![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -114 లో..... గాయత్రి తన భర్త వినోద్ తో కలిసి మాధవ ఇంటికి భోజనానికి వస్తుంది. వినోద్ వాళ్ళతో బాగా కలిసిపోయి మాట్లాడతాడు. బావ మంచి అమ్మాయిని చూసి నువ్వు పెళ్లి చేసుకోమని గాయత్రి అంటుంది. మాకు తెలిసిన వాళ్లలో చూస్తాను.. మా నాన్నకి మాధవ గారు అంటే చాలా ఇష్టం.. తనకి కూడా చెప్తానని వినోద్ అంటాడు. ఆ తర్వాత చక్రిని మహా పక్కకి తీసుకొని వెళ్తుంది. కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చారు.. వాళ్ళకి బట్టలు పెట్టాలి.. అది కూడా తెలియదా అని మహా అంటుంది
దాంతో చక్రి తన దగ్గరున్న ఒక కొత్త వాచ్ ని తీసుకొని వచ్చి మహాకి ఇస్తాడు. ఇది ఇద్దామని చక్రి అనగానే మహా బాగుందని అంటుంది. ఆ తర్వాత గాయత్రికి మహా డ్రెస్ పెడుతుంది. వినోద్ కి చక్రి వాచ్ ఇస్తాడు. దేవుడికి మొక్కుకొని నారాయణ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు ఇద్దరు. అక్కడ నుండి బయల్దేరతారు. గాయత్రి వెళ్తూ వాళ్ళ వంక చూస్తూ బాధపడుతుంది. ఆ తర్వాత గాయత్రి ఇంటికి వెళ్ళాక తన ఫోన్ లో ఉన్న మాధవ ఫోటో ని డిలీట్ చేస్తూ బాధపడుతుంది. అప్పుడే వినోద్ వచ్చి నువ్వేం బాధపడకు మీ వాళ్ళని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు రావచ్చు అని వినోద్ చెప్తాడు. ఆ తర్వాత గాయత్రి తన అత్తారింటికి వెళ్తుంటే తాయారు ఏడుస్తుంది. కానీ గాయత్రి సైలెంట్ గా ఉంటుంది. నీ బావ కోసం కన్నీరు కార్చావ్ .. ఈ అమ్మని వదిలి వెళ్తుంటే నీ కంట్లో ఒక్క చుక్క కూడా రావడం లేదని తాయారు అంటుంది. అలా చేసుకుంది నువ్వే.. ఇప్పుడు మీరంతా హ్యాపీనే కదా.. నేను ఓడిపోయాను మీరే గెలిచారు వెళ్ళొస్తానని చెప్పి గాయత్రి వెళ్ళిపోతుంది. మరొకవైపు మహాకి ఇంటర్వ్యూ కోసం మెయిల్ వస్తుంది. అది చూసి మహా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ విషయం ఇంట్లో అందరికి చెప్తుంది.
సరే అమ్మ నువ్వు వెళ్లి ప్రిపేర్ అవ్వు.. నీకేం కావాలో నేను చూసుకుంటానని మాధవ అంటాడు. మహా ప్రిపేర్ అవుతుంటే హారిక ఫోన్ చేసి నిన్ను చూడడానికి మీ ఇంటికి వస్తున్నానని అంటుంది. దాంతో మహా కంగారుపడుతుంది. కన్నాకి విషయం చెప్తుంది. నువ్వు వెళ్లి జ్యూస్ తీసుకొని రా అని మహా పంపిస్తుంది. కన్నా తన అన్నలకి ఫోన్ చేసి విషయం చెప్తాడు. దాంతో చక్రి ఇంటికి వస్తాడు. తరువాయి భాగంలో చక్రిని హారిక పక్కకి తీసుకొని వెళ్లి తన లైఫ్ ఇది కాదు.. నువ్వు తనని ఒప్పించి నా ఫ్రెండ్ దగ్గరికి పంపించు అని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |