![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకు చేరుకుంది. కంటెస్టెంట్స్ ఎవరి ఊహలకి అందకుండా తమ పర్ఫామెన్స్ ఇస్తున్నారు. పదమూడో వారం ఇమ్మాన్యుయేల్, పవన్ కళ్యాణ్ పడాల మినహా మిగిలిన ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్లో ఉన్నారు. మరి వారిలో ఎవరికి ఎంత ఓటింగ్ ఉందో ఓసారి చూసేద్దాం.
ఎప్పటిలాగే ముప్పై శాతం ఓటింగ్ తో తనూజ టాప్ లో ఉంది. రీతూ చౌదరి 15.25 శాతంతో రెండో స్థానంలో ఉంది. 15.19 శాతం ఓటింగ్ తో సంజన గల్రానీ మూడో స్థానంలో ఉంది. 13.85 శాతం ఓటింగ్ తో భరణి నాల్గవ స్థానంలో ఉన్నాడు. ఇక డీమాన్ పవన్, సుమన్ శెట్టి ఇద్దరు 12 శాతం ఓటింగ్ తో డేంజర్ జోన్ లో ఉన్నారు. అన్ అఫీషియల్ ఓటింగ్ ప్రకారం సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతాడు. కానీ ఇప్పటి వరకు సుమన్ శెట్టికి బిగ్ బాస్ ఫుల్ సపోర్ట్ ఉంది. పన్నెండు వారాలు హౌస్ లో ఏ గేమ్ ఆడకపోయినా, ఎంటర్టైన్మెంట్ ఇవ్వకపోయినా తనని హౌస్ లో ఉంచుతూ వచ్చాడు బిగ్ బాస్. అయితే సుమన్ శెట్టి హౌస్ లో ఉండటం వల్ల స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినటువంటి డీమాన్ పవన్ కి అన్యాయం జరుగుతుంది.
ప్రతీసారీ టాస్క్ లో బెస్ట్ ఇచ్చే కంటెస్టెంట్స్ కి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే హౌస్ లో ఎంత పర్ఫామెన్స్ ఇచ్చినా ఓటింగ్ లో సుమవ్ శెట్డి ఉంటే మెజారిటీ ఓటింగ్ అతడికే పడుతోంది. దాంతో మిగిలిన కంటెస్టెంట్స్ కి ఓటింగ్ పెద్దగా పడటం లేదు. ఎవరూ ఊహించని విధంగా ఈ వారం భరణికి మెరుగైన ఓటింగ్ పడుతోంది. ఎప్పటిలాగే దత్తపుత్రిక తనూజ టాప్ లో ఉంది. నామినేషన్లో ఉన్నవారిలో మీ ఓట్ ఎవరికో కామెంట్ చేయండి.
![]() |
![]() |