలో ఉన్నాడని వాళ్ళు చెప్తారు. గది దగ్గరికి వెళ్లి డోర్ కొడుతుంటే వెంకీ ఎంతకూ డోర్ తియ్యకపోయేసరికి కిటికీ లో నుండి చూస్తారు. వెంకీ తన చెయ్ కట్ చేసుకుంటాడు. దాంతో నందు డోర్ విరగొట్టి లోపలికి వస్తుంది. డాక్టర్ ని పిలిపించి ట్రీట్ మెంట్ చేయిస్తుంది. కొద్దీగా అయితే నరం కట్ అయ్యేది .. ప్రమాదం ఏం లేదని డాక్టర్ చెప్తాడు. ఎందుకు ఇలా చేసావ్ రా నీకు జాబ్ లేకపోతే ఏంటి.. నేను లేనా అని చలపతి ఎమోషనల్ అవుతాడు. తన కొడుకుకి ఏదైనా అయితే ఆ తల్లి దండ్రలు ఎలా తట్టుకుంటారని వెంకీతో నందు చెప్తుంది. వెంకీని నందు మోటివేట్ చేస్తుంది. చాలా థాంక్స్ అమ్మ అని చలపతి చెప్తాడు. నాకు నా గురించి కంటే వాడి గురించే టెన్షన్ అంకుల్.. వాడు అమాయకుడని నందు చెప్తుంది.

మరొకవైపు అసలు శోభనం జరిగిందా లేదా అని రేఖ ఒకవైపు.. భ్రమరాంబ మరొకవైపు టెన్షన్ పడుతారు. అప్పుడే పైనుంచి రాజు వస్తాడు. రాజు బెహేవ్ ఇంకా మాటలు చూసి శోభనం జరిగిందనేట్లుగా ఉంటాయి. భ్రమరాంబ మనసులో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి రేఖ అసలు ఆ ట్యాబ్లెట్ పని చెయ్యలేదా అని భ్రమరాంబ అంటుంది. తరువాయి భాగంలో ఇందుని సీఈఓ చేస్తానని భ్రమరాంబ వాళ్ళతో రేఖ అంటుంటే.. ఆ మాటలు ఐశ్వర్య వింటుంది. ఇందు సీఈఓ అవ్వడనికి వీల్లేదని ఎవరికో ఫోన్ చేసి ఐశ్వర్య మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.