అనసూయ ఒక బోల్డ్ యాక్టర్ మాత్రమే కాదు బోల్డ్ హోస్ట్ కూడా..ఎవరన్నా ఏమన్నా అంటే చాలు ఫైర్ బ్రాండ్ లా మీద పడిపోతుంది అనే కామెంట్స్ ఆమె మీద నిత్యం వస్తూనే ఉంటాయి. జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ యాంకర్ గా మారింది. అలాంటి అనసూయ ఒక ఇంటరెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ఇయర్ ఎండింగ్ వచ్చేసింది. ఈ ఇయర్ ఎవరికీ ఎం నేర్పిందో కానీ తనకు ఒక జీవిత పాఠం నేర్పింది అంటూ పోస్ట్ చేసింది. "మిమ్మల్ని మీలోని ట్రాన్సఫార్మ్ అయ్యే శక్తిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకండి. అలాగని మీ శక్తితో వేరే వాళ్ళని మార్చేయగలం అంటూ అతిగా కూడా ఆలోచించకండి. దేన్నైనా మార్చగల శక్తి ఒక్క ప్రేమకు మాత్రమే ఉందని గుర్తుంచుకోండి.
ఎందుకంటే ముళ్ళను ఎంత ఎక్కువగా ప్రేమించగలుగుతారో గులాబీలను కూడా అంతే ఎక్కువగా ప్రేమించే అవకాశం ఉంటుంది. అప్పుడే మీరు మరింత పవర్ ఫుల్ గా మారతారు" అంటూ రాసుకొచ్చింది అనసూయ. ఇక అనసూయ నటించిన 'రజాకర్' మూవీ త్వరలో ఓటీటీలోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఇక అనసూయ పెట్టిన ఈ పోస్ట్ కి నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. " అను లాంటి అమ్మాయి ఎక్కడా ఉండదు..మీరు గోర్జియస్" అంటున్నారు. అనసూయ క్షణం, రంగస్థలం, కథనం, విమానం , పుష్ప, కిలాడి వంటి మూవీస్ లో నటించింది. ముఖ్యంగా రంగస్థలం మూవీలో రంగమ్మత్తగా ఆమె నటనకు మంచి గుర్తింపు దక్కింది. దాంతో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది..