Home  »  TV News  »  సుడిగాలి సుధీర్ కి థ్యాంక్స్ చెప్పిన పవన్ కళ్యాణ్.!

Updated : May 15, 2026


పవన్ కళ్యాణ్ అన్న పేరు వింటేనే చాలు ఎంతవారిలో ఐనా ఆటోమేటిక్ గా ఊపొచ్చేస్తుంది. అలాంటి పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా మొన్నటి ఎన్నికల్లో ఎంతో మంది జనసైనికుల్లా ఆయన వెంట వెళ్లి ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఐతే సుడిగాలి సుధీర్ ఆయన కోసం ప్రచారం చేసిన వ్యక్తుల్లో ఒకరు. సర్కార్ సీజన్ 6 లో రీసెంట్ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ గురించి సుడిగాలి సుధీర్ ఆయనలా ఇమిటేట్ చేస్తూ చెప్పిన కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. "పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసావు. ఆయనతో జరిగిన ఇంటరాక్షన్ జరిగింది కదా " అని విష్ణు ప్రియా అడిగింది. "  రీసెంట్ గా జరిగిన ఎన్నికల ప్రచారం సమయంలో పవన్ కళ్యాణ్ గారు  నడుస్తుంటే ఆయన వెనక 200 మంది నడుస్తున్నారు.

అందుకే నేను ఒక పక్కన దూరంగా నిలబడ్డా. సుధీర్ అని పిలిచారు సర్ సర్ అన్నాను. థ్యాంక్యూ సుధీర్ మీ అమూల్యమైన సమయాన్ని ప్రచారానికి కేటాయించనందుకు మనం డెఫినెట్లీ మళ్ళీ కలుద్దాం అని అన్నారు. నాకేమీ అర్ధం కావడం లేదు. నాది అమూల్యమైన టైం ఏంటి నేను ప్రచారానికి కేటాయించడం ఏంటి ? చూస్తే చాలు ఆయన గెలిస్తే చాలు అని ఆయన ప్రచారానికి వెళ్లిన వాళ్ళం మేము.

ఈ అపురూపమైన ఇద్దరు వ్యక్తులతో నా జీవితంలో మర్చిపోలేని రెండు సంఘటనలు జరిగాయి. ఇక మొన్నటి ఎన్నికల సమయంలో హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ మాత్రమే కాదు జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ టీమ్స్ లో ఉన్న కమెడియన్స్ అంతా వెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొని పవన్ కళ్యాణ్ గెలుపు కోసం  వాళ్ళు ఎంతో కృషి చేశారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.