ఆహా ప్లాట్ఫార్మ్ మీద స్ట్రీమ్ అవుతున్న కాకమ్మ కథలు ఎపిసోడ్ లో శ్రీముఖి ఒక సెన్సేషనల్ కామెంట్ చేసింది. ఈ షోకి ఆర్జే చైతూ, యాంకర్ శ్రీముఖి గెస్టులుగా వచ్చారు. ఐతే ఇందులో అన్ని జానర్స్ లో గేమ్స్ ఆడించేసాక రాపిడ్ ఫైర్ అడిగింది తేజస్విని. ఐతే ఆమె అడిగిన ప్రశ్నలకు వరసగా ఇలా సమాధానాలు చెప్పింది శ్రీముఖి. "నా ఫేవరేట్ హోస్ట్ ఎవరూ లేరు. నా కో-హోస్ట్ ప్రదీప్ హోస్టింగ్ ఇష్టం. నేను హోస్ట్ చేసే అన్ని షోస్ లోకి ఆదివారం విత్ స్టార్ మా పరివారం అంటే ఇష్టం. ఆర్జే చైతుకు కొంచెం యాంకరింగ్ నేర్చుకోరా బాబు అని చెప్పాలనిపిస్తుంది.
బిగ్ బాస్ షోని నేను నాగార్జున గారి కన్నా కూడా బాగా హోస్ట్ చేయగలుగుతాను అని అనిపిస్తూ ఉంటుంది. చాలా మంది స్టార్స్ బిగ్ బాస్ కి హోస్ట్ చేశారు కానీ నేనుంటేనా బిగ్ బాస్ హౌస్ లోపలి వెళ్లి ఇంకా జాడించి మరీ గేమ్స్ ఆడించేలా హోస్ట్ చేసేదాన్ని. రణ్వీర్ సింగ్ తో పాన్ ఇండియా వరల్డ్ లెవెల్ లో మూవీ ఛాన్స్ వస్తే ఈ యాంకరింగ్ వదిలేసి యాక్టింగ్ కి వెళ్ళిపోతా. డాన్స్ రాకపోయినా మేనేజ్ చేసే హీరోయిన్ నయనతార. ఇన్ని రోజులు సింగల్ గా ఉన్నా కాబట్టి త్వరగా మింగిల్ కావాలని ఉంది.. సుమక్క హోస్టింగ్ ఇష్టం. అమ్మంటే ఇష్టం. నన్ను రాములమ్మ అన్నా శ్రీముఖి అన్నా ఇష్టమే." అంటూ చెప్పుకొచ్చింది శ్రీముఖి.. మరి బిగ్ బాస్ కి శ్రీముఖి హోస్ట్ కావాలని ఆరాటపడుతోంది కాబట్టి ఈ షో చూసాక నెక్స్ట్ సీజన్ బిగ్ బాస్ కి శ్రీముఖికి హోస్టింగ్ ఛాన్స్ ఏమన్నా ఇస్తారో లేదో చూడాలి.