![]() |
![]() |
.webp)
ఈ మధ్య కాలంలో అమరదీప్ షోస్ లో బాగా కనిపిస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాడు. అలాగే ఒక మాస్ జాతర అనే షోకి హోస్ట్ గా చేస్తున్నాడు. అలాగే ఒక షోకి గెస్ట్ గా వచ్చి చాలా కామెడీ చేసాడు. అదే వ్వాట్ ది ఫిష్ అనే షో. ఈ షోకి పవిత్ర హోస్ట్ గా చేస్తోంది. "రీసెంట్ టైములో నీ లైఫ్ లో జరిగిన వాట్ ది ఫిష్ మూమెంట్ ఏంటి" అని అడిగింది. "రెండు నెలల నుంచి ఇంట్లో ఉండడం" అన్నాడు. " 10 సెకన్స్ లో నీకు తెలిసిన క్యూట్ బూతులన్నీ చెప్పాలి" అని పవిత్ర అడిగేసరికి షాకయ్యాడు. "పచ్చ కామెర్లదాన, వానపాముల జుట్టు, బూతద్దాల పెదాలు, గబ్బిలం ముక్కు, కప్ప గొంతు ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు" అన్నాడు.
"ఏ ఫ్రెండ్స్ తో నువ్వు ఇవి ఎక్కువగా వాడుతూ ఉంటావ్" అని అడిగింది. "నీకు తెలుసుగా" అన్నాడు. "అరియానా, రీతూ చౌదరి" అని చెప్పింది. "రీసెంట్ గా నువ్వు ఎవరితో డేట్ కి వెళ్లినట్టు ఇమాజిన్ చేసుకున్నావ్" అని అడిగింది. "ఆపరేషన్ అయ్యి బెడ్ మీద పడుకున్నాక నర్సమ్మ వచ్చింది. అనెస్తీషియా ఇచ్చాక ఆవిడతో ఎక్కడికి వెళ్ళానో గుర్తు లేదు" అన్నాడు. "నర్సును కూడా వదల్లేదు. కల్లో ఐనా నర్సు కదా. ఆమె సిస్టర్ కదా " అంది. "సిస్టర్ అనే పిలిచాను" అంటూ కామెడీ చేసాడు. "డ్రింకింగ్ కెపాసిటీ ఎంత" అని అడిగింది. "హాఫ్" అన్నాడు.
పవిత్ర ఆలోచిస్తుండగా "రెండు క్వార్టర్స్ " అన్నాడు. "అంటే "నాకు తెలీదు కదా .. పవిత్ర అంటే నిప్పు నిప్పు అంటే పవిత్ర" అంది. "అబ్బా వాటర్ ప్యాకెట్ తీసుకుని పోసేది నువ్వేగా " అన్నాడు అమరదీప్. "చి అలా చేయకు. నీకంటే పెళ్లయ్యింది. నాకు అవ్వద్దా ఏంటి "అంది పవిత్ర.
![]() |
![]() |