Home  »  TV News  »  Illu illalu pillalu : ధీరజ్ రొమాంటిక్ బ్లాక్‌మెయిల్.. ప్రేమ ఎస్ఐ కోచింగ్‌కు గ్రీన్ సిగ్నల్!

Updated : Jun 3, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -487 లో.....భాగ్యం, ఆనందరావు ఒకరికొకరు దెబ్బలకి మందు రాసుకుంటారు. ఇన్ని రోజులు నిన్ను కొట్టింది మనసులో పెట్టుకొని నన్ను కొట్టినవ్ కదా అని ఆనందరావుతో భాగ్యం అంటుంది. అదేం లేదే వాళ్ళకి కొట్టె ఛాన్స్ ఇస్తే ఏకంగా ఐసీయూలో ఉండే వాళ్ళమని ఆనందరావు అంటాడు. అప్పుడే వల్లి, సుకన్య వాళ్ళ దగ్గరికి వస్తారు. వాళ్ళు జరిగింది మొత్తం చెప్తారు. అంటే ఇంట్లో గొడవకి కారణం మనమే అని తెలిసిందా అని వల్లి షాక్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో ఏమోనని వల్లి భయపడుతుంటే.. నువ్వు ఏం టెన్షన్ పడకు.‌ ముందు అయితే మీ నాన్నని క్యాషియర్ గా రైస్ మిల్ లో కూర్చొపెట్టాలని భాగ్యం వాళ్ళకి ఏదో ప్లాన్ చెప్తుంది. ఆ తర్వాత ధీరజ్ ని కేసు లో ఇరికించాలని భద్రవతి రౌడీకీ ఫోన్ చేసి మాట్లాడుతుంది. అతను అంతా సిద్ధంగా ఉందని చెప్తాడు.

మరొకవైపు ధీరజ్ చేతికి మల్లెపులు చుట్టుకొని హాల్వా పట్టుకొని ప్రేమ దగ్గరికి వస్తాడు‌. ఏంట్రా అని ప్రేమ అంటుంది. ఈ రోజు మన ఫస్ట్ నైట్ అని ప్రేమని దగ్గరికి తీసుకుంటాడు ధీరజ్. ఒరేయ్ ఏంట్రా ఇంత సడెన్ గా ఇలా బిహేవ్ చేస్తున్నావని ప్రేమ అంటుంది. ఆగు మా నర్మద అక్కని పిలుస్తానని ప్రేమ అంటుంది. హా పిలుపు మా వదినని అని ధీరజ్ అంటాడు. ప్రేమ పిలవగానే నర్మద వస్తుంది. ఏంటి అక్క వీడు చేతికి మల్లె పులు, హాల్వా పట్టుకొని వచ్చి SI కోచింగ్ కి ఒప్పుకుంటావా లేక ఫస్ట్ నైట్ ఆ అని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ప్రేమ చెప్తుంది. నేనా అని ఏం తెలియనట్లు యాక్టింగ్ చేస్తాడు ధీరజ్.

ఆ తర్వాత నర్మద వాళ్ళ ఫైట్ చూడలేక వెళ్తుంది. ధీరజ్ లోపలికి వెళ్ళాక మల్లెపూలు తన తల్లో పెట్టి హాల్వా తినిపించి.. ప్లీజ్ SI కోచింగ్  కి ఒప్పుకోమని రిక్వెస్ట్ చేస్తాడు. దానికి ప్రేమ ఒప్పుకుంటుంది. మరొకవైపు సుకన్య, వల్లి కావాలనే యాక్టింగ్ చేస్తుంటారు.. మా నాన్నకి ఎండలో పని చేస్తే వడదెబ్బ కొట్టిందట అని సుకన్యతో శ్రీవల్లి చెప్తూ ఏడుస్తుంటే చందు వస్తాడు. మా నాన్నకి వడదెబ్బ కొట్టిందట అని వల్లి అనగానే అప్పుడే ఇడ్లీ, వడ తీసుకొని ధీరజ్ మధ్యలో ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.