![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1030 లో..... అందరి ముందు రాజు ఎక్స్ ట్రాలు చేస్తాడు. పక్కకి తీసుకొని వచ్చి ఇందు తనకి క్లాస్ తీసుకుంటుంది. ఏదో ఉరుములు మెరుపులు అంటున్నావని ఇందు కోప్పడుతుంది. అందరు మనం పెళ్లి చేసుకున్నామంటే నమ్మలని అలా చెప్పానని రాజు అంటాడు. వాళ్ళని నమ్మించడం కోసం నా క్యారెక్టర్ బ్యాడ్ చేస్తావా అని ఇందు అంటుంది. అలా మాట్లాడినందుకు పేమెంట్ లో రెండు వేలు కట్ అని ఇందు అంటుంది. వద్దని రాజు రిక్వెస్ట్ చేస్తాడు. ఇప్పుడు దీని టైమ్ నడుస్తుంది. మనకేమో డబ్బు కావాలని రాజు అనుకుంటాడు.
మరొకవైపు భ్రమరాంబ టెన్షన్ పడుతుంది. ఇప్పుడు ఇందు, రాజు పెళ్లిని రేఖ అంగీకరించలేదు కాబట్టి వాళ్ళని విడగొట్టాలని ప్రయత్నం చేస్తుంది. వాళ్ళని విడగొట్టి ఇందుతో మదన్ ని ఇచ్చి పెళ్లి చేస్తే నా కూతురికి అన్యాయం జరుగుతుంది.. సో రేఖకి ఆ ఆలోచన రాకుండా చేస్తానని శేషుతో భ్రమరాంబ చెప్తుంది. ఆ తర్వాత ఐశ్వర్యకి రాజు ఎదురుపడతాడు. నా డబ్బు ఎక్కడ అని అడుగుతుంది. నాకు టైం ఇవ్వు అని రాజు అడుగుతాడు. ఐశ్వర్య వినదు. దాంతో మీ ఆంటీ దగ్గరికి వెళ్లి నువ్వే కిడ్నాప్ చేయించవని చెప్తానని రాజు అనగానే ఐశ్వర్య సైలెంట్ అవుతుంది.
మరొకవైపు రేఖ, భూషణ్, భ్రమరాంబ ముగ్గురు ఉంటారు. వాళ్ళ దగ్గరికి ఇందు వెళ్లి నాకు ఇష్టం లేకుండా ఇదంతా జరిగింది ఆంటీ అని యాక్టింగ్ చేస్తుంది. అయితే తనకి విడాకులు ఇస్తావా అని రేఖ అనగానే ఇస్తాను ఆంటి అని ఇందు నమ్మిస్తుంది. రేఖ నీకు మైండ్ పని చేస్తుందా సంవత్సరం అయితేనే విడాకులు వస్తాయని భ్రమరాంబ అంటుంది. అవును కదా అని రేఖ అనుకుంటుంది. ఇందు వెళ్ళాక ఎలాగూ తనకి పెళ్లి అయింది. ఇప్పుడు తన వేలిముద్ర చెల్లుతుంది. ఆస్తులన్నీ మన పేరున మార్చుకోవచ్చని రేఖ అనుకొని వెళ్లి లాయర్ తో మాట్లాడమని భూషణ్ కి చెప్తుంది. హమ్మయ్య సంవత్సరం వరకు కలిసి ఉంటారని భ్రమరాంబ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు చలపతికి లక్కీ ఫోన్ చేసి రాజు గురించి అడుగుతాడు. ఫోన్ కలవట్లేదని చెప్తాడు. దాంతో ఎక్కడికి వెళ్ళాడని టెన్షన్ పడతారు. తరువాయి భాగంలో చలపతి ఇంటికి అపర్ణ వెళ్లి రాజు మీ కన్నా బిడ్డ కాదు కదా అని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |