జబర్దస్త్ కమెడియన్ సన్నీ కామెడీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐతే ఇండస్ట్రీలో చాలామంది ప్రేమించుకున్న వాళ్ళు ఉన్నారు విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ముందు ఇండస్ట్రీలో పని చేసేవాళ్ళతో పెళ్లి అంటే చాలు చాలా మంది వెనకా ముందు ఆలోచిస్తూ ఉంటారు. ఐతే జబర్దస్త్ లో ఇన్నేళ్ళుగా కామెడీ పండిస్తున్న సన్నీ గురించి తెలుసు కానీ అయన లైఫ్ లో ఒక లవ్ ఫెయిల్యూర్ ఎపిసోడ్ అనేది ఉందని ఇంత వరకు ఎవరికీ తెలీదు. ఆయన పైకి కామెడీ పండిస్తున్నారు కానీ లోపల ఎంతో మనోవేదన అనుభవిస్తున్నారు అనే విషయం తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయం జబర్దస్త్ ఈ వారం ఎపిసోడ్ లో బయటపడబోతోంది.
ఈ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో రామ్ ప్రసాద్ వేసిన స్కిట్ లో సన్నీ ఒక వెరైటీ ప్రశ్న అడిగాడు "వ్యాలెంటైన్స్ డే ఫిబ్రవరి 14 కి మాత్రమే ఎందుకు వస్తుంది" అని దానికి రష్మీ ఆన్సర్ ఇచ్చింది. "ఎందుకంటే చిల్డ్రన్స్ డే నవంబర్ 14 కి వస్తుంది కాబట్టి" అనేసరికి అందరూ నవ్వేశారు. దాంతో రష్మీ సన్నీని ఇలా అడిగింది " ఇన్ని రోజుల నుంచి అడగాలనుకుంటున్నా కానీ అడగలేదు. మీ లవ్ స్టోరీ గురించి ఎప్పుడూ అడగలేదు. అసలు మీరు ఇప్పటి వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడిగింది. "నిజానికి నేను ఒక అమ్మాయిని ప్రేమించా. ఇద్దరం ఎనిమిదేళ్లు ప్రేమించుకున్నాం. చివరికి ఆ అమ్మాయి గవర్నమెంట్ జాబ్ ఉన్న అబ్బాయిని చూసుకుని పెళ్లి చేసేసుకుంది." అని చెప్పాడు. "మేడం నిజం చెప్పాలంటే సన్నీ కోటీశ్వరుడు. వీడి కోసం ఎన్ని సార్లు వాళ్ళ వాళ్ళు ఫోన్ చేస్తున్నా ఒక్క లవ్ ఫెయిల్యూర్ వల్ల సన్నీ తన లైఫ్ ని అలాగే వదిలేసుకున్నాడు" అంటూ రాంప్రసాద్ చెప్పాడు. అలా సన్నీ లైఫ్ లో కూడా ఒక లవ్ ఫెయిల్యూర్ ఉందన్న విషయం తెలిసింది.