![]() |
![]() |
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -265 లో...... సుధ ని షష్టిపూర్తికి రప్పించడానికి గంగ, రుద్ర ప్లాన్ చేస్తారు. సుధా వస్తున్న విషయం వీరుకి రుద్ర చెప్తాడు. పెద్దనాన్న అత్తమ్మ వస్తే హ్యాపీగా ఉంటాడు.. ఎలాగూ నువ్వే అన్ని ఏర్పాట్లు చేస్తున్నావ్ కదా.. అత్తమ్మని కూడా నువ్వే ఆహ్వానించమని రుద్ర చెప్తాడు. అదేంటి బావ అత్తయ్యకి తెలిస్తే కోప్పడతారని వీరు అంటాడు. అదేం లేదు నువ్వు అయితే నీ ఏర్పాట్లు నువు చేసుకోమని రుద్ర అంటాడు.
లక్ష్మీ, పైడిరాజు ఇద్దరు సుధాని తీసుకొని వస్తారు. నాకు భయంగా ఉంది రుద్ర.. నేను తిరిగి వెళ్ళిపోతానని సుధా అంటుంది. అదేం లేదు అత్తయ్య.. మీరు లోపలికి రావాలని రుద్ర అంటాడు. అప్పుడే రాఘవ వస్తాడు. సుధా దాక్కుంటుంది. రాఘవ వెళ్ళిపోయాక వీరుకి సుధాని పరిచయం చేస్తాడు. నువ్వే లోపలికి ఆహ్వానించమని రుద్ర అంటాడు. రండి అని వీరు అనగానే రండి ఏంటి పిన్ని అను అని రుద్ర చెప్తాడు. ఇక అప్పుడే శకుంతల గుమ్మంవైపు చూడకుండా ఇషిక కవర్ చేస్తుంది. సుధాకి గంగ బొట్టు పెట్టి లోపలికి ఆహ్వానిస్తుంది. శకుంతలకి కన్పించకుండా సుధా ఉంటుంది. ఆ తర్వాత పెద్దసారు దగ్గరికి రుద్ర వెళ్లి.. పెద్దనాన్న నువ్వు హ్యాపీనా అని అడుగుతాడు. నా చెల్లి వస్తే హ్యాపీగా ఉండేవాడిని అని పెద్దసారు అనగానే అటువైపు చూడమని రుద్ర అంటాడు. పక్కకి తిరిగి చూసేసరికి అక్కడ సుధా ఉంటుంది. తనని చూసి పెద్దసారు హ్యాపీగా ఫీల్ అవుతాడు.
సుధా దూరం నుండి వాళ్ళ షష్టి పూర్తి వేడుకని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు ఇంట్లో అందరికి సుధాని చూపించాలని రుద్ర, గంగ ప్లాన్ చేస్తారు. ఇందుమతిని గంగ పక్కకి తీసుకొని వెళ్తుంది. ఫంక్షన్ కి అందరు వచ్చారా అత్తయ్య అని గంగ అడుగుతుంది. మా ఆడపడుచు రాలేదని ఇందుమతి అనగానే వచ్చిందని గంగ చెప్తుంది. కిచెన్ లోకి ఇందుమతిని తీసుకెళ్ళి సుధాని చూపిస్తుంది. ఇక సుధాని పట్టుకొని ఇందుమతి ఎమోషనల్ అవుతుంది. సూర్య, వంశీ, స్నేహని పరిచయం చేస్తుంది గంగ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |